ప్రభుత్వ కార్యాలయాల్లో దళితులను చిన్న చూపు చూస్తున్నవైనం…తెలంగాణ దళిత సంఘాల జేఏసీ జిల్లా అధ్యక్షులు సావనపెల్లి రాకేష్

ఇల్లంతకుంట:నేటిధాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో తెలంగాణ దళిత సంఘాల జేఏసీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు సావనపెల్లి రాకేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మండలములోని దళితులు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న అధికారులు పట్టించుకోకుండా కాలయాపన చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు.ప్రభుత్వ అధికారులు ప్రజలకు జవాబుదారిగా ఉండాలి కానీ నాయకులకు కాదు,ప్రజల పట్ల అధికారుల తీరు మార్చుకోవాలని కోరుతూ సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు.రెవెన్యూ శాఖలో పెండింగ్ లో ఉన్న భూముల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ లేని యెడల దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు.ఎన్ని ప్రభుత్వాలు మారిన దళితులను చిన్న చూపు చూస్తూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసే విధంగా తిప్పుకుంటూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రజా ప్రతినిధులు, నాయకులకు,పైరవీలు చేసే వారికి మాత్రమే అధికారులు పనులు చేస్తున్నారు,తప్ప దళిత సామాజిక వర్గం నుండి ఎవ్వరూ వెళ్లిన కూడా పనులు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.రెవెన్యూశాఖలో అయితే చెప్పనక్కర్లేదు ఎందుకంటే నిరంతర ప్రక్రియ,భూముల విషయంలో గత దశాబ్దాకాలంగా పెండింగ్ పలు అంశాలు వారి దృష్టికి తీసుకువెళ్లిన ఇప్పుడు చేస్తాం రేపు చేస్తాం అని కాలయాపన చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *