`అంతు చిక్కలేకపోతున్న ప్రజా నాడి.
`డి ప్యాక్, నేటి ధాత్రి సంయుక్త సర్వేలో అనేక ఆసక్తికర అంశాలు.
`టివికె ను అందరూ తక్కువ అంచనా వేస్తున్నారు.
`నాయకుడు లేని ఏఐడిఎంకె ను మోస్తున్నారు.
`డిఎంకె మీద పెద్దగా ప్రజా వ్యతిరేకత లేదు.
`అవినీతి ఆరోపణలు పెద్దగా ఎదురుకున్నది లేదు.
`టివికె వచ్చిన తర్వాత డిఎంకె గ్రాఫ్ డౌన్ అవుతూ వస్తోంది.
`ఏఐడిఎంకె కు బీజేపీ సపోర్ట్ చేయడం ప్లస్ పాయింట్.
`ఆ పార్టీకి అదే మరో రూపంలో మైనస్ పాయింట్.
`ఏఐడిఎంకె విచ్చిన్నం కావడం లో బీజేపీ దే కీలక పాత్ర.
`శశికళ ఏఐడిఎం కె లో లేకపోవడం ఆ పార్టీ కి మరింత దెబ్బ.
`మాజీ సీఎం ఫలణి స్వామి డి ఎం కె లో చేరిపోయారు.
`కమల్ హాసన్ రంగంలో లేడు. డి ఎం కె కు సపోర్ట్ చేస్తున్నాడు.
`కాంగ్రెస్ పార్టీ కూడా డి ఎం కె వెనకాల వుంది.
`ప్రకటించక పోయినా రజినీకాంత్ కూడా డి ఎం కె కు సపోర్ట్ ఇచ్చినట్లే లెక్క.
`అనవసరంగా టి వి కె నాయకులు రజనీకాంత్ ను కెలికారు.
`రజనీకాంత్ అభిమానులు కూడా విజయ్ కి దూరమయ్యారు.
`విజయ్ ఒంటరి పోరు కూడా బలంగా నే వుంది.
`విజయ్ సభలకు అభిమానులు తండప తండాలుగా వస్తున్నారు.
`తమిళనాడు లో 40 ఏళ్ల వయసు పై బడిన ఓటర్లు 2 కోట్లున్నారు.
`28 ఏళ్ల వయసు లోపు వున్న ఓటర్లు కోటికి పైగా వున్నారు.
`కొత్తగా ఓటు నమోదు చేసుకున్న వాళ్ళు 28 లక్షలున్నారు.
`అందులో ఓటు హక్కు వున్న విద్యార్థులు 12 లక్షలున్నారు.
`ఈ ఓటర్లలో 30 శాతం విజయ్ పార్టీకి కి ఓటు వేసినా టి వి కె ప్రభంజనం సృష్టించినట్లే.
హైదరాబాద్, నేటిధాత్రి:
మూడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పాండిచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు ఒక ఎత్తు. తమిళనాడు రాష్ట్ర ఎన్నికలు ఒకెత్తులాగా కనిపిస్తున్నాయి. ఆ నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ పార్టీల ప్రాదాన్యం ఎక్కువ. కాని తమిళనాడులో జాతీయ పార్టీల ప్రభావం చాలా తక్కువ. ఏదొ ఒక పార్టీ మీద ఆదారపడి కొన్ని సీట్లు అడుక్కొవడం తప్ప, నేరుగా అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్దానాలకు పోటీ చేసే పరిస్దితి తమిళనాడులో లేదు. అస్సాం, కేరళలో కాంగ్రెస్, బిజేపిలో నేరుగా తలపడుతున్నాయి. బెంగాల్లో మాత్రం బిజేపి, తణమూల్ పోటీ పడుతున్నాయి. అక్కడ కాంగ్రెస్‌కు కూడా పెద్దగా ఆశలు లేవు. గెలుపోటములను ప్రభావితం చేసే శక్తి లేదు. అదే సమయంలో తమిళనాడులోనూ రెండు జాతీయ పార్టీలకు గెలుపోటముల ప్రభావం వాటి వల్ల కనిపించే శక్తిలేదు. అందుకే తమిళనాడు ఎన్నికలు ప్రత్యేకం. కాకపోతే ఈ ఎన్నికలు కూడా జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తాయని చెప్పడంలో సందేహం లేదు. గత నాలుగైదు దశాబ్దాలుగా తమిళనాడులో ప్రాంతీయపార్టీలదే హవా. అటు డిఎంకే, ఇటు ఏఐడిఎంల మధ్యేపోరు ప్రధానంగా సాగుతూ వస్తోంది. మధ్యలో కొన్ని పార్టీలు వచ్చినా వాటి ప్రభావం కూడ మద్యలోనే ఆగిపోయింది .