`రేవంత్ నేస్తం, కెసి వేణుగోపాల్ సిఎం కావడం తథ్యం!
`కేరళలో వీస్తున్న కాంగ్రెస్ గాలి! సర్వ శక్తులు ఒడ్డుతున్న కాంగ్రెస్ పార్టీ!!
`“నేటిధాత్రి”, “డి ప్యాక” సంయుక్త సర్వే ప్రకారం కేరళ కాంగ్రెస్ వశం
`కేరళలో 75-85 సీట్లతో కాంగ్రెస్ ఘనవిజయం.

`కాంగ్రెస్ గాలి మరింత బలంగా వీస్తే 100 సీట్లు గెలిచే అవకాశం.
`కాంగ్రెస్, వామ పక్షాల మద్యే ప్రధాన పోటీ.
`బీజేపీ ప్రభావం చాలా తక్కువ.
`బీజేపీ కూడా కేరళలో పెద్దగా దృష్టి పెట్టలేదు.
`పదేళ్ల కమ్యూనిస్ట్ ల పాలనపై విసుగు చెందిన కేరళ ప్రజలు.
`గత స్థానిక సంస్థల ఎన్నికలలోనే స్పష్టమైన సంకేతాలిచ్చిన కేరళ ప్రజలు.
`లోకల్ బాడీ ఎలక్షన్లలో కమ్యూనిస్ట్ లను ఓడించి కాంగ్రెస్ కు పట్టం కట్టిన
`కేరళలో బలంగా తెలంగాణా సిఎం రేవంత్ ప్రచార ప్రభావం
`తెలంగాణా సీఎం రేవంత్ సభలకు తండప తండాలుగా జనం.
`రేవంత్ రోడ్ షో లకు కిక్కిరిసి పోతున్న ప్రజలు.
`కేరళ విజయంతో తెలంగాణా కాంగ్రెస్ లో తిరుగులేని శక్తిగా రేవంత్లి
`కేరళలో కాంగ్రెస్ గెలిస్తే కేరళ సీఎం గా కేసివేణుగోపాల”
`స్టార్ కాంపెయినర్ గా సీఎం రేవంత్ విస్తృత ప్రచారం.
`కేరళలో కాంగ్రెస్ గెలుపే లక్ష్యాంగా సాగుతున్న అహర్నిశలు కృషి చేస్తున్న కాంగ్రెస్ శ్రేణులు.
`ఇప్పటికే కేరళలో బలంగా వున్న కాంగ్రెస్ పార్టీ.
హైదరాబాద్, నేటిధాత్రి:
కేరళలో జరుగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపిస్తోంది. బలంగా కాంగ్రెస్ గాలి వీస్తోంది. కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో గెలిచి తీరుతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. కేరళ సిఎం. కావాలన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసి. వేణుగోపాల్ కల నెరవేరనుందని జనం అనుకుంటున్నారు. తెలంగాణ సిఎం. రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా కేసి. వేణుగోపాల్‌ను చెప్ప్పుకుంటారు. అలా స్నేహితుడు కేరళ సిఎం. కావాలన్న ఆలోచనతో తెలంగాణ సిఎం. రేవంత్ రెడ్డి స్టార్ కాంపెయినర్‌గా కేరళలో విసత ప్రచారం సాగిస్తున్నారు. ఇప్పటికే ఒక దఫా ఎన్నికల ప్రచారం రెండు రోజులు పాటు నిర్వహించారు. అక్కడ అనేక సభలు, సమావేశాలు కూడా నిర్వహించారు. తెలంగాణసిఎం. రేవంత్‌రెడ్డి చేసిన రోడ్‌షోలకు జనం విపరీతంగా వచ్చారు. రేవంత్ రెడ్డి సభలు, సమావేశాలకు జనం తండోపతండాలుగా తరలి వచ్చారు. తెలంగాణలో అమలు జరుగుతున్న అభివద్ది సంక్షేమ పథకాలపై రేవంత్ రెడ్డి చెబుతున్నప్ప్పుడు ఆసక్తిగా విన్నారు. స్నేహం కోసం సిఎం. రేవంత్‌రెడ్డి ఎంత దూరమైనా వెళ్తారు. ఈ సంగతి తెలియంది కాదు. అలాంటిది పార్టీ గెలుపుకోసం ఆయన పడే శ్రమ కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు. అందుకే తెలంగాణలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ను ప్రజలు గెలిపించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను ప్రజలు ఆదరించారు. కేవలం సిఎం. రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలు తెలంగాణ ప్రజలు బలంగా విశ్వసించారు. అలా ప్రజల నమ్మకాన్ని చూరగొనడం రేవంత్‌రెడ్డికి కొత్త కాదు. ఆయన రాజకీయ ప్రస్తానమే ఒక నమ్మకంతో మొదలైంది. ఆయన ఆత్మ స్ధైర్యం అంత గొప్పది. ఆయన విజన్ అంత దఢంగా వుంటుంది. నిజానికి