`నెంబర్ 2 ను కదిలించాలని రెండేళ్లుగా ప్రయత్నం.
`అడుగడుగునా శీనన్న మీద అనేక రకాల ఆరోపణలు.

`ఎన్ని విమర్శలు చేస్తున్నా శీనన్న వెరవడం లేదు.
`శీనన్న డిఫెన్స్ లో పడడం లేదు.

`ప్రతిపక్షాలు ఎంత టార్గెట్ చేస్తే అంత బలంగా శీనన్న మారుతున్నారు.
`ఎలాగైనా శీనన్నను అబసుపాలు చేయడం కుదరడం లేదు.
`ఖమ్మం జిల్లాలో అయన ప్రాధాన్యత తగ్గించ లేకపోతున్నారు.
`ప్రతిపక్షాలు చేసే ప్రతి విమర్శపై పొంగులేటి పై చేయి సాధిస్తున్నాడు.
`వెలుగు మట్ల శీనన్న మెడకు చుట్టాలనుకున్నారు.
`అది కుదరలేదు.. పైగా ప్రతిపక్షానికి బెడిసికొట్టింది.
`వెలుగు మట్లలో బాధితులకు ఇచ్చిన మాట శీనన్న నిలబెట్టుకున్నాడు.
`చెప్పిన సమయానికి పట్టాలు పంచి తన నిజాయితీ నిరూపించుకున్నాడు.
`ఎక్కడా శీనన్న మీద గురి నెరవేరడం లేదు.
`మొదటి నుంచి శీనన్న కొడుకును రాజకీయంగా టార్గెట్ చేస్తూ వచ్చారు.
`అక్కడ కూడా పదే పదే ప్రతిపక్షం బోల్తా పడుతూ వస్తోంది.
`ఆఖరుకు అసెంబ్లీ లో కూడా ప్రతిపక్షం పరువు తీసుకున్నది.
`ఇప్పుడు మైనింగ్ పేరుతో మరోసారి బద్నామ్ చేయాలని చూసింది.
`భూముల ఆక్రమణలపై లేనిపోని రాద్ధాంతం చేస్తోంది.
`అయినా ప్రతిపక్షం శీనన్న మీద పై చేయి సాధించలేకపోతోంది.
`ఏ రకంగా నైనా శీనన్న ను రాజకీయంగా ఇరుకున పెట్టాలని చూసినా సాధ్యం కావడం లేదు.
`ప్రతిపక్షం పైత్యం పిక్ స్టేజ్ కి వెళ్ళిపోయింది.
`అడుగడుగునా ప్రతిపక్షమే సవాళ్ళ మీద సవాళ్లు ఎదురుకుంటోంది
హైదరాబాద్, నేటిధాత్రి:
పుచ్చుకున్న వాడు ఒక్కటి మాట్లాడితే ఇచ్చుకున్న వాడు ఇరవై మాట్లాడతాడని ఒక సామెత. అందుకే తీసుకున్న నీకే అంత నీలుగుడు వుంటే, ఇచ్చిన నాకు ఎంత పొగరుండాలని అంటారు. ఇక్కడ కూడా సరిగ్గా అదే జరుగుతోంది. ఒకప్ప్పుడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద ఆదారపడిన సందర్బాలు ఎన్ని వున్నాయో ఒక్కొక్కటి పూసగుచ్చినట్లు చెబుతుంటే ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు కకావికలమైపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అనరసరంగా మంత్రి పొంగులేటిని గెలుకొని వారి బండారం వాళ్లే బైట పడేసుకుంటున్నట్లువుంది. నిజాలు ఎప్ప్పుడూ నిష్టూరంగానే వుంటాయి. పండ్లున్న చెట్టుకే రాళ్లు పడుతుంటాయి. అలా రాష్ట్ర ప్రభుత్వం నెంబర్ 2గా వున్న మంత్రి శ్రీనివాస్ రెడ్డిని ఆది నుంచి ప్రతిపక్ష పార్టీ టార్గెట్ చేస్తూనే వస్తోంది. ఏదో రకంగా రాజకీయంగా ఇరుకు పెట్టాలనో, ఇబ్బందులకు గురి చేయాలనో చూస్తూనే వుంది. ఆయన ఆయన ఎక్కడా వారికి చిక్కడం లేదు. ఎత్తుకు పై ఎత్తు వేసి, ప్రతిపక్ష పార్టీకి చెందిన కేటిఆర్, హరీష్‌రావులను ఉతికి ఆరేస్తూనే వున్నారు. హరీష్‌రావు, కేటిఆర్‌లు అనేక ఆరోపణలు చేస్తూనే వున్నారు. మంత్రి పొంగులేటిని అభాసుపాలు చేయాలని చూస్తూనే