ఫౌల్ట్రీ రైతులను కాపాడాలి

కేసముద్రం(మహబూబాబాద్), నేటిదాత్రి:

మండలంలోని కోమటిపల్లి గ్రామంలో జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లా పౌల్ట్రీ రైతుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు సూదుల రత్నాకర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో మరియు రాష్ట్రంలో సుమారు 50వేల పైచిలుకు కోళ్ళ ఫారంలు ఉండగా వాటిల్లో సుమారు 3 నుండి 4 కోట్ల కోళ్ళు పెంచుచున్నారన్నారు. కొన్ని కంపెనీలు ఇంటిగ్రేటెడ్ పేరిట రైతులకు కోడి పిల్లలను

ఇచ్చి వాళ్ళ ఫారాలలో పెంచాలని ఒప్పంద చేసుకొని వాటికి తినడానికి దానా, మందులు మాత్రం ఇస్తే,

రైతు మాత్రం ఒక షెడ్డును ఏర్పాటు చేసుకొని కోళ్ళు పెంచడానికి కూలీలా పని చేయాల్సి వస్తుందనీ ఆవేదన వ్యక్తం చేశారు.ఒక కోడి పెరగడానికి సుమారు 45 నుండి 50 రోజులు రైతులు రాత్రింబవళ్ళు కష్టపడటమే కాకుండా నీరు,కరెంటు, వరిపొట్టు,అడుగున న్యూస్ పేపర్లు మరియు అనునిత్యము ఫారం ను శుద్ధి చేయడం

వంటివి,ఎన్నో చేసినా చివరకు రైతుకు వచ్చేది కిలో వెంబడి రూ.4.50 పైసలు మాత్రమేనన్నారు.దీనివల్ల లక్షల్లో ఖర్చుపెట్టి ఫారంలో పనిచేసిన రైతుకు చివరకు కనీసం కూలీ కూడా మిగలడం లేదన్నారు. ఈ సందర్భంగా వారు పలు డిమాండ్లను

చేశారు.కిలో కోడి బరువుకు 12 రూపాయలు ఇవ్వాలన్నారు. సకాలంలో కోడిని ఫారం నుండి మార్కెట్కు అమ్మేలా చర్యలు తీసుకోవాలన్నారు.కోడి పిల్లలు చనిపోయే శాతం కంపెనీయే భరించాలనీ కోరారు.

కంపెనీ ఇచ్చిన కోడి పిల్లలను రైతు సుమారు 50 రోజుల పాటు కష్టపడి పెంచి పెద్ద చేస్తాడనీ,ఆ రైతు

పెంచే విధానాన్ని కంపెనీ పర్యవేక్షించుకోవాలినీ అన్నారు.కాని పర్యవేక్షణ ఉద్యోగి(సూపర్వైజర్ కి కోడికి

రూ.6 లు రైతు ఎందుకు భరించాలన్నారు.అది కంపెనీ ఉద్యోగి కాబట్టి కంపెనీయే భరించాలనీ సూచించారు.

కోడి పెద్దగ అయిన తరువాత సకాలంలో కోడిని కంపెనీ అమ్మాలన్నారు.అమ్మక పోవడం వల్ల పెరిగే

ఎఫ్ సి ఆర్ రైతులపై వేయకూడదన్నారు.

కోళ్ళ ఫారాలకు వాడుకునే కరెంట్ను కమర్షియల్ గా కాకుండా వ్యవసాయ కరెంట్ గా మార్చాలన్నారు.అలాగే

కోడి పిల్ల ధరను రూ. 22 కు తగ్గించాలన్నారు.

కంపెనీ కోళ్లను పెంచుచున్నందు వలన రైతుకు కంపెనీయే ఇన్సూరెన్స్ కల్పించాలన్నారు.

బ్యాచ్ కు బ్యాచ్ కు మధ్యన విరామం ఎక్కువ ఇవ్వకుండా వెంటనే కోళ్ళను ఇవ్వాలన్నారు.

 ఈ కార్యక్రమంలో పౌల్ట్రీ రైతులు సోంపల్లి రత్నాకర్, బొల్లెడ్ల జలేంధర్ రెడ్డి,రడం వెంకన్న,సంకినేని రాజేశ్వరరావు,కత్తుల సోములు, కొంకటి యాకారెడ్డి. కమ్మగాని సోమయ్య, ఉప్పునూతల రమేష్,కోళ్ల రమేష్,కుందూరు సుధీర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *