రామాయంపేట(మెదక్)నేటి ధాత్రి.
సైబర్ నేరాల పట్ల రామయంపేట లో విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది.
రామాయంపేట పట్టణంలోని స్నేహ జూనియర్ కళాశాల లో షీ టీం ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, తదితర అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా రామాయంపేట ఎస్సై రాజేష్ మాట్లాడుతూ విద్యార్థులు కచ్చితంగా సైబర్ నేరాలు మోసాలు పట్ల పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ విషయంలో ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని సూచించారు. అంతేకాకుండా విద్యార్థులకు ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఎక్కడ జరిగిన తమకు సమాచారం ఇవ్వాలని వివరాలు చెప్పిన వారి పేర్లు గోపియంగా ఉంచుతామన్నారు. విద్యార్థి దశ ఎంతో కీలకమని పేర్కొన్నారు. విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో షీ టీం కానిస్టేబుల్ కిరణ్, సిబ్బంది పాల్గొన్నారు.