New Transformer Solves Low Voltage Issue
నాగూర్లపల్లిలో అల్ప విద్యుత్ ఒత్తిడి సమస్యకు చెక్
25 కేవీఏ నూతన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ప్రారంభించిన కౌన్సిలర్
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డు నాగూర్లపల్లిలో నివాసితులు ఎదుర్కొంటున్న అల్ప విద్యుత్ ఒత్తిడి సమస్యకు పరిష్కారం లభించింది. స్థానిక తపాలా కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన 25 కేవీఏ సామర్థ్యం గల నూతన విద్యుత్ మార్పిడి యంత్రాన్ని కౌన్సిలర్ బానోత్ నవీన్ నాయక్ శుక్రవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ బానోత్ నవీన్ నాయక్ మాట్లాడుతూ, వార్డులో విద్యుత్ వినియోగం పెరగడంతో పాత లైన్లపై భారం పెరిగి తరచూ అల్ప విద్యుత్ ఒత్తిడి సమస్య తలెత్తుతోందని తెలిపారు. ఈ సమస్యను అధిగమించేందుకు 25 కేవీఏ మార్పిడి యంత్రాన్ని ఏర్పాటు చేయించినట్లు చెప్పారు. దీనివల్ల పరిసర ప్రాంతాల గృహాలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జూనియర్ లైన్మన్ ప్రశాంత్ పాల్గొని విద్యుత్ సరఫరా వ్యవస్థను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో తపాలా పంపిణీదారు పవన్, స్థానిక నాయకులు రాధారపు శ్రీనివాస్, ముప్పారపు గణేష్, తనుగుల బాబు, బండ్ల వెంకటేశ్వర్లు, స్థానిక మహిళలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
