హనుమకొండ జిల్లా నేటిధాత్రి:
పోరాట పంథానే చివరకు సరైన మార్గమని, తన జాతి ప్రజలను విముక్తి చేస్తుందని అక్షరాల నమ్మిన ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీం అని హనుమకొండ సౌత్ మండల కమిటీ సభ్యులు ఎన్నము వెంకటేశ్వర్లు అన్నారు. సీపీఎం హనుమకొండ సౌత్ మండల కమిటీ సభ్యుడు దూడపాక రాజేందర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తను మాట్లాడుతూ అస్తిత్వ ఉద్యమాలు కొనసాగుతున్న నేటి తరుణంలో, 1940లోనే ఆత్మగౌరవం, స్వపరిపాలన పునాదులుగా కొమురం భీం సాయుధ తిరుగుబాటు చేశాడు అని అతని ముందు చూపు వివిధ ఉద్యమాలకు ప్రేరణగా నిలుస్తునదని బాబేఝురి లోద్దుల్లో పన్నెండు గూడేలపై రాజ్యాధికారం కోసం తుడుం మోగించిన కొమురం భీం వారసత్వం నేటికీ దండకారణ్యంలో కొనసాగుతున్నదని అన్నారు. నిజాం నవాబు పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా గిరిజనులను ఒక్కతాటిపై నడిపించి ఉద్యమించారని, ఆదివాసీలపై నిజాం నవాబు సాగించిన దోపిడీ, దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన కొమురం భీమ్ ‘జల్-జంగిల్-జమీన్’ నినాదానికి ప్రతీకగా నిలిచిపోయూడని తెలిపారు. ఈ కార్యక్రమంలో బానోతు రమ మరియు దుర్గ పాల్గొని కొమురం భీమ్ చిత్ర పటానికి పూల మల వేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సభ్యులు కళ్యాణ్, గౌతమి, సరిత, సుదర్శన్, పిటలి, లక్ష్మీ, విజయ, హరిష, పాశ, సలేమ, సమక్క, హైమ, సురభి, రజిత, తదితరులు పాల్గొన్నారు.