నేటిధాత్రి హనుమకొండ
రోడ్లు మరియు భవనాల శాఖ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ రూపొందించిన పత్రికా వ్యాసాల సంకలనం ‘సాధన’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్
సోమవారం ఉదయం హన్మకొండలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ పుస్తకంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విశ్లేషించిన తీరు గొప్పగా ఉందన్నారు. ఇలాంటి మరెన్నో పుస్తకాలను రచించాలని మెట్టు శ్రీనివాస్ గారిని అభినందించారు. పుస్తక రచయిత, టీఎస్ఆర్డిసి చైర్మన్ మాట్లాడుతూ సామాజిక, ఆర్థిక అంశాలతోపాటు రాష్ట్రంలో ఉత్పత్తి అయిన సంపదను ప్రజలనే కేంద్రబిందువుగా చేసుకొని పంపిణీ చేస్తూ అమలవుతున్న విధానాలను ప్రజలకు చేరువ చేయడమే ఈ సాధన పుస్తక ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు నాయకులు ఈ సందర్భంగా అభినందించారు. మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో జరిగిన ఈ పుస్తక విష్కరణ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు , సత్యవతి రాథోడ్ , ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి , కడియం శ్రీహరి , బండా ప్రకాష్ , తక్కెళ్లపల్లి రవీందర్ రావు , బస్వరాజు సారయ్య , మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు , ఎమ్మెల్యే వొడితెల సతీష్ , మేయర్ గుండు సుధారాణి , జడ్పీ చైర్మన్లు సుధీర్ కుమార్ , గండ్ర జ్యోతి , కార్పొరేషన్ల చైర్మన్లు బండా శ్రీనివాస్ , వాసుదేవరెడ్డి , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ , డీజీపీ మహేందర్ రెడ్డి , వరంగల్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు , కుడా చైర్మన్ సుందర రాజు , మారినేని రవీందర్ తదితరులు పాల్గొన్నారు