Gromor Center Launched in Rajupet
రాజుపేటలో గ్రోమర్ నూతన కేంద్రం ప్రారంభం
నర్సంపేట,నేటిధాత్రి:
రాజుపేట గ్రామంలో గ్రోమర్ సంస్థ ఆధ్వర్యంలో నూతన వ్యవసాయ కార్యక్రమాన్ని మండల వ్యవసాయ శాఖ అధికారి కృష్ణ కుమార్ ప్రారంభించారు. రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రైతులు గ్రోమర్ సంస్థ అందిస్తున్న సేవలను వినియోగించుకుని పంటల దిగుబడిని పెంచుకోవాలని సూచించారు. అలాగే ఎరువులను సరైన విధంగా వినియోