`చిట్టీలు అందరూ కట్టాలి.. అందులో డిఫాల్టర్లుండాలి.
`చిట్టీలు చివరి వరకు కట్టలేని వారిని ఎంచుకోవాలి!

`వారికి మాయమాటలు చెప్పి తాహతకు మించి చిట్టి కట్టించాలి.
`డిఫటర్లు ఎక్కువయ్యారని కంపెనీ మూసేయ్యాలి.

`కంపెనీ దివాళా తీసిందని ఎత్తేయ్యాలి!
`చిట్ చట్టాలలో లొసుగులను ఆసరా చేసుకొని కోట్లు కొట్టేయ్యాలి.

`ఆ సొమ్ము తో ఆస్తులు కొనుగోలు చేసి పెట్టుకోవాలి.
`ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడాలి.
`డిపాజిట్ సొమ్ము పంచాల్సి వచ్చిననాడు డిఫాలటర్ల పేర సొమ్ము కాజేయాలి.
`సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నమని డిఫల్టార్లు అనుకునేలా చేయాలి!
……………………………..
……………………………
ఏసీబీ అధికారులు ఈ విషయాల మీద దృష్టి పెట్టాలి.
`చిన్న రహస్యం..కోట్ల లాభం!
`డిఫాల్టర్లే బంగారు బాతుగుడ్లు!
`ఏసీబీ అధికారులకు కూడా అంతు చిక్కని వ్యవహారమా?
`కనకదుర్గ కంపెనీ అతి తెలివికి నిదర్శనమా?
`కనకదుర్గ కంపెనీ చిట్ ఆక్షన్ రికార్డులు ఏసీబీకి ఎందుకు అప్పగించలేదు?
`ఏసీబీ కి చిట్ కంపెనీలు పాస్ బుక్కులు అన్ని ఎందుకు సమర్పించలేదు?
`నాలుగు రికార్డులు చూపిస్టే సరిపోతుందా?
`అదేమైనా అన్నమా ఒక్క మెతుకు చుస్తే తెలిసిపోవడానికి!
`చిట్ హోల్డర్ల బ్యాంకు స్టేట్ మెంట్లు ఏసీబీకి ఎందుకివ్వలేదు?
`కంపెనీ బ్యాంకు స్టేట్ మెంట్లు ఎందుకు అప్పగించలేదు?
`అక్షన్ డేట్ బుక్స్ ఏసీబీ కి ఎందుకు అందజేయలేదు?
`ప్రభుత్వం వద్ద అవుట్ స్టాండింగ్ లిస్ట్ వుంది.
`ఆ లిస్ట్ ను 2023లోనే కంపెనీలు ప్రభుత్వానికి అందించారు!
`ఆ లిస్ట్ ప్రకారం బాధితులకు ఎందుకు సొమ్ము చెల్లించడం లేదు?
`అదికాకపోయినా పిర్యాదుల పుస్తకం ఏర్పాటు చేసి నాలుగేళ్లు అవుతుంది.
`ఆ లిస్ట్ ప్రకారమైనా బాధితులకు డబ్బులు చెల్లించాలి.
`పిర్యాదుల నంబర్ ప్రకారం డబ్బులు ఎందుకు చెల్లించడం లేదు.
`మధ్యలో కొన్ని వందల పేర్లు వదిలేసి ఎలా డబ్బులు ఇస్తారు.
`ఒక వేళ ఏదైనా సమస్యలుంటే రిమార్క్ కాలంలో ఎందుకు రాయలేదు.
`నిజానిజాలు వెలికితియాలి.. బాధితులకు న్యాయం చేయాలి.
హైదరాబాద్, నేటిధాత్రి:
జనం సొమ్ము మీద రాబందుల్లా వాలిపోయేవారు సమాజంలో ఎక్కువౌతున్నారు. అప్పనంగా వచ్చే సొమ్ము కోసం ఆశపడుతున్నారు. కష్టజీవుల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. రెక్కలు ముక్కలు చేసుకొని పేదలు సంపాదించుకున్న సొమ్మును కనికరం లేకుండా మింగేస్తున్నారు. పాపాత్ములకన్నా, దుర్మార్గులౌతున్నారు. జనం సొమ్ముతో జల్సాలు చేస్తున్నారు. ఆస్దులు కూడబెట్టుకుంటున్నారు. తమది కాని సొమ్ముతో కోట్లు పోగేసుకుంటున్నారు. ఇది న్యాయమా? అని చట్టం ప్రశ్నించదు. దర్మం గుర్తుకురాదు. న్యాయం ఎప్ప్పుడు జరుగుతుందో తెలియదు. ఈలోపు ఆ కష్టజీవి జీవితం కుక్కలు చించిన విస్తరి కావొచ్చు. ఆ బడుగు జీవి తనువు చాలించొచ్చు. అయినా ఆఖరుకైనా న్యాయం జరగుతుందన్న నమ్మకంలేదు. కాని అన్యాయం చేసిన వారు మాత్రం ఆకలి దప్ప్పులు లేకుండా హాయగా బతుకుతుంటాడు. మోసం చేసిన వాడు సమాజంలో పెద్ద మనిషిగా చెలామణి అవుతుంటారు. సహజంగా పేద వాడు రూపాయి సంపాదించుకుంటే పొదుపు చేసుకోవాలనుకుంటాడు. ఆపదలో ఆదుకుంటుందని ఆలోచిస్తాడు. ధనవంతుడు పొదుపుకన్నా, వ్యాపారం చేసి మరో రూపాయి సంపాదించుకోవాలనుకుంటాడు. కాని కొంత మంది జనం నెత్తిన చెయ్యి పెట్టి, జనం సొమ్ముతో వ్యాపారం ముసుగులో అందర్నీ ముంచేయానుకుంటాడు. చిట్స్ పేరుతో దోచుకోవాలని చూస్తారు. అలా కొంత మంది స్వార్ధం కోసం బలైన పేదలు కొన్ని లక్షల మంది మన తెలంగాణలోనే వున్నారు. కొన్ని వేల కోట్లు సంపాదించి, నష్టపోయినట్లు నటిస్తున్న మోసగాళ్లు వందల్లో వున్నారు. అలాంటి వందల్లో కొంత మంది వరంగల్‌లో వున్నారు. వాళ్లంతా జనాన్ని నిండా ముంచి, కోటీశ్వరులయ్యారు. జనం కష్టాన్ని దోచుకున్న దొంగలై దర్జా వెలగబెడుతున్నారు. చిన్న రహాస్యాన్ని పట్టుకొని కోట్లు సంపాదించి, ఘరానా మోసాలకు పాల్పడ్డారు. చిట్టీల వ్యాపారం ముసుగులో అక్రమ సంపాదనా సామ్రాజ్యాలు నిర్మాణం చేసుకున్నారు. ప్రభుత్వం కళ్లుగప్పి నమ్మకద్రోహం చేస్తున్నారు. ఏబిసి అదికారులకు కూడా వారి తప్ప్పులు కనిపించకుండా వ్యవస్ధను మాయ చేస్తున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో కనక దుర్గ చిట్ ఫండ్ వ్యవహారాన్ని బట్టబయలు చేయాలని ఏసిబి అదికారులు చూశారు. ప్రజలకు న్యాయం చేయాలని వచ్చారు. కాని ఏబిసి అదికారుల దాడుల సంగతి ముందే తెలుసుకున్న వాళ్లు తప్పించుకునే ప్రయత్నం చేశారు. కాని రికార్డులను మాయం చేయడం కోసం తెలివిగా నాటకమాడారు. పైకి మాత్రం తప్పించుకున్నారన్న భ్రమ కల్పించారు. ఈ లోపు రికార్డులు