Hope Rises for Cherial Constituency Revival
మళ్లీ చిగురిస్తున్న ‘చేర్యాల’ ఆశలు!
ఒకప్పుడు రాజకీయంగా వెలుగొందిన చేర్యాల ప్రాంతం ఇప్పుడు తన అస్తిత్వం కోసం పోరాడుతోంది.
నియోజకవర్గాల పునర్విభజనపై సర్వత్రా చర్చ.. పాత వైభవం దక్కేనా?
దెబ్బకు దెబ్బ.. 8 గల్ఫ్ బ్రిడ్జ్‌లను టార్గెట్ చేసిన ఇరాన్..
కల్తీ మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త!: సజ్జనార్
అత్యాధునిక యుద్ధనౌక ‘INS తారాగిరి’ విశాఖలో జలప్రవేశం
అన్ని శాఖలకు ముఖ్యమంత్రే మంత్రిగా ఉండటం మన కర్మ: కవిత
సెలవుల ఎఫెక్ట్.. విమాన చార్జీలకు రెక్కలు
తప్పుచేసే పోలీసులను ప్రశ్నించడం తప్పా: పేర్ని నాని
జగన్.. అమరావతిని ఇంచు కూడా కదపలేరు: గంటా శ్రీనివాసరావు
అబద్ధాలు చెప్పడంలో ఇద్దరూ ఇద్దరే
మా ఊళ్లో మద్యం వద్దు..
ఎన్టీఆర్ జిల్లాలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృత
పుస్తకాలు కొనుక్కునేందుకు వచ్చి అనంతలోకాలకు..
ఇలా జరిగిందేంటి.. మరీ ఇంత ఈజీగా దొంగతనం చేయొచ్చా?..
ఏసుక్రీస్తు ప్రాణాలను త్యాగం చేసిన రోజును స్మరించుకుంటున్న క

రెవెన్యూ డివిజన్ ఊసే లేదు..
- జమిలీ ఎన్నికలతోనైనా అదృష్టం వరించేనా?
చేర్యాల(సిద్దిపేట): ఒకప్పుడు రాజకీయంగా వెలుగొందిన చేర్యాల ప్రాంతం ఇప్పుడు తన అస్తిత్వం కోసం పోరాడుతోంది. నిన్నటి వరకు రెవెన్యూ డివిజన్ సాధన కోసం ఉద్యమించిన స్థానిక ప్రజలు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే నియోజకవర్గాల పునర్విభజనపై గంపెడాశలు పెట్టుకున్నారు. 2029లో జమిలీ ఎన్నికల నిర్వహణ దిశగా అడుగులు పడుతుండటంతో, గతంలో కనుమరుగైన చేర్యాల నియోజకవర్గం మళ్లీ పురుడుపోసుకుంటుందన్న ఆశలు చిగురిస్తున్నాయి.
1957కు పూర్వం నల్లగొండ జిల్లా పరిధిలో చేర్యాల తాలూకా కేంద్రంగా కొనసాగింది. ఆ సమయంలో జనగామ కూడా చేర్యాల తాలూకాలో అంతర్భాగంగా కొనసాగింది. 1962లోచేర్యాల, మద్దూరు, నర్మెట్ట, బచ్చన్నపేట మండలాలతో పాటు జనగామ మండలంలోని రెండు గ్రామాలు, రఘునాథ పల్లి మండలంలోని మూడు గ్రామాలతో చేర్యాల నియోజకవర్గం-261గా ఏర్పడింది.
2009లో కనుమరుగు
1957 నుంచి 2008 వరకు12సార్లు జరిగిన సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఐదుసార్లు కాంగ్రె్‌సకు, మూడుసార్లు టీడీపీ, రెండుసార్లు టీఆర్‌ఎ్‌సకు, సీపీఐకి ఒకసారి, స్వతంత్రుడికి ఒకసారి పట్టం కట్టారు. 2009లో చేపట్టిన నియోజకవర్గాల పునర్విభజనలో చారిత్రక, భౌగోళికంగా అన్ని అర్హతలున్నప్పటికీ చేర్యాలకు అన్యాయం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నియోజకవర్గాల సంఖ్య 261-చేర్యాల నుంచే ప్రారంభమైనా పునర్విభజనలో నాలుగు మండలాలతో కూడిన చేర్యాలలో ఇతర ప్రాంతాలను విలీనం చేయాల్సి ఉన్నా జనగామ మండలంలో విలీనం చేయడంతో కనుమరుగైంది. చేర్యాల మండలాన్ని విడగొట్టి కొమురవెల్లిని కొత్త మండలంగా చేశారు. చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు మండలాలను సిద్దిపేట జిల్లాలో చేర్చగా.. బచ్చన్నపేట, నర్మెట్ట మండలాలను జనగామలో కలిపారు. దీనివల్ల ఈ ప్రాంతం రెండు వేర్వేరు జిల్లాలు, వేర్వేరు రెవిన్యూ డివిజన్ల పరిధిలోకి వెళ్లి అనాథగా మారింది.