రేవంత్ రెడ్డి ఏది తల్చుకుంటే దానిని సాదించే వరకు విశ్రమించరు. ఒక్కసారి ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత ఎన్ని అవాంతరాలెదురైనా వెనుదిరిగి చూడరు. ఎంతటి కష్టానికైనా వెనుకాడరు. ఎలాంటి అవరోదాలనైనా ఎదుర్కొంటారు. అటు మానసికంగా, ఇటు శారీరకంగా అంత్యంత దఢమైన లక్ష్యం వున్నవారికే సాద్యమౌతుందని మరోసారి నిరూపించిన నాయకుడు సిఎం. రేవంత్‌రెడ్డి. తెలంగాణలో కూడా కాంగ్రెస్ ఇక అధికారంలోకి రాదు. అనే స్ధితి నుంచి నేను తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తాను. అనే విశ్వాసాన్ని పార్టీకి కల్గించారు. పార్టీ శ్రేణులకు కల్పించారు. పార్టీని బలోపేతం చేశారు. ఊరూరు తిరిగారు. కాంగ్రెస్ కార్యకర్తల్లో నమ్మకం పురిగొల్పారు. ఈసారి ఎలాగైనా పార్టీని అదికారంలోకి తెచ్చేలా కాంగ్రెస్ నాయకుల్లో ఐక్యత నెలకొల్పారు. పార్టీ కోసం పని చేసే వారికి పెద్ద పీట వేశారు. అలా పార్టీకి ఒక్కొ ఇటుక పేర్చినట్లుపేర్చి, పార్టీని అదికారంలోకి తీసుకొచ్చారు. తాను రాజకీయాల్లోకి వచ్చిందే ఏనాడైనా సిఎం. కావడమే లక్ష్యమన్న మాటను నిజం చేసుకున్నారు. తనకు తాను నిర్ధేశించుకున్న గమ్యం చేరుకున్నారు. ఇప్ప్పుడు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ను బలోపేతం చేసే యజ్ఞం మొదలు పెట్టారు. కేంద్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలంటే, ప్రతి రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ను బలంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగానే కేరళ ఎన్నికý ప్రచారంలో ఆయన ముందుండి సాగుతున్నారు. స్టార్ కాంపెయినర్‌గా ఆయన చేస్తున్న ప్రచారం కేరళ ప్రజలను ఎంతో ఆకట్టుకుంటోంది. అలా కేరళ ప్రజలు మొదటి దపా రేవంత్‌రెడ్డి ప్రచారాన్ని బాగా విశ్లేషించుకుంటున్నారు. తెలంగాణ తెలంగాణ అభివద్ది గురించి తెలుసుకున్నారు. కేరళ ప్రజలు విద్యా వంతులు. విజ్ఞాన వంతులు. పదేళ్ల కమ్యూనిస్టుల పాలనపై ప్రజలు కూడా తీవ్ర వ్యతిరేకతతోవున్నారు. గత పదేళ్ల కాలంలో కేరళలను యాభై ఏళ్లు కమ్యూనిస్టులు వెనక్కి నెట్టేశారన్న అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమౌతోంది. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన అభివద్ది చాయలే ఇప్పటికీ కనిపిస్తున్నాయని ప్రజలు అంటున్నారు. పదేళ్ల కాలంలో కమ్యూనిస్టులు చేసిందేమీ లేదని జనం బహిరంగంగానే చెప్ప్పుకుంటున్నారు. ఇప్పటికే కేరళలో బలంగా మారిన కాంగ్రెస్‌కు పట్టం కట్టేందుకు ప్రజలు ఆసక్తిగా వున్నారు. పదేళ్ల కాలం కాంగ్రెస్‌ను దూరం పెట్టి, ఇబ్బందులు పడ్డామని ప్రజలు చెప్ప్పుకుంటున్నారు. ముఖ్యంగా విద్యావంతులైన కేరళ ప్రజలు నిజాల మీద సాగే రాజకీయాలపై ఆసక్తి పెంచుకుంటారు. దేశంలో వామపక్షాల చరిత్ర ముగిసింది. ఇక బిజేపి కేంద్రంలో పన్నెండేళ్ల పాలన ఎలా వుందో అందరికంటే ఎక్కువగా కేరళ ప్రజలకు బాగా తెలుసు. ఎనభైవ దశకంలోనే దేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించిన ఏకైక రాష్ట్రం కేరళ. అలా కాంగ్రెస్ పాలనలో అత్యంత వేగంగా అభివద్ది చెందిన ఏకైక రాష్ట్రం కేరళ. అలా రాష్ట్రాన్ని దేశంలోని అన్ని రాష్టాలకన్నా మెరుగైన స్ధానంలో కాంగ్రెస్‌పార్టీ నిలిపితే, కమ్యూనిస్టులు ప్రగతి నిరోధకులుగా పాలన సాగించారు. రాష్ట్రాన్ని వెనుకబడేలా చేశారు. మళ్లీ కేరళకు పూర్వ వైభవం రావాలంటే అది కాంగ్రెస్ వల్లే సాద్యమౌతుందని కేరళ ప్రజలు తీర్మానించుకున్నారు. అందుకే కాంగ్రెస్ సభలు నభూతో నభిష్యతి అన్నట్లుగా సాగుతున్నాయి. అవి సభలైనా, సమావేశాలైనా, రోడ్షోలైనా, కార్నర్ షోలైనా సరే ప్రజలు విపరీతంగా వస్తున్నారు. అదే సమయంలో కమ్యూనిస్టులు, బిజేపి పార్టీల సభలు వెలవెలబోతున్నాయి. తెలంగాణ సిఎం. రేవంత్ రెడ్డి పేలుస్తున్న డైలాగులు ప్రజల్లో చైతన్యం నింపుతున్నాయి. పైగా కేరళలో కాంగ్రెస్‌పార్టీ గ్యారెంటీలు ప్రజలను ఎంతో ప్రభావితులను చేస్తున్నాయి. పదేళ్లపాటు అమలు చేయకుండా కాలయాపన చేసిన కమ్యూనిస్టులు ఇప్ప్పుడు కొత్త కొత్త హమీలు ఇస్తే జనం నమ్మడం లేదు. ఇంత కాలం చేయకుండా ఇప్ప్పుడు అమలు చేస్తారన్ననమ్మకం లేదు. ఇక బిజేపి కేంద్రంలో పన్నెండేళ్లుగా వుంది. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య ఆ పార్టీ చూపుతున్న సవతి తల్లి ప్రేమ తెలియంది కాదు. ఇప్ప్పుడు బిజేపిని ఆదరిస్తే చేసే మేలు ఏమీ వుండదు. ముఖ్యంగా ఉత్తరాధి బిజేపి నాయకత్వం ముందు దక్షిణాది నాయకత్వం నోరు మెదపదని కూడా తెలుసు. అదే కాంగ్రెస్‌లో పార్టీ జాతీయ అ ధ్యక్షుడు మల్లికార్జున ఖర్చే కర్నాటకకు చెందిన నాయకుడు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసి. వేణుగోపాల్ కేరళకు చెందిన నాయకుడు. అంటే దక్షిణాది నాయకత్వాన్ని కాంగ్రెస్ ఎలా ప్రోత్సహిస్తుందో తెలియంది కాదు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ దక్షిణాది నాయకులకు ఎంతో ప్రాధాన్యత కల్పిస్తూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుంచి గాంధీ కుటుంబం కాకుండా ప్రధానిని చేయాల్సి వస్తే కూడా దక్షిణాది నాయకుడు పివి. నర్సింహారావుకు తొలి ప్రాదాన్యమిచ్చారు. అనేక మంది రాష్ట్రపతుల ఎంపికలోనూ దక్షిణాదికి ఎక్కువ ప్రాధాన్యత కల్పించిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేకమైన అభిమానం ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమే వుంటుంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలకు కూడ ఎంతో అభిమానం వుంది. అంతెందుకు ఒక ఓటు, రెండు రాష్ట్రాలు అనే కాకినాడ తీర్మాణం చేసిన బిజేపి పార్టీ ఉత్తరాదిలో మూడు రాష్ట్రాలను విభజించింది. అక్కడ ఏ ప్రజా ఉద్యమాలు లేకున్నా బిజేపి చేసింది. కాని తెలంగాణ ఉద్యమాన్ని బిజేపి గౌరవించలేదు. ఇవ్వలేదు. ఇస్తామని మాట ఇచ్చింది కాంగ్రెస్‌పార్టీ. సోనియాగాంధీ. మాట నిలబెట్టున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏదైనా మాట ఇస్తే నిలబెట్టుకునే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని ప్రజలకు తెలుసు. అందుకే కేరళలో ఇస్తున్న గ్యారెంటీలను ప్రజలు బలంగా నమ్ముతున్నారు. తెలంగాణ సిఎం. రేవంత్‌రెడ్డి ప్రజలకు వివరిస్తున్న తీరుతో మరింత నమ్మకం పెంచుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కేరళలో విజయం దిశగా సాగుతోంది. జనం ఆదరణ విపరీతంగా పెరిగింది. సిఎం. రేవంత్ స్నేహితుడు, కేరళ నాయకుడు, కాంగ్రెస్‌పార్టీ జాతీయ ప్రదాన కార్యదర్శి కేసి. వేణుగోపాల్ సిఎం. అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
