అనంతసాగర్ శివారులో ఎస్‌ఆర్ విశ్వవిద్యాలయంలో ఎన్‌సీసీ విభాగం ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరియు లయన్స్ క్లబ్ వారీ సహకారంతో శుక్రవారం స్వచ్ఛంద రక్తదాన
శిబారాన్ని నిర్వహించారు. ఈ కార్యాక్రమం అనంతరం వారు మాట్లాడుతూ అన్ని దానాల కన్నా రక్తదానం చాలా విలువైందని ప్రతి ఒక్కరు సంవత్సరంలో ఒక్కసారైన రక్తదానం చేస్తే వారీ
రక్త కణాల సరఫరా మెరుగు అవుతుందని అన్నారు.రక్తదానం చేయడం వలన ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతామని తెలియజేశారు.ఈ కార్యాక్రమంలో విశ్వావిద్యాలయం రిజిస్ట్రార్ డా॥ఆర్ అర్చన రెడ్డి
మాట్లాడుతూ సమాజసేవలో ప్రతి ఒక్కరు ముందుండాలని ,రక్తదానం అనేది గొప్ప కార్యాక్రమం అని దాని వల్ల ఒక ప్రాణానికి ఊపిరి పోసిన వాళ్ళం అవుతామని,చావు బ్రతుకుల్లో ఉన్న వారిని రక్షించవచ్చని తెలిపారు.ఈ సంధర్భంగా
డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ డా॥సయ్యద్ ముస్తాక్ అహ్మద్ ప్రిన్సిపాల్ డా॥వి.మహేష్,ఏ రాజేశ్వర్ రావు,యూనివర్సిటీ క్యాంపు కో ఆర్డినేటర్ ,టి.హరీష్ బాబు ఎన్‌సీసీ ట్రైనర్ తదితరులు పాల్గొని విద్యార్ధులను అభినందించి యూనివర్పిటి యాజమాన్యానికి
కృతజ్ఞత తెలిపారు.