కట్టాతో సుబ్బారావు మనసులో మాట.
`చిత్తశుద్ధి,లక్ష్యశుద్ది, కార్యసిద్ధి కలిస్తే కేసిఆర్…
`పట్టువదలని విక్రమార్కుడు కేసిఆర్…
`సంక్షేమ రథ సారథి కేసిఆర్…
`తెలంగాణలో నిరంతర విద్యుత్ కలగన్నామా!
` రైతుకు ఇంతటి భరోసా ఎప్పుడైనా చూశామా!
` తెలంగాణ వస్తే చాలనుకున్నాం…
`పరాయి పాలన పోవాలనుకున్నాం….
`తెలంగాణ సాధించడమే ఒక అధ్భుతమని అనుకున్నాం..
`తెలంగాణ వస్తే కేసిఆర్ ఇన్ని అద్భుతాలు సృష్టిస్తాడని అనుకోలేదు…
`చెరువులకు మళ్ళీ పూర్వ వైభవం ఊహకందని విషయం.
`కాళేశ్వరం ఒక భగీరథ ప్రయత్నం…
`తెలంగాణ వున్నంత వరకు కేసిఆర్ కీర్తి అజరామరం…
`కేసిఆర్ జాతీయ రాజకీయాలలో సక్సెస్ అవుతారు…
`కేసిఆర్ ప్రధాని కావడం ఇప్పటి తరానికి అవసరం…
`దేశమంతా సస్యశ్యామలం కావాలి.
`రైతు సుభిక్షమైన దేశ నిర్మాణం కావాలి.
`అన్ని వర్గాల అభ్యున్నతి కేసిఆర్ తోనే సాధ్యం…
`చూస్తూ వుండండి…కేసిఆర్ జాతీయ రాజకీయాలను శాసించడం చూస్తాం…
`కేసిఆర్ పిఎం కావడం ఖాయం..
`దేశాన్ని ప్రపంచంలో నెంబర్ వన్ చేయడం తధ్యం.
హైదరాబాద్,నేటిధాత్రి:
స్వేదం చిందించి, రెక్కలు ముక్కలు చేసుకొని, ఆరు గాలం కష్టపడి, కండలు కరుగుతున్నా, డొక్కలీడ్చుకుపోతున్నా, పొలం చూసి మురిస్తూ, సాగు చేసి, దేశానికి అన్నం పెట్టే రైతన్న అంటే ముఖ్యమంత్రి కేసిఆర్‌కు ఎంతో ప్రేమ. ఆ రైతు మేలు కోరే ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసిఆర్. దేశంలో ఇన్ని రాష్ట్రాలు వున్నా ఏ రాష్ట్రంలో రైతు గురించి ఇంతగా ఆలోచించే ముఖ్యమంత్రి ఎక్కడా లేడు. అదీ కేసిఆర్ ప్రత్యేకత…రైతు కోసం కేసిఆర్ సాగిస్తున్న పాలన. రైతు రాజ్యమే రామరాజ్యమని నమ్మి, అన్ని వర్గాల అభ్యున్నతి రైతు చిరునవ్వుల్లోనే వుందని నమ్మే ఏకైకనేత కేసిఆర్. రైతు సల్లగుంటే దేశమంతా సల్లగుంటుందని కేసిఆర్‌కు తెలుసు. పల్లె పచ్చగుంటే దేశమంతా పచ్చగుంటుందని కేసిఆర్‌కు మాత్రమే తెలుసు. సాగు కూడా ఒక విద్యనే…ఆ సాగు కూడా చైతన్యమే…బతుకంతా మెతుకులోనే…ప్రతి వ్యక్తి జీవితమంతా భూమితోనే ముడినడి వుంటుంది. ఆ జీవితమంతా సంతోషంగా, ఆనందంగా వుండాలంటే ముందు రైతు సుభిక్షంగా వుండాలి. రైతు క్షోభపడకుండా వుండాలి. అప్పుడు దేశ వికాసానికి తిరుగుండదు. మన దేశం ప్రపంచంలో తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు తిరుగుండదు. అది వర్తమాన రాజకీయాల్లో ఒక్క కేసిఆర్‌తోనే సాధ్యం…కేసిఆర్ మాత్రమే సుసాధ్యం చేసే నాయకుడు..