హనుమకొండ జిల్లా నేటిధాత్రి: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కోమరంభీమ్ 121వ జయంతి సందర్భంగా టీఆర్ఎస్ జిల్లా నాయకుడు కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు చల్లా వెంకటేశ్వర్ రెడ్డి కొమరం భీం చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. చల్లా వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ కొమురం భీమ్ నిజాం పాలకుల నిరoకుశత్వానికి అధికారుల దమన నితికి ఎదురు నిలిచి పోరాడిన ఆదివాసీల వీరుడని అన్నారు.జల్,జంగ్, జామిన్ అని నినదించి ఆదివాసీల హక్కుల కోసం ప్రాణాలు సైతం లెక్క చేయక ఉద్యమంలో తన ప్రాణాలను అర్పించిన ధిరోదాత్తుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సాధుల రఘుపతి, కుమార్ రెడ్డి, సిరి మల్లె ప్రవీణ్, చిర్ర శ్రవణ్, మాధారపు ఉదయ్ కిరణ్, మొట్ల శ్రీనివాస్, రాజ్ కుమార్, వెంకటేష్, సుమన్, తదితరులు పాల్గొన్నారు.