మాయం చేసే ఎత్తుగడ వేశారు. అధికారులు పిలిపించే సరికి, వచ్చినట్లు నటించి అసలు రికార్డులను అప్పగించకుండా తిరకాసు తెలివి ప్రదర్శించారు. నిజానికి చిట్స్‌కు సంబంధించిన లోతైన విషయాల్లో ఎవరికీ అవహన వుండదు. అందుకే కొన్ని రికార్డులను అందజేసినట్లు నటించి, చేతులు దులుపుకుందామని చూశారు. ఒక రకంగా కనక దుర్గ కంపనీ అతితెలివిని ప్రదర్శించామని అనుకుంటున్నారు. అందుకే ఏసిబి అదికారుల కొన్ని విషయాలపై దష్టి సారించాలి. కనక దుర్గ చిట్ కంపనీ ఏసిబికి చిట్ ఆక్షన్ రికార్డులు తెలివిగా అందజేయలేదు. ఎందుకంటే అసలు రహస్యం వాటిలోనే దాగి వుంటుంది. ఆ రికార్డులు ఎందుకు అప్పగించలేదో కంపనీ తెలియజేయాలి. ఏసిబి అదికారులు తెలుసుకోవాలి. వివరాలు వెంటనే తెప్పించుకోవాలి. చిట్ కంపనీలు చిట్ దారులకు అందజేసే పాస్ బుక్కులన్నీ ఎందుకు ఏసిబికి అందించలేదు? నాలుగు రికార్డులు చూపించి, మమ అనిపిస్తే సరిపోతుందా? అదేమైనా అన్నమా..ఉడికిందా? లేదా? అని తెలుసుకోవడానికి? డబ్బుల వ్యవహారం. జనాన్ని మోసం చేసిన వ్యవహరం. దానిలో కూడా అతితెలివిని ప్రదర్శిస్తే సరిపోదు. ప్రతి చిట్ ీVAల్డర్కు బ్యాంకు స్టేట్ మెంటు వుంటుంది. అది చిట్ కంపనీ వద్ద వుంటుంది. దానిని కూడా ఏసిబికి అందజేయాలి. కాని చిట్ కంపనీ ఏబిసికి అందించలేదు. దానిపై కూడా ఏసిబి దష్టి సారించాలి. వాటికి తోడు చిట్ కంపనీకి చెందిన బ్యాంకు స్టేట్ మెంటు వుంటాయి. వాటిని కూడా ఏసిబికి అందించాలి. కాని అక్కడ కూడామోసం చేయాలని చూశారు. ఏసిబి అదికారులకు ఇవ్వలేదు. ఆక్షన్ డేట్ బుక్స్ అన్నీ ఏసిబికి అందించాలి. కాని అలా జరగలేదు. వీటన్నింటికీ తోడు ప్రభుత్వం వద్ద అవుట్ స్టాండింగ్ లిస్టు వుంటుంది. దానిని ఏసిబి తీసుకొని విచారణ లోతుగా చేపట్టాలి. ఈ లిస్టును చిట్కంపనీలు 2023లోనే ప్రభుత్వానికి అందజేశారు. ఆ లిస్టు ప్రకారం బాధితులకు కంపనీ ఎందుకు సొమ్ము చెల్లించడం లేదు? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. వీటితోపాటు పిర్యాధుల పుస్తకం వుంటుంది. దాని ప్రకారం బాదితులకు చెక్కులు చెల్లించాలి. కాని అది కూడా కంపనీ ఆచరించడం లేదు. ఈ పిర్యాధుల పస్తకం ఏర్పాటు చేసి నాలుగు సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ లిస్టు ప్రకారం డబ్బులు చెల్లించడం కూడా ఎంతో ముఖ్యం. పిర్యాధుల పుస్తకంలోని వరస క్రమం వదిలేసి, కంపనీ తమ ఇష్టం వచ్చిన వారికి డబ్బులు ఎలా చెల్లిస్తారు? మధ్యలో ఎగిరిపోయిన బాధితులకు డబ్బులు ఎప్ప్పుడు చెల్లిస్తారు? ముందు వరసలో వున్న