అంటున్న రిటైర్డు రిజిస్ట్రార్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యోగ సంఘాల, కార్మిక సంఘాల తెలంగాణ ఉద్యమ జేఏసి చైర్మన్ పరిటాల సుబ్బారావు, ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావుతో తన మనసులోని మాట…సహజంగా ఎవరికైనా ముందు లక్ష్య సిద్ది కావాలి. తర్వాత చిత్త శుద్ది వుండాలి. అవి రెండూ కేసిఆర్‌లో మనసు నిండా వున్నాయి. తర్వాత కార్యశుద్ది కావాలి. దానికి పర్యాయపదమే కేసిఆర్. ఆయన తల్చుకుంటే సాధించలేనిది లేదని ఇప్పటికే ప్రపంచానికి నిరూపించారు. కాని ఒక విజయుడిగా మాత్రమే ఆయన అక్కడే ఆగిపోలేదు. తనలోని పోరాట యోధుడు విశ్రమించలేదు. తెలంగాణలోని ప్రతి ఒక్కరూ తెలంగాణ వస్తే చాలనకున్నారు. పరాయి పాలన పోతే చాలనుకున్నారు. కాని ఒక్క కేసిఆర్ మాత్రమే తెలంగాణ వస్తే ఏం జరగాలన్నది ఆలోచించారు. ఏం చేస్తే తెలంగాణ సస్యశ్యామలమౌతుందో నిర్ణయం తీసుకున్నారు. ఎన్ని సౌకర్యాలు కల్పిస్తే తెలంగాణ తిరుగులేని శక్తి కాగలుతుందని లెక్కలేసుకున్నారు. అసలు తెలంగాణకు ఏం కావాలన్నదానిపై పూర్తి అవగాహనతో ముందుకు సాగారు. ఆయన తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టిన నాడే పూర్తి నమ్మకంతో అడుగువేశారు… తెలంగాణ అభివృద్ధి కాంక్షతోనే అడుగులో అడుగువేశారు. అదే నేడు బంగారు తెలంగాణ నిర్మాణ దశ. అసలు ఎవరూ ఊహించలేదు. తెలంగాణ వస్తే నీళ్లొస్తాయంటే ఇలా ప్రతి పల్లెలోని చెట్టూ, పట్టా, చెలిమె తానాలాడేంత నీళ్లొస్తాయని కలగనలేదు. చెరువులు మళ్లీ నిండుతాయనుకోలేదు. వాటి రూపురేఖలు మళ్లీ పాత కాలం రోజులను తలపిస్తాయని కల గనలేదు. కొన్ని దశాబ్ధాలుగా పల్లెల్లోని చెరువుల్లో తట్టెడు మట్టి తీయని రోజులు నుంచి, చెరువుల్లో పూడికలు తీసే దాకా వస్తుందని అనుకున్నామా? తెలంగాణలోని 46వేల చెరువులు బాగు పడతాయని అనున్నది కాదు. నేడు గంగాళాల్లా ఎండా కాలంలో కూడ నీళ్లతో చెరువులు నిండుతాయనుకున్నామా? ఇదంతా ముఖ్యమంత్రి కేసిఆర్ అద్భుత సృష్టి కాదా! ఒకప్పుడు తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మాణం కోసం ఎందరు ప్రయత్నం చేసినా, నాటి ఉమ్మడి పాలకులు కాదన్నారు. కుదరదన్నారు. తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం సాధ్యం కాదన్నారు. ఎత్తిపోతలు తమ వల్ల కాదన్నారు.
