Ward Meeting Under Pragathi Plan
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రగతి ప్రణాళిక
మున్సిపల్ చైర్పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్
నర్సంపేట,నేటిధాత్రి:
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నర్సంపేట మున్సిపాలిటీ 25వ వార్డులో గురువారం వార్డు సభ నిర్వహించారు. స్థానిక కౌన్సిలర్ మున్సిపల్ చైర్పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వార్డు ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సహకారంతో నర్సంపేట పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా చేరేలా, ప్రజా సమస్యలు పరిష్కారమయ్యేలా ఈ ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు.వార్డుల్లో డ్రైనేజ్, మట్టి రోడ్లు, మంచినీటి సరఫరా, వీధి దీపాలు, పరిశుభ్రత వంటి మౌలిక వసతుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వార్డులో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.అనంతరం వార్డు ప్రజల నుంచి పలు సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకుబ్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కటా ప్రభాకర్, వార్డు ముఖ్యులు కీసర నరేందర్, కీసర వెంకటేశ్వర్లు, కాటా అఖిల్, కీసరి రాజీవ్, నల్గొండ వంశీ, స్వామిశెట్టి శేఖర్, శోభన్ బాబు, చీకటి శివమణి, మున్సిపల్ అధికారులు, వార్డు ఆఫీసర్, ఎస్ఎల్ఎఫ్ ఆర్పీలు, మహిళా సంఘాల సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, వార్డు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