వారికి కాకుండా ఎక్కడో వందల క్రమ సంఖ్య తర్వాత వున్న వారికి చెల్లిస్తుండడంలో ఆంతర్యమేమిటి? ఇలా డబ్బులు చెల్లించడంలో కూడా ఏదైనా సమస్య ఎదురైతే రిమార్కు కాలం ఎందుకు వదిలేస్తున్నారు? అందుకు సమస్యలు ఎందుకు రాయకుండా వదిలేశారు? ఇలా అనేక నిబంధలను చిట్ కంపనీలు తుంగలో తొక్కుతున్నాయి. డిపాజిట్ సొమ్మును స్వాహా చేస్తున్నాయి. బాదితులకు మొండిచేయి చూపిస్తున్నాయి. ఇలాంటి సాంకేతిక అంశాలపై ఏబిసి అధికారులు దష్టిపెట్ట లోతైన విచారణ జరిపి, తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. లేకుంటే మొత్తానికే చిట్ కంపనీలు మోసం చేస్తాయని అంటున్నారు. చిట్ కట్టిన పాపానికి ఇప్పటికే చితికిపోయామని, బతుకు మీద భరోసా లేకుండాపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిట్ కంపనీల లోగుట్టు వ్యవహారం ఎంతో భయంకరంగా వుంటుంది. సహజంగా ఎవరైనా సరే చిట్ కంపనీలు ఖాతాదారుల కమీషన్‌తో సాగుతాయని అని అనుకుంటారు. అలా భ్రమ పెడతారు. ప్రజలకు ఏదో సేవ చేస్తున్నట్లు చెప్ప్పుకుంటారు. సామాజిక సేవ చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తారు. కాని ప్రతి కంపనీ చిట్టీలు కట్టిన వాళ్లంతా డిఫాల్టర్లు కావాలని కోరుకుంటుందని ఎవరూ ఊహించరు. అలా ఎవరూ ఊహించని అక్రమ వ్యాపారం చేయడమే చిట్ కంపనీల అక్రమ సూత్రమని ఇప్ప్పుడిప్ప్పుడే ప్రజలకు తెలుస్తోంది. తాహతు లేని వారిని కొ ంత మందిని ఎంచుకొని వారికి కంపనీల ఏజెంట్లు మాయ మాటలు చెబుతారు. చిట్ కడితే వచ్చే లాభం గురించి కలలు కనేలా చేస్తారు. కట్టే చిట్‌తో ఇల్లు, వాకిలి, కారు ఊహల ప్రపంచం చూపిస్తారు. అదే నిజమని అమాయకులు నమ్ముతారు. ఏజెంట్లను నమ్మి చిట్టీలు కడుతుంటారు. మా వల్ల అంత పెద్ద చిట్ వేయడం సాద్యం కాదని అంటున్నా, ఎంత పొదుపు చేస్తే అంత మీకే లాభమని చెబుతారు. వారి కష్టం మొత్తం చిట్ కంపనీలకు చేరుకునేలా చిట్లు వేయిస్తారు. అమాయకులు తాము సంపాదించిన రూపాయిలో పైసా కూడా తినకుండా, ఆ సొమ్మంత చిట్ కంపనీల పాలు చేస్తారు. ఒక దశకొచ్చేసరికి చెల్లించలేక చేతులెత్తేస్తారు. అలా డిఫాల్లర్లయ్యే వ్యాపార సూత్రాన్ని చిట్ కంపనీలు అనుసరిస్తారు. అమాయకులను నిండా ముంచేస్తారు. అలా డిపాల్టయిన వారి చిట్టీని కంపనీయే పూర్తి చేసి, ఆ సొమ్మంతా మింగేస్తారు. ఇలా జనం సొమ్మును మింగేసే అనకొండలు తయారై, బ్రాంచిల మీద బ్రాంచీలు ఏర్పాటు చేసి, వేల కోట్లు సంపాదించిన కంపనీలున్నాయి. ఇలాంటి లొసుగులు కూడా ఏసిబి అదికారులు తెలుసుకొని, మోసపోయిన బాధితులకు న్యాయంచేయాలి.
