దిశానిర్ధేశకుడు

 


` దేశాభివృద్ధికి భవిష్యత్‌ దిక్సూచీ కానున్నాడు.
` మూడు నెలల్లో తెలంగాణ పల్లెల్లో చీకట్లు పారద్రోలాడు.
` రెండేళ్లలో సాగుకు ఇరవై నాలుగు గంటల కరంటు సరఫరా


` చెరువులకు పునరుజ్జీవం పోసిన భగీరథుడు
` గోదారి జలాలతో కళకళలాడిరచాడు.
` మండు టెండల్లలోనూ చెరువులు నిండు కుండలను చేశాడు
` మూడేళ్లలో కాలేశ్వరం జలాలు తెలంగాణ పల్లెలో జాలువారించాడు.
` పేదింటి పెద్దన్నగా పది లక్షల మందికి ఆడపిల్లల పెళ్లి చేశాడు
` రైతు బంధువై, ఏడేళ్లలో రూ.54వేల కోట్లతో రైతన్నకు బాసటయ్యాడు.
` తెలంగాణ ప్రగతి దేశంలో ఆవిష్కరణకు పూనుకుంటున్నాడు.


` ప్రపంచం ముందు మన దేశాన్ని నెంబర్‌ వన్‌ చేయాలని కోరుకుంటున్నాడు
` ఉద్యమ నాయకుడు… ప్రగతికే పాలకుడయ్యాడు. a
` దేశ పాలకుడైతే…ప్రపంచమే నివ్వెరపోయే అభివృద్ధి చేస్తాడు.
హైదరాబాద్‌ , నేటిధాత్రి :
తనేంటో చెబుతాడు. తనేం చేయాలనకుంటున్నాడో చెబుతాడు. ఏం చేస్తే ప్రజలు బాగు పడతారో వివరిస్తాడు. ఆ మార్గం అనుసరిస్తాడు. ప్రజాభివృద్ధి కోసం ఆచరిస్తాడు. అభివృద్ధి కామకుడైతాడు. ప్రగతి బాటలు వేస్తాడు. తన కలలుగన్న రంగంలో నెంబర్‌ వన్‌ అనిపించుకుంటాడు. తను సాధించిన తెలంగాణను దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలబెట్టాడు. ఆయనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌. ఇక దేశ భవిష్యత్తు మీద దృష్టి పెడుతున్నాడు. తెలంగాణను అన్ని రంగాలలో చేసిన అభివృద్ది నమూనాను దేశానికి అనుసరణీయం చేయాలని ఆలోచిస్తున్నారు. దేశ ప్రగతి పరుగులు పెట్టేందుకు అవసరమైన ఆర్ధిక విశ్లేషణ చేస్తున్నాడు. తన ఆలోచనలు తాజాగా మీడియా ముఖంగా దేశ ప్రజలతో పంచకున్నారు. తాను చేసిన అభివృద్ది నమూనాను చూపించాడు. దేశమంతా ఆచరిస్తే సంక్షేమ రాజ్య నిర్మాణమేకాదు, ప్రగతిశీల దేశ నిర్మాణం కూడా ఎలా సాధ్యమౌతుందో చెప్పాడు. దేశంలో సరికొత్త చర్చకు తెరతీశాడు. అభివృద్ది ఎలా వుంటుందో కళ్లకు కట్టినట్లు తన మాటల ద్వారా చెప్పడమే కాదు, చూపించాడు కూడా…సంక్షేమం అంటే ఇది అని తాను ఆచరించి చూపించిన అన్ని పథకాలను వివరించాడు. ఏ రాష్ట్రంలో లేని, అమలు గురించి ఆలోచన గాని అనేక పధకాలను తెలంగాణలో ఎలా అమలౌతున్నాయో విడమర్చి చెప్పారు. అదీ కేసిఆర్‌ అని మరోసారి దేశమంతా చర్చికునే నాయకుడయ్యారు.