వున్నారు. కాని కుదడం లేదు. ఎలాగైనా రాజకీయంగా ఇబ్బందులకు గురి చేయాలని పదే పదే ప్రయత్నం చేస్తూనే వున్నారు. పైగా మంత్రితోపాటు పదే పదే ఆయన కుమారుడిపై ఆరోపణలు చేస్తూనే వున్నారు. కొంత కాలం వాచ్లంటూ ప్రచారం చేశారు. మంత్రి పొంగులేటిని వీక్చేయాలని చూశారు. కాని కుదరలేదు. తర్వాత కోకాపేట అంశం తెరమీదకు తెచ్చారు. అప్ప్పుడూ ఏం చేయాలేపోయారు. ఎన్ని రకాý ఆరోపణలు చేసినా అవన్నీ వుట్టివే అని తేలిపోతున్నాయి. బిఆరఎస్ విమర్శలకు బలం లేకుండాపోతోంది. ప్రజలు ఏమాత్రం బిరఎస్ను నమ్మడం లేదు. మీడియా కూడా బిఆరఎస్ నాయకుల మాటలను కూడా నమ్మడం లేదు. ఏ రకంగా చూసినా బిఆరఎస్ నాయకుల పప్ప్పులుడకడంలేదు. దాంతో ఇటీవల కొంత కాలం క్రషర్లు అంటూ కాలం గడిపారు. ఆ క్రషర్లు మంత్రి పొంగులేటి అక్రమ మైనింగ్ అంటూ బిఆరఎస్ నాయకులు గగ్గోలు పెట్టారు. అక్కడ కూడా వారి ఎత్తులు పారలేదు. ఇక వట్టినాగుల పల్లి అంటున్నారు. ఇలా రోజుకో దానిని తెరమీదకు తెచ్చి, మంత్రిని పొంగులేటిని రాజకీయంగా ఇబ్బందులకు గురి చేయాలని పదేపదే చూస్తున్నారు. కాని ఎక్కడా వీలు కాలేదు. ఆ మధ్య ఖమ్మం జిల్లా వెలుగు మట్ల వ్యవహారాన్ని కూడా మంత్రి పొంగులేటి మెడకు చుట్టేందుకు శతవిదాలా ప్రయత్నం చేశారు. కాని అక్కడా బిఆరఎస్ నాయకలు తలెత్తుకోకపోయారు. గతంలో ఆ ప్రదేశంలో బిఆరఎస్ నాయకులు డబ్బులు వసూలు చేశారంటూ వెగులు మట్ల బాదితులు తిరగబడడంతో బిఆరఎస్ నాయకులు అక్కడి నుంచి పారిపోయారు. తర్వాత వెలుగు మట్ల ప్రజల గురించి మాట్లాడేందుకు కూడా వారికి వాయిస్ లేకుండాపోయింది. కాని మంత్రి పొంగులేటి ఆ బాదితులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఒక్కసారి మంత్రి పొంగులేటి మాట ఇస్తే వుంటుందో ఖమ్మం జిల్లా ప్రజలకు తెలుసు. మంత్రి మాట మీద ప్రజలకు ఎంత గురి వుంటుందో కూడా అందరికీ తెలుసు. ఈ విషయం తెలసినా మంత్రిని వెలుగు మట్ల విషయంలో ఇరికించాలని రాజకీయం చేశారు. కాని కుదరలేదు. వెలుగు మట్ల ప్రజలకు మంత్రి ఇచ్చిన గడువులోగానే వారికి న్యాయం చేశారు. చెప్పిన ప్రకారం పట్టాలు పంపిణీ చేశారు. ఇండ్ల నిర్మాణం కోసం రూ.5లక్షలు అందజేశారు. ఇలా ప్రజల నాయకుడిగా ఎదిగిన మంత్రి పొంగులేటిని అడుగడుగునా ఇబ్బందులకు ఆనాడు గురి చేశారు. ఇప్ప్పుడు కూడా ఇబ్బందులు పెట్టాలని చూస్తూనే వున్నారు. గతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని నమ్మించి పార్టీలోకి తీసుకున్నారు. నయ వంచన చేసి ఆయన రాజకీయ జీవితాన్ని చిదిమేద్దామని చూశారు. పార్టీ పరంగా ఆయనను పీల్చి పిప్పి చేయాలని చూశారు. పొంగులేటిని అడుగుగడుగునా అవమానాలకు గురి చేసి, రాజకీయంగా ఎదకుండా చేయాలని చూశారు. రాజకీయంగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఎవరి దయాదాక్షిణ్యాలతో ఎదిగిన