చెరువులే చెల్లా చెదురు చేసిన వాళ్లు, రిజర్వాయర్లు నిర్మాణం గురించి ఏనాడు ఆలోచించలేదు. కాని నవతరం నాయకుడు, తెలంగాణ స్వాప్నికుడైన కేసిఆర్ కాళేశ్వరం నిర్మాణం చేసి, సాధ్యం కాదన్నది సుసాధ్యం చేశాడు. తెలంగాణలో గోదారి నీళ్ల పరవళ్లను గడపడగకు తెచ్చాడు. తెలంగాణ వచ్చినా పాలకుడుగా ఏ నాయకుడు వున్నా, తెలంగాణలో ఇప్పుడు మన కళ్లముందు సాక్ష్యాత్కారమౌతున్న ఏపని చూసే వాళ్లం కాదు… కోతలు లేని కరంటు అసలే చూసేవాళ్లం కాదు…ఉక్కపోతలు లేని రోజులు గడిపేవాళ్లం కాదు… మరి నేడు రెప్పపాటు కరంటు లేని తెలంగాణను కళ్లారా చూస్తున్నాం…ఉక్కపోతులో మగ్గిపోయిన జీవితాలను నేడు సంతోషంగా గడుపుతున్నాము. రైతుకు రైతు బంధు అనే పధకం ఒకటి అమలు చేసే అవకాశం వుందన్నది గతంలో ఏ నాయకుడైనా ఆలోచించారా? కనీసం వారి మదిలోకి అలాంటిది అమలు చేయొచ్చన్నది కలగన్నారా? ఎంత సేపు సాగు దండగ తప్ప, పండగ చేద్దామన్న వారు లేరు. కాని నేడు వ్యవసాయం ప్రతి ఇంటి పండుగగా మార్చిన ఏకైక నాయకుడు కేసిఆర్. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో అమలౌతున్న పధకాలు మరే రాష్ట్రంలో భూతద్దం వేసి వెతికినా ఒక్కటి కూడా కనిపించదు. తెలంగాణను అన్ని రంగాల్లో ముందంజలో నిలిపి, సంక్షేమ సారధిగా దేశమంతటా మన్ననలు పొందుతున్న ముఖ్యమంత్రి కేసిఆర్, ప్రజాసంక్షేమ, చైతన్యప్రగతి ప్రయాణం తెలంగాణతోనే ఆగిపోకూడదు. దేశం మొత్తం సస్యశ్యామలం కావాలి. అందుకు కేసిఆర్ నాయకత్వమే దేశానికి కావాలి. ఎందుకంటే స్వాతంత్య్రం వచ్చిన నుంచి ఎంతో మంది ప్రధాన మంత్రులు పనిచేశారు. రాష్ట్రాలన్నీంటిలో చూస్తే కొన్ని వందల మంది ముఖ్యమంత్రులు పాలించారు. కాని ఏ ఒక్క నాయకుడైనా రైతు గురించి ఆలోచించారా? జై కిసాన్ అన్నారు…కాని రైతుల బాగోగులు పట్టించుకున్నారా? గత పాలకులు నినాదాలకు పరిమితయ్యారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ఆచరణకు శ్రీకారమయ్యాడు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ఆరాధ్యుడయ్యాడు. అనేక రకాల సంక్షేమ పధకాలకు ఆధ్యుడయ్యాడు. ఎనమిది సంవత్సరాలుగా తెలంగాణలో అమలౌతున్న అనేక సంక్షేమ పధకాలు మాకు కావాలని దేశంలోని ప్రజలంతా కోరుకుంటున్నా, కేంద్ర ప్రభుత్వానికి చెవికెక్కడం లేదు.
ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చెవి మీద పేను కూడా పారడం లేదు. తెలంగాణలో సక్సెస్ ఫుల్‌గా పధకాలు అమలౌతున్నాయని తెలిసిన తర్వాత కూడా వాటిని అమలు చేద్దామన్న సోయి ఎవరికీ లేదు. అందుకే కేసిఆర్ నడుంబిగించాడు. కేసిఆర్‌ను మించిన నాయకుడు దేశంలోనే లేడు. ఆయనలా విజన్ వున్న నాయకుడు అసలే లేడు. గతంలో కేసిఆర్ తెలంగాణ ఉద్యమ బావుటా ఎగుర వేసిన నాడు ఆయన వెంట నడిచాం…ఆయన ఆశయ సాధనలో అడుగులో అడుగు వేశాం…తెలంగాణ కోసం కేసిఆర్‌తో కలిసి తెగించి కొట్లాడాం…ఇప్పుడు కూడా దేశం కోసం కేసిఆర్‌తో నడిచేందుకు మేమంతా సిద్దంగా వున్నాం…దేశ సౌభాగ్యం కోసం కేసిఆర్ లక్ష్య సాధనలో కలిసి పనిచేసేందుకు ఎల్లవేళలా సిద్దంగా వున్నాం…చాలా మందికి కేసిఆర్ అర్ధం కాడని అంటుంటారు…! మేధావి ముసుగేసుకున్న స్వార్ధ పరులకు కేసిఆర్ ఎప్పుడూ అర్ధం కాడు. సామాన్యులకు మాత్రమే ఆయన అర్దమౌతాడు. ఎందుకంటే ఆయన చెప్పే సాత్వికమైన తెలంగాణ యాసకూడా మర్చిపోయిన సోకాల్డ్ మేదావులకు కేసిఆర్ ఎప్పుడూ అర్ధం కాడు. పేదలను ప్రేమించే నాయకుడు ఎప్పుడూ అతితత్వమున్న వారికి నచ్చరు. అందుకే కేసిఆర్ పామరులకు అర్ధమైనంత తొందరగా పండితులకు అర్ధం కాదు. తెలంగాణ కోసం పిడికిలి బిబించి, జెండా ఎత్తిన నాడు కేసిఆర్ తో నడిచించి సామాన్యులే…! కాని మేధావి ముసుగేసుకున్న వారు ప్రశ్నించారు? అనుమానం వ్యక్తం చేశారు… శుభం పలకరా? అంటే అపశకునాలు పలికారు…తెలంగాణ వచ్చేదా…అని ఎగతాళి చేశారు. కాని ప్రజలు నమ్మారు. రైతులు నమ్మారు. వారి కోసమే కేసిఆర్ తెలంగాణ ఉద్యమం చేశారు. తెలంగాణ వచ్చాక ఆ సామాన్యుల కోసమే కేసిఆర్ పనిచేస్తున్నాడు. పధకాలు రచిస్తున్నాడు. అమలు చేస్తున్నాడు. వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడు. బంగారు తెలంగాణ సామాన్యులకు వరంగా అందిస్తున్నాడు. పేదింటి చెల్లికి అన్నగా అండగా నిలస్తున్నాడు. పెద్దలకు పెద్ద కొడుకై ఆసరాగా నిలస్తున్నాడు. జనం గుండెల్లో కొలువై వున్నాడు. పేద వారు బాపు అంటున్నారు…విద్యావంతులు సార్ …అంటున్నారు..ఇంతకంటే ఒక నాయకుడికి ఇంకేం కావాలి. దేశాన్ని పాలించేందుకు ఇంత కన్నా ఏం అర్హత కావాలి. అందుకే కేసిఆర్ ప్రధాని కావాలి. దేశాన్ని సుభిక్షం చేయాలి. దేశమంతా తెలంగాణ పధకాలు అమలు కావాలి. దేశమంతా కేసిఆర్ పాలన స్వర్ణయుగమని కొనియాడాలి. అది మా లాంటి వాళ్లం కళ్లారా చూడాలి.