Youth Shift from Job Hopping to Job Hugging
ఆఫర్లున్నా కదలరు…ఉద్యోగం వదలరు!
‘జాబ్ హాపింగ్’… అంటే శాలరీ హైక్ కోసం తరచూ ఉద్యోగాలు మారడం… ‘జాబ్ హగ్గింగ్’… అంటే చేస్తున్న ఉద్యోగమే సేఫ్ అని, దాన్నే అంటిపెట్టుకొని ఉండటం… శాలరీ హైక్ కోసం తరచూ ఉద్యోగాలు మారే అలవాటుకు నవతరం తాత్కాలిక విరామం ప్రకటించేసింది.
మోడల్‌కాలనీగా సాగర్‌నగర్ అభివృద్ధి
సొమ్ము కొట్టు.. ఎఫ్‌సీ పట్టు!
19 మంది సివిల్ జడ్జీలకు సంస్థాగత శిక్షణ పూర్తి
శ్రీశైలంలో మిగిలింది 43 టీఎంసీలే
ఏఐ అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలి
‘యుద్ధం’తో పెరిగిన నిర్మాణ వ్యయం: క్రెడాయ్
స్త్రీ శక్తికి దన్నుగా పది సూత్రాలు: సత్యకుమార్
మహిళల జోలికొస్తే క్షమించం: రాయపాటి శైలజ
జిహాదీ గురించి తెలుసుకుంటున్నాం
ఎదురుదెబ్బలకు అధైర్యపడొద్దు!
పేదల ఇళ్లపై వైసీపీ గద్దలు
విదేశీ ప్రయాణం చేసిన అర్చకులు..గర్భాలయంలోకి ప్రవేశించడానికి
ఆ ఉద్యోగులను క్రమబద్ధీకరించాల్సిందే!
మోడల్‌కాలనీగా సాగర్‌నగర్ అభివృద్ధి
సొమ్ము కొట్టు.. ఎఫ్‌సీ పట్టు!
19 మంది సివిల్ జడ్జీలకు సంస్థాగత శిక్షణ పూర్తి
శ్రీశైలంలో మిగిలింది 43 టీఎంసీలే
ఏఐ అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలి
‘యుద్ధం’తో పెరిగిన నిర్మాణ వ్యయం: క్రెడాయ్
స్త్రీ శక్తికి దన్నుగా పది సూత్రాలు: సత్యకుమార్
మహిళల జోలికొస్తే క్షమించం: రాయపాటి శైలజ
జిహాదీ గురించి తెలుసుకుంటున్నాం
ఎదురుదెబ్బలకు అధైర్యపడొద్దు!
పేదల ఇళ్లపై వైసీపీ గద్దలు
విదేశీ ప్రయాణం చేసిన అర్చకులు..గర్భాలయంలోకి ప్రవేశించడానికి
ఆ ఉద్యోగులను క్రమబద్ధీకరించాల్సిందే!
‘జాబ్ హగ్గింగ్’… అంటే చేస్తున్న ఉద్యోగమే సేఫ్అని, దాన్నే అంటిపెట్టుకొని ఉండటం…
శాలరీ హైక్ కోసం తరచూ ఉద్యోగాలు మారే అలవాటుకు నవతరం తాత్కాలిక విరామం ప్రకటించేసింది. బెంగళూరు ఐటీ క్యూబికల్స్ నుంచి హైదరాబాద్ పార్టీషన్ డెస్కుల దాకా… చెన్నై ఆటోమొబైల్ ఇండస్ట్రీ నుంచి కేరళ ప్రభుత్వ సంస్థల సౌధాలదాకా ఇదే ఽధోరణి. కృత్రిమ మేధ (ఏఐ) ఆటోమేషన్, గిగ్ ఎకానమీ బర్నవుట్, కరోనా అనంతర లేఆఫ్‌ల మధ్య… అందరూ ‘సేఫ్‌గేమ్’ ఎంచుకుంటున్నారు. ఈ నయా ధోరణిపైనే ఈవారం కవర్‌స్టోరీ.
పాతికేళ్ల సాఫ్ట్వేర్ టెస్టర్ ప్రియంవదకు ఓ స్టార్టప్ సంస్థలో ఆఫర్ వచ్చింది. అందులో చేరడం రిస్కు అనుకుని, ఆ ఆఫర్‌ను తిరస్కరించింది. ‘ఎంట్రీ లెవెల్ జాబ్స్ అన్నింటినీ ఏఐ మింగేస్తోంది. యూనికార్న్ (బిలియన్ డాలర్ల విలువ కలిగి, ఇంకా స్టాక్మార్కెట్లో లిస్టవ్వని ప్రైవేటు స్టార్టప్ కంపెనీ)ల వెంటబడటం కన్నా… ఉన్న జాబ్‌తోనే తృప్తిపడటం బెటర్’ అని భావించి మిడ్ లెవెల్ క్వాలిటీ అనలిస్ట్‌గా తన ఐటీ కంపెనీని వదలిపోలేదు.
– – – –
వీళ్లిద్దరే కాదు.. నవతరం ఇప్పుడు పాటిస్తున్నది ‘స్టే సేఫ్’ వ్యూహం. ‘చేతిలో ఉన్న ఒక పక్షి… పొదలో ఉన్న రెండు పక్షుల కన్నా విలువైనది’ అనే ఎరుక!
అంటే.. తన ఉద్యోగం పట్ల అసంతృప్తిగా ఉన్నా, జీతం పెరగకపోయినా… చేస్తున్న ఉద్యోగాన్ని వదలకుండా ఉండటం. ప్రత్యేకంగా దక్షిణాదిలో… అంటే బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కొచ్చి లాంటి నగరాల్లో ఈ ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది.