ఇప్ప్పుడు తమిళన రాజకీయాల్లో మరొ సరికొత్త సంచలనం చేరింది. తమిళనాడులో సూపర్ స్టార్ విజయ్‌కు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్వుంది. రజనీకాంత్, కమల్ హసన్లకన్నా ఇప్పటి జనరేషన్లో స్టార్‌గా వెలుగొందుతున్నారు. గత రెండు ఎన్నికల ముందు మరో సూపర్ స్టార్ విజయ్‌కాంత్ రాజకీయాల్లోకి వచ్చినా ఆయన కొన్నిసీట్లకే పరిమితమాయ్యరు. అనుకోకుండా ఆయన కాలం చేశారు. ఆ పార్టీ భవిష్యత్తు అంధకారంలో పడిపోయింది. అయితే తమిళనాడులో ఇప్ప్పుడు మూడు పార్టీల మధ్య ప్రదాన పోటీ బలంగానే కనిపిస్తోంది. ఒక రకంగా ఎవరకి అంతు చిక్కని రాజకీయం సాగుతోంది. ఎన్నికలకు ఇంకా కొంత సమయం వుండడంతో ఎప్ప్పుడు జనం నాడి ఎటు వైపు మళ్లుతుందో అన్నది కూడా అర్దం కాకుండా వుంది. నిన్నటి వరకు రెండు ప్రధాన పార్టీల మధ్యే ప్రధాన పోటీ వుంటుందని అందరూ అనుకున్నారు. డిఎంకే, ఏఐడిఎంకేలు రెండు బలమైన పార్టీలుగా పరిపాలన పంచుకుంటున్నారు. ఒకప్ప్పుడు తమిళనాడు ప్రజలు ఒక పార్టీకి ఒక్కసారి మాత్రమే అవకాశమిచ్చేవారు. ఆ సంప్రదాయాన్ని మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత తిరిగి రాశారు. రెండుసార్లు రికార్డు విజయాలు సొంతం చేసుకున్నారు. కాకపోతే రెండోసారి ఆమె గెలిచినా కాని అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. తర్వాత కాలం చేశారు. దాంతో ఏఐడిఎంకే నాయకుడు లేని పార్టీగా మిగిలిపోయింది. పార్టీని నడుపుతుందనుకున్న శశికళ జైలు పాలైంది. ఇప్ప్పుడు ఆమె మరో కొత్త పార్టీని ఏర్పాటు చేసుకున్నది. ఏఐడిఎంకేకుబలమైన నాయకుడు లేడనే చెప్పాలి. కాని పార్టీ మాత్రం ఎంతో కొంత బలంగానే వుంది. దేశంలో వున్న అన్ని రాష్ట్రాల ప్రజలు వేరు. తమిళనాడు ప్రజలు వేరు. ఎందుకంటే అక్కడ సినిమా నటులే ప్రజలకు ఆరాధ్యదైవాలు. జయలలిత బతికి లేకున్నా, ఆమెను కీర్తి శాశ్వతంగా వుంచేందుకు పార్టీ వుంది. ఆ పార్టీకి అభిమానులున్నారు. అందుకే ఆ పార్టీ ఇంకా బలంగా వుంది. ఆ పార్టీకి నాయకులు అవసరం లేదు. జయలలిత పేరు చాలు. ఆమె ఫోటో చాలు. అంతే ప్రజలు ఆదరిస్తారు. ఆ పార్టీని ఇంకా ఆదరిస్తున్నారు. కాకపోతే గత ఎన్నికల్లో డిఎంకేను తమిళనాడు ప్రజలు గెలిపించారు. స్టాలిన్ సుధీర్ఘ కాలం ఆశను ప్రజలు నెరవేర్చారు. దాంతో జయలలిత గతంలో అమలు చేసిన అన్ని పధకాలను సిఎం. స్టాలిన్ కొనసాగిస్తూ వస్తున్నారు. దాంతో జయలలిత అభిమానులను నుంచి డిఎంకే ఎక్కడా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి రాలేదు. పైగా ఇటీవల ఏఐడిఎంకే నాయకుడు, మాజీ సిఎం. ఫలణిస్వామి డిఎంకేలో చేరారు. దాంతో డిఎంకే బలం మరింత పెరిగిందని అంటున్నారు. కాకపోతే టివికే అద్యక్షుడు విజన్‌ను తొలుత తక్కువగా అంచనా వేశారు. రోజులు గడుస్తున్న కొద్ది ఆయన ప్రభావం తమిళ రాజకీయాల్లో బాగా కనిపిస్తోంది. గత పదిహేను రోజులు క్రితం వరకు ఆయన ప్రభావం ఓ పదిహేను శాతం వుంటుందేమో అనుకున్నారు. 7 నుంచి 10 సీట్లు వస్తాయని అంచనా వేశారు. కాని ఇప్ప్పుడున్న పరిస్దితుల్లో విజయ్ పార్టీ ప్రజల్లో దూసుకుపోతోంది. విజయ్ పార్టీ క్రియాశీలకమే కాదు, బలంగా మారుతున్నట్లు నేటిధాత్రి, డిప్యాక్ సర్వేలలో తేలింది. ఆయన అదికారంలోకి కూడా వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. గత పదిహేను రోజుల క్రితం ఆయన ప్రభావం 15శాతం అనుకున్న వాళ్లు, ఇప్ప్పుడు అది 35శాతం దాటినట్లు కనిపిస్తోంది. దాంతో తమిళ రాజకీయాల్లో మూడు ముక్కలాట బలంగానే కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా యువతలో విజయ్‌కు వున్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఆ ప్యాటర్న్ వర్కౌట్ అయితే మాత్రం తమిళనాడులో విజయ్‌దే విజయం అంటున్నారు. కాకపోతే డిఎంకే బలమైన కూటమిగానే కనిపిస్తోంది. కాంగ్రెస్‌తో సహా, చిన్నా, చితక పార్టీలన్నీ డిఎంకే పార్టీకే మద్దతునిస్తున్నాయి. గతంలో రెండు సార్లు ఏఐడిఎంకే కు అవకాశమిచ్చిన తమిళ ప్రజలు ఆసారి కూడా మళ్లీ స్టాలిన్‌ను గెలిపిస్తారన్న నమ్మకం కూడా వుంది. పైగా డిఎంకే పార్టీకి వున్న పార్లమెంటు సభ్యుల నియోజకవర్గాలు కంచుకోటలుగా వున్నాయా? లేక విజయ్ మూలంగా ఆ కోటలు కూలిపోతాయా? అన్నది పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. ఏఐడిఎంకే పరిస్దితి ఎలా వుంటుందన్నదానిపై కూడా ఉత్కంఠ నెలకొని వుంది. బలమైన నాయకులు లేకపోయినా ఆ పార్టీ బలంగా కనిపిండచం అందర్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కాకపోతే బిజేపి మద్దతు ఎంత వరకు ఆ పార్టీకి ఉపయోగపడుతుందో అన్నది చెప్పలేని పరిస్దితిలో వుంది. ఇప్ప్పుడు జరుగుతున్న ఎన్నికల రాష్ట్రాలలో బిజేపికి పెద్దగా పట్టులేదు. ఒక్క బెంగాల్, అస్సాంలలో తప్ప ఒంటరిపోరు చేయడం లేదు. పశ్చిమ బంగాల్లో పరిస్ధితి మళ్లీ దిది వైపు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఒక వేళ అక్కడ బిజేపి గెలిస్తే మాత్రం ఇక దేశంలో బిజేపికి తిరుగుండదు. వచ్చే ఎన్నికల్లోనూ బిజేపి గెలుపును అడ్డుకునే పరిస్దితి వుండదు. కాని ఒక వేళ ఓడిపోతే మాత్రం దాని ప్రభావం వచ్చే ఎన్నికల్లో తగ్గుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఇక దక్షిణాదిన తమిళనాడులో ఒకప్ప్పుడు స్నేహంగా వున్న ఏఐడిఎంకే రెండు సార్లు ఓటమికి పరోక్షంగా కారణం బిజేపి. ఆ పార్టీకి చెందిన శశికళను జైలుకు పంపడం వల్ల ఆ పార్టీ ఇబ్బంది ఎదుర్కొన్నది. ఇప్ప్పుడు ఏఐడిఎంకే వుందా? అంటే వుంది అనే పరిస్దితి తప్ప గెలిచేలా కనిపించడంలేదు. మూడోసారి డిఎంకే గెలిచి చరిత్ర సష్టిస్తుందా? అని కూడా అంటున్నారు. ఇక కేరళంలో ఎల్డీఎఫ్, యుడిఎఫ్‌లు నువ్వా నేనా అన్నట్లు ీVAరా ీVAరీగా తలపడుతున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు బిజేపికి మేలు కలుగుతాయా? లేక ఆశని పాతంగా మిగలుతాయా? అనేది కొద్ది రోజుల్లోనే తేలిపోతుంది. అయితే అమెరికా, ఇరాన్‌ల యుద్ద ఫలితాలు బిజేపిని ఇరకాటంలోకి నెట్టేస్తాయా? లేక అది కూడా బిజేపికి అనుకూలంగా మారుతాయా? అనేది కూడా తేలుతుంది. తమిళనాడు ఎన్నికల్లో డిఎంకే గెలిస్తే తప్ప కాంగ్రెస్‌కు కొంత మేర మేలు జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే కేరళలలో కాంగ్రెస్ గెలిస్తే, తమిళనాడులో డిఎంకే గెలవడం కూడా కాంగ్రెస్‌కు ఎంతో అవసరం. ఏది ఏమైనా తమిళనాడులో మెజార్టీ ప్రజలు, కొత్త ఓటర్లు, సినీ అభిమానులు, ముఖ్యంగా విజయ్ అభిమానులు కీలక భూమిక పోషిస్తే మాత్రం టివికే గెలుపు పెద్ద కష్టం కాదు.
