నేలకొండపల్లి, అక్టోబర్, 10:
గుండె పోటుతో మృతి చెందిన గువ్వలగూడెం గ్రామస్తుడు
శాఖమూరి దుర్గాప్రసాద్ కు రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నివాళులర్పించారు. సోమవారం ఆయన నివాసానికి వెళ్లి దుర్గా ప్రసాద్ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. దుర్గాప్రసాద్ తనయుడు నవీన్, సోదరుడు మండల టీఆర్ఎస్ నాయకులు శాఖమూరి రమేష్ లను ఎంపీ ఓదార్చారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర అక్కడికి విచ్చేసిన గ్రామ టీఆర్ఎస్ నాయకులను ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో గువ్వలగూడెం గ్రామ సర్పంచ్ వంగూరి వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ కందుల వెంకటేశ్వర్లు, ఎంపిటిసి సభ్యులు వంగూరి ఉషా, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు లిక్కి వీరబాబు, పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.