కేసిఆర్‌. ఈ మూడక్షరాల పదాలు…కొన్ని కోట్ల తెలంగాణ వాదుల గొంతుకలు. అవును. కేసిఆర్‌ అంటే మొన్నటి తరం ఆశయాల వారధి. నిన్నటి తరం ఆలోచనల సారధి. నేటి తరం సాధికారితకు ప్రతినిధి. రేపటి తరం కలలకు సంక్షేమాధిపతి. రాజకీయ నేతలు వేరు. సామాజిక వేత్తలు వేరు. ఈ రెండూ కలగలిసిన వారే కేసిఆర్‌ అవుతారు. సంక్షేమం అన్నది ప్రజల హక్కు. అదేదో పాలకులు ఇచ్చే బహుమతి కాదు. ఇది బాగా తెలిసిన నాయకుడు కేసిఆర్‌. అందుకే తెలంగాణ కోసం ఆయన పడిన తపన అంతా ఇంతా కాదు. ఉమ్మడి రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా బతుకులీడుస్తున్న తరుణాన్ని జీర్ణించుకోలేకపోయాడు. తెలంగాణ సమాజానికి దివిటీ అయ్యాడు. తెలంగాణ కోసం కొట్లాడాడు. తెలంగాణ సాధించాడు. వెలుగులు ప్రసాదిస్తున్నాడు. అదీ కేసిఆర్‌. ఉద్యమ కాలంలోనే తెలంగాణ ఎలా వుండాలని కలలుగన్న ఏకైక ఉద్యమ నాయకుడు. తెలంగాణ ఉద్యమంలో ఎంత మంది పాల్గొన్నా, వారి ఆలోచనా పరిధి కేవలం సాధన వరకే…కాని కేసిఆర్‌ మాత్రమే తెలంగాణ వస్తే ప్రజలు జీవితాల్లో ఎంత వెలుగునిండుతుందని ముందే చెప్పాడు.
ఒక్కడుగా మొదలై, ఒక్క అడుగుతో మొదలై, ఒంటరినన్న భావన లేకుండా సాగిన మలి తరం తెలంగాణ నేత. తెలంగాణ సాధన పోరాట జగజ్జేత. తన ఆలోచనే కొండత బలమై, తనే తెలంగాణ పదమై, నలుగురితో మమేకమై, తెలంగాణ దుఃఖాన్ని చూసి తనూ కన్నీటి పర్యంతమై జై తెలంగాణ అన్న నాయకుడు కేసిఆర్‌. ఎండిన బీడులు చూసి దుఃఖపడి, తడారిన ఏరులను చలించి, ఒట్టిపోయిన వాగులను చూస్తూ కళ్లలో సుడులై తరిగే నీళ్లలో దుఃఖాన్ని దాచుకున్నాడు. గంగాళ్లాలాంటి గొలుసు కట్టు చెరువులు చెంబులై, తుమ్మలు మెలిచి చెదిరిపోయాయి. తెలంగాణ వస్తే తప్ప మళ్లీ నీటి చుక్కల జాడలు చెరువుల్లో చూడలేమని జై తెలంగాణ అన్నాడు కేసిఆర్‌. తెలంగాణ పల్లె పెడుతున్న కన్నీటి ఉప్పెనుంచి రగిలిన నిప్పు కణం. అగ్ని రణం కేసిఆర్‌. అందుకే ఉద్యమ కాలంలోనే కేసిఆర్‌ను ఎదిరించాలంటే సమైక్య నాయకులు కూడా ఒకటికి రెండు ఆలోచించేవారు. కేసిఆర్‌ చెడుగుడు ఆడుకుంటే గుడ్లప్పగించి చూసేవారు. ఎందుకంటే వాళ్లు ఆనాడు చేసిన అన్యాయం నిజం. వాటిని తెలంగాణ సమాజానికి కేసిఆర్‌ వివరించడం నిజం. అందుకే నిజమన్న పర్యాయం కేసిఆర్‌ కావడంతో తెలంగాణ రాష్ట్ర సాధన కల సాకారమైంది. తెలంగాణ కల నిజమైంది. తెలంగాణ రాష్ట్రం కళ్లనిండా ఆవిషృతమైంది.
