వినోద్ రావుకు నివాళులర్పిస్తున్న ప్రెస్ క్లబ్ సభ్యులు

జర్నలిస్ట్ వినోద్ రావుకు ఘన నివాళి

వినోద్ రావు కుటుంబాన్ని ఆదుకుంటాం…

సీనియర్ పాత్రికేయులు కారంగుల వినోద్ రావు (45) ఇటీవలే అకాల మరణానికి గురయ్యారు. కొనరావుపేట మండలం బావసాయిపేట గ్రామానికి చెందిన కారంగుల వినోద్ రావు నవ తెలంగాణ దినపత్రికకు రాజన్న సిరిసిల్ల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేస్తున్నారు. గత వారం రోజుల క్రితం వినోద్ రావు తన ఇంట్లో ప్రమాదవశాత్తు జారిపడి తీవ్ర గాయాల పాలయ్యాడు. హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుది శ్వాస వదిలాడు. శుక్రవారం రాత్రి మృతుని స్వగ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. కామ్రేడ్ కారంగుల వినోద్ రావు కు వేములవాడ ప్రెస్ క్లబ్ 143 ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ సీనియర్ పాత్రికేయులు మాట్లాడుతూ కామ్రేడ్ కారంగుల వినోద్ రావు కుటుంబానికి టీయూడబ్ల్యూజే హెచ్ 143 అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ ల నేతృత్వంలో వినోద్ రావు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించేలా కృషి చేస్తామన్నారు. వినోద్ రావు మరణం జర్నలిస్టులోకానికి తీరని లోటన్నారు. కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు తాహెర్ పాషా, రేగుల రాంప్రసాద్, కొలిపాక నర్సయ్య, సభ్యులు దుర్గం పరశురాం, బూర్ల సందీప్, ప్రదీప్, రజనీకాంత్, అబ్బ గోని రవీందర్ గౌడ్, రాజు తదతరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!