రాజన్న సిరిసిల్ల జిల్లా:ప్రతినిధి నేటిధాత్రి పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా
ఈ రోజు 17వ పోలీస్ బెటాలియన్ నందు పోలీస్ ఓపెన్ హౌస్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమాండెంట్ శ్రీ కె.సుబ్రమణ్యం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులకు పోలీస్ శాఖకు సంబంధించిన ఆయుధములు, ఆయుధ పరికరములు, కమ్యూనికేషన్ పరికరములకు సంబంధించిన వివరాలను విద్యార్థులందరికీ వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి వచ్చేసిన విద్యార్థులు అందరూ ఎంతో ఆసక్తిగా ఆయుధాల గురించి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ శ్రీ పార్థసారథి రెడ్డి , ఆర్.ఐ లు పి.నారాయణ ,డి.శంకర్ , పి.రాజేందర్ , శ్రీ బి. శ్రీధర్ , అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.