టిపిసిసి అధ్యక్షులు శ్రీ. రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నేడు (17-09-2022) హనుమకొండ కాంగ్రెస్ భవన్ లో జాతీయ జెండా హనుమకొండ & వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ. నాయిని రాజేందర్ రెడ్డి గారు ఎగరవేశారు.*
అనంతరం ఈ సందర్భంగా శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ
1948, సెప్టెంబర్ 17న నిజాం నవాబు పాలిస్తున్న రాచరిక పాలన నుంచి హైదరాబాద్ రాష్ట్రానికి స్వాతంత్రం తెచ్చి తెలంగాణ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛ వాయువులు అందించడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర అత్యంత కీలకమని, బ్రిటిష్ రాచరిక పాలన ను అంతమొందించేందుకు జాతీయ కాంగ్రెస్ ప్రజా మద్దతుతో అనేక పోరాటాలు,
ఉద్యమాలు చేసి వందలాది మన మహా నేతలు నెలల తరబడి జైల్లో మగ్గి, సంవత్సరాల పాటు అలుపెరగని పోరాటాల ఫలితంగా బ్రిటిష్ పాలకులు 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు
దేశంలో అంతర్భాగంగా ఉన్న 560 సంస్థానాలను అప్పటి ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రు, అప్పటి హోమ్ శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ లు దేశంలో విలీనం చేసుకున్నారు. అలాగే అప్పట్లో మహారాష్ట్ర, కర్ణాటక లోని కొన్ని ప్రాంతాలతో కూడిన హైదరాబాద్ సంస్థానం కూడా దేశంలో విలీనం చేయాలని హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది. కానీ నిజాం సర్కార్, రజాకార్ల హైదరాబాద్ రాష్ట్రాన్ని స్వతంత్ర దేశంగా కానీ, పాకిస్తాన్ లో విలీనం అనే ప్రతిపాదనలు తెచ్చారు. అప్పుడు హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అత్యంత కీలకంగా వ్యవహరించి జాతీయ కాంగ్రెస్ నాయకులతో మన కాంగ్రెస్ నాయకులు రామనంద తీర్థ, జమలపురం కేశవరావు, బూర్గుల రామకృష్ణారావు తదితర మహా నాయకులు చర్చించి అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు, అప్పటి హోమ్ శాఖ మంత్రి సర్ధార్ వల్లభాయ్ పటేల్ లతో చర్చలు జరిపి ఆపరేషన్ పోలో ద్వారా హోమ్ శాఖ మంత్రి శ్రీ సర్ధార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ కి వచ్చి హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశం లో విలీనం చేసుకొని హైదరాబాద్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రాన్ని అందించారు.తర్వాత బాషప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు లో భాగంగా ఆంద్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక మూడు రాష్ట్రాలు ఏర్పడడంతో హైదరాబాద్ రాష్ట్రం మూడు భాగాలుగా విడిపోయి 10 జిల్లాల్లో తెలంగాణ గా, మూడు జిల్లాలు కర్ణాటక, మూడు జిల్లాలు మహారాష్ట్రలో కలిసిపోయాయి. తర్వాత 60 ఏళ్లపాటు మళ్ళీ 10 జిల్లాలతో కూడిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మొదలయిందని ఆ ఉద్యమాన్ని కూడా కాంగ్రెస్ గౌరవించి 10 జిల్లాలతో కూడిన ప్రత్యేక తెలంగాణ ను కూడా కేంద్రంలోని శ్రీమతి సోనియా గాంధీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2014 లో ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజల 60 ఏళ్ల ఆకాంక్ధాలను నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీ ఇలా దేశానికి స్వాతంత్రం తెచ్చింది,
హైదరాబాద్ రాష్ట్రానికి స్వేచ్ఛ వాయువులు అందించి రజాకార్ల నుంచి విముక్తి అందించిందని తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.
ఇంత గొప్ప ప్రజాసరాలను తీర్చిన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న పెద్దఎత్తున కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేయాలని నేడు టిఆర్ఎస్ బిజెపి పార్టీలు చేస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు ఈ దేశానికి రాష్ట్రానికి స్వాతంత్రం ప్రజలకు స్వేచ్ఛ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని అందించిన కాంగ్రెస్ పార్టీ చరిత్రను ఎవరు అపహాస్యం చేయాలని చూసిన ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య గారు మాజీ నగర మేయర్ శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ గారు మహ్మద్ అయూబ్ బంక సరల బొమ్మతి విక్రం అజీజుల్లా బేగ్ పెరమాండ్ల రామకృష్ణ బంక సంపత్ యాదవ్ పులి రాజు అంకూస్ రాహుల్ రెడ్డి సతీష్ సారంగం రమేశ్ తదితరులు పాల్గొన్నారు