తెలంగాణ NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి & TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మేల్యే జగ్గారెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న వివిధ విద్యార్థి నిరుద్యోగుల సమస్యలపై తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ని కలిసి వినతి పత్రాన్ని సమర్పించేందుకు శ్రీనగర్
కాలనీ లోని మంత్రి గృహానికి వెళ్లగా వారు లేకపోవడంతో అక్కడే బైఠాయించి సమస్యల పరిష్కారానికి శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తెలంగాణ NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి మరియు TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మేల్యే జగ్గారెడ్డి.
ఈ సందర్భంగా NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి మాట్లాడుతూ ముఖ్యంగా నేడు తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న 3 తీవ్రమైన విద్యార్థి నిరుద్యోగ సమస్యలు
1)జూన్ 12వ తేదీన జాతీయ స్థాయిలో RRB పరీక్ష ఉన్నందున రాష్ట్రంలో నిర్వహించే టెట్ పరీక్షను వెంటనే వాయిదా వెయ్యాలి.
2)ఈ నెలలో తెలంగాణా పోలీస్ డిపార్ట్ మెంట్ వారు విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం కానిస్టేబుల్ పోస్ట్ కు జూలై 1 లోపు పాస్ అయ్యే ప్రస్తుత ఇంటర్ ద్వీతీయ సంవత్సర విద్యార్థులందరికి అవకాశం కల్పించారు.అదేవిధంగా మానవతా దృక్పథం తో ఇంటర్ వొకేషనల్(ET) ద్వితీయ సంవత్సర విద్యార్థులకి JLM పోస్ట్ లకు అవకాశం కల్పించాలి.
3)R16 బ్యాచ్ విద్యార్థుల పరీక్ష పేపర్ల మూల్యాంకనం సమయంలో వారి పరీక్ష కాగితాలు కాలిపోయిన తరువాత ప్రభుత్వం వారికి అవకాశం కల్పించక అన్ని అవకాశాలను కోల్పోతున్న వారికి వెంటనే న్యాయం చెయ్యాలి.
అని తాము ఈ రోజు తెలంగాణ విద్యాశాఖ మంత్రిని కలిసి నిరుద్యోగుల పక్షాణ వారి గొంతునై సమస్యలను వివరించడానికి వచ్చిన సందర్భంలో మంత్రి లేకపోవడం వల్ల విద్యార్థి నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించేంత వరకు తాము మరియు ఎమ్మేల్యే జగ్గారెడ్డి అక్కడే శాంతియుతంగా నిరసన తెలుపుతామని వెంకట్ తెలిపారు.