వచ్చే తెలంగాణే ఎలా వుండాలో ఉద్యమ కాలంలోనే బ్లూప్రింట్‌ చూపించిన కేసిఆర్‌ తెలంగాణ సాధకుడిగా ఆచరించి చూపించాడు. అభివృద్ధి ఆవిష్కరించి చూపించాడు. సంక్షేమం అందించి చూపించాడు. తెలంగాణ చీకట్లు పారద్రోలాడు. ఇది నిజం. ఈ మాటలు ఉద్యమ సమయంలోనే పదేపదే కేసిఆర్‌ చెప్పారు. కాని నాటి సీమాంధ్ర నేతలు ఎద్దేవా చేస్తూ వుండేవారు. తలాపున గోదారి పారుతున్న చుక్క గొంతు తడపదు. సింగరేణి సిరులెన్ని తెలంగాణలో వున్న పల్లెలో వెలుగు నిండదు. అందుకే తెలంగాణ అన్నది ఉద్యమ కాలం నాడు కేసిఆర్‌ చెప్పిన మాట. తెలంగాణ వస్తే మన మాగాణాలు పచ్చని పైట పర్చుకుంటాయి. మన పల్లెలు సింగరేణి వెలుగులతో చీకటిని పారద్రోలుతాయన్నాడు. అలాగే తెలంగాణ వచ్చిన మూడు నెలల్లో కోతలు లేని కరంటును చూపించాడు. రెండేళ్లలో మొత్తం తెలంగాణ పల్లెలు,పట్టణాలే కాదు, సాగుకు కావాల్సినంత కరంటు ఇచ్చాడు. ఇంటికి ఇరవైనాలుగు గంటల కరంటు లాగే, సాగుకు కూడా ఇరవై నాలుగు గంటలు సరఫరా చేస్తున్నారు. తెలంగాణ వస్తే చిమ్మచీకట్లే అన్నవారే నోరెళ్లబెట్టి చూసేలా చేశాడు. తెలంగాణలో వెలుగులు ఆవిష్కరించాడు. తనేంటో నిరూపించాడు. అదే దారిలో ఎండిన చెరువులు తప్ప నీటి జాడలు లేని దగ్గర మళ్లీ చెరువులు తవ్వించాడు. పూడికలు పూర్తిగా తీయించి, గోదారి నీళ్లతో నింపేశాడు. మండుటెండల్లో కూడా చెరువులన్నీ కళకళలాడేలా చేశాడు. తెలంగాణలో నీటి గోసలు తీర్చాడు. ప్రపంచంలో ఏ దేశంలో జరగనంత వేగమైన ప్రగతి శీల భావనను ఆచరించి చూపించాడు. మూడేళ్లలో కాళేశ్వరం నిర్మాణం చేసి ప్రపంచమే అబ్బురపడేలా చేశాడు. లక్షల ఎకరాలకు నిరంతరం నీటిని అందిస్తున్నాడు. ఒకనాడు కోనసీమ గురించి చెప్పుకున్న ప్రజలు ఇప్పుడు తెలంగాణ సిరిసంపదలను గురించి చెప్పుకుంటున్నారు.
ఇక సంక్షేమాల విషయంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని కళ్యాణ లక్ష్మి అనే పధకంతో పది లక్షల మంది పేదింటి అమ్మాయిల పెళ్లి చేసిన రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమే. అలాంటి పథకమొకటి సృష్టించొచ్చుని కనిపిపెట్టిన ఏకైక నాయకుడు కేసిఆర్‌. ఆచరించి చూపుతూ పేదింటికి పెద్ద కొడుకైన ఏకైక నాయకుడు కేసిఆర్‌. అలాగే రైతు పడే కష్టం. ఆరుగాలం అవస్ధలు. తీరా పంటచేతికొచ్చేముందు కష్టాలు. నష్టాలు. ప్రకృతి కన్నెర్రలు. అకాల వర్షాలు. వడగండ్లు. ఇలా చెప్పుకుంటూ పోతే రైతుకు అడుగడుగునా గండాలే. అయినా దేశాన్ని పోషిస్తున్నది రైతన్నే. ఆ రైతు సంతోషమే రాష్ట్ర సంతోషం. ఆ రైతు ప్రగతే తెలంగాణ ప్రగతి అని నమ్మే కేసిఆర్‌ రైతు బంధువు అయ్యాడు. నాలుగేళ్లుగా రైతు బంధు అమలు చేస్తున్నాడు. ఇలాంటి ప్రగతి బాటలు దేశంలోనూ పడాలి. అందుకే కేసిఆర్‌ దేశ రాజకీయాల్లో క్రియాశీలం కావాలి. వాటిని ప్రభావితం చేయాలి. రెండేళ్లలో తెలంగాణ సాధించిన విజయాలు, దేశంలోనూ అమలు చేస్తే దేశం ప్రపంచలోనే ఎందుకు నెంబర్‌ వన్‌ కాదో చూపిస్తానని ప్రతినభూనాడు. తెలంగాణ జన నేత, దేశ నేతగా ఎదిగితే దేశ రాజకీయ ముఖచిత్రమే కాదు, ఆర్ధిక ముఖచిత్రంలోనూ మార్పులొస్తాయని చెప్పడంలో సందేహం లేదు. ప్రపంచమంతా మన వైపు చూస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. జై కేసిఆర్‌ అని అంటున్న తెలంగాణకు తోడు దేశమంతా అనే రోజు వస్తుందని ఎదరుచూద్దాం…మాది తెలంగాణ అని సరగర్వంగా తలెత్తుకుందాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!