Painters Union Promotes Local Employment
కొండపర్తి గ్రామంలో పెయింటర్స్ సంఘం వినూత్న కార్యక్రమం
అలోచింపజేస్తున్న మన గ్రామంలోని ఉపాధి అవకాశా లు మన ఊరు యువతకే” అనే నినాదం
నేటిధాత్రి ఐనవోలు :-
అయినవోలు మండలం కొండపర్తి గ్రామంలో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా పెయింటర్స్ వర్కర్స్ సంఘం వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. నేతాజీ పెయింటర్స్ వర్కర్స్ సంఘం అధ్యక్షులు మరియు గ్రామ 10వ వార్డు సభ్యులు కట్కూరి రాజు అధ్యక్షతన గ్రామ పంచాయతీ కార్యాలయంలో సంఘం నియమ నిబంధనల వాల్ పోస్టర్ను ఘనంగా విడుదల చేశారు.
ఈ పోస్టర్ను గ్రామ సర్పంచ్ కంజర్ల అశోక్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ ప్రజలకు నిర్మాణ పనుల్లో పెయింటింగ్ సేవలను సౌకర్యవంతమైన ధరలకు అందించే విధంగా సంఘం పనిచేయాలని సూచించారు. స్థానికంగా నైపుణ్యాన్ని పెంపొందించి, గ్రామ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమని అభినందించారు.మన గ్రామంలోని ఉపాధి అవకాశా లు మన ఊరు యువతకే” అనే నినాదంతో ముందుకు వచ్చిన ఈ ఆలోచన గ్రామంలో మంచి స్పందన పొందుతోంది. ఈ కార్యక్రమం ద్వారా స్థానికంగా పనిచేసే కార్మికులకు గుర్తింపు రావడంతో పాటు, బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామంలోనే ఉపాధి దొరకనుంది.గ్రామ అభివృద్ధి దిశగా యువతను ప్రోత్సహిస్తూ తీసుకున్న ఈ నిర్ణయం ఇతర గ్రామాలకు కూడా ఆదర్శంగా నిలుస్తుందని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు.ఈ కార్యక్రమంలో పెయింటర్స్ సంఘం సభ్యులు మాదాసి కిరణ్, తమ్మడపల్లి రాజుకుమార్, గుగ్గిళ్ల రామ్ లక్ష్మణ్, కట్కూరి ప్రసాద్, మాదాసు భరత్, కట్కూరి అనిల్, ఎం.డి. పాషా, చోటు, శ్యాంసుందర్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