నాయకుడు కాదు. స్వశక్తితో పైకి వచ్చిన నాయకుడు. తనకు తానేగా నాయకుడిగా తయారై ప్రజల నుంచి వచ్చిన నాయకుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. ఆయన బిఆరఎస్‌లో చేరకముందే పార్లమెంటు సభ్యుడిగా వున్నారు. అప్పటికే వైసిసి. తెలంగాణ రాష్ట్ర అద్యక్షుడుగా వున్నారు. పార్టీ పరంగా ఖమ్మం జిల్లాలో తాను గెలవడమే కాకుండా, ఎమ్మెల్యేలను కూడా గెలిపించుకున్న నాయకుడు. అలాంటి నాయకుడిని బలహీనుడిని చేయాలని చూశారు. పార్టీలో వున్నా ఆయన వ్యాపారాలను ఇబ్బందులకు గురి చేశారు. రాజకీయ అవకాశాలు కల్పిస్తామని చెప్పి మోసం చేశారు. వ్యాపారాలను సాగుకుండా చేశారు. అయినా ఆయన ఎంతో ఓపికతో బిఆరఎస్‌కు సేవ చేశారు. అది ఆయన బలహీనత అనుకున్నారు. పొంగులేటిని లైట్ తీసుకున్నారు. పొమ్మనలేక పొగపెట్టే ప్రయత్నం చేశారు. పొంగులేటిని తక్కువ అంచానా వేశారు. మంత్రి పొంగులేటి నాయకత్వం ఎలా వుంటుందో గత ఎన్నికల్లో చూపించారు. బిఆరఎస్ పార్టీకి గత ఎన్నికల్లో చుక్కలు చూపించారు. ఖమ్మం జిల్లాలో కారు ఆచూకీ లేకుండా చేశారు. గులాబి జెండాకు చోటు లేకుండా చేశారు. బిఆరఎస్ అనే మాటను ఖమ్మంలో వినకపడుకుండా చేశారు. అలా ఆ పార్టీని జిల్లాలో నామ రూపాలు లేకుండా చేశారు. పైగా ప్రభుత్వ ఏర్పాటులో కీలకభూమిక పోషిస్తున్నారు. ఇది బిఆరఎస్ అగ్రనేతలకు గిట్టడంలేదు. బిఆరఎస్‌లో వున్నప్ప్పుడు నెగలనీయలేదు. పార్టీలోకి ఆహ్వానించి దుతరాష్ట్ర కౌగిలిని చేసి, పొంగులేటి రాజకీయాన్ని చిదిమేయాలనుకున్నారు. పౌరుషం కలిగిన నాయకుడిగా మంత్రి పొంగులేటి బిఆరఎస్ నుంచి బైటకు వచ్చారు. ఆహ్వానించిన కాంగ్రెస్‌లో చేరారు. ఖమ్మం నుంచే కాంగ్రెస్ పార్టీ నుంచి బిఆరఎస్‌కు సమర శంఖం పూరించారు. బిఆరఎస్ మీద సవాలు చేశారు. ఖమ్మం నుంచి బిఆరఎస్నుంచి ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వనని లక్షలాది మంది హాజరైన సభలో చెప్పారు. చెప్పింది చేశారు. ఖమ్మంతోపాటు తెలంగాణలోని అన్ని జిల్లాలు తిరిగి బిఆరఎస్ ఓటమికి కీలక భూమిక పోషించారు. తర్వాత ప్రభుత్వంలో మంత్రిగా కీలక పాత్ర నిర్వహిస్తున్న మంత్రిపొంగులేటి ఎదుగుదలను ఓర్వలేకపోతున్నారు. అందుకే మంత్రి మీద లేనిపోని విమర్శలు చేస్తూ అవస్దలు పడుతున్నారు. ఎప్పటికైనా నాదే పై చేయి అని ఆ నాటి నుంచి నేటి దాకా రుజువు చేస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు బిఆరఎస్నేతల దౌర్భాగ్య వైఖరిని సూచిస్తున్నారు. నా మోచేతి నీళ్లు తాగిన మీకే అంత వుంటే, నాకెంత వుండాలి! అని మాట్లాడగలిగే ధైర్యం మంత్రి పొంగులేటిది. సింహంగా బిఆరఎస్ నాయకుల మీద గర్జించి నిజం చెప్పారు. కాదని చెప్పలేని బిఆరఎస్ నాయకులు పనికి రాని సొల్లు మాటలు మాట్లాడుతున్నారు. జనం చేత ఇంకా బిఆరఎస్ నాయకులు చీ కొట్టించుకుంటున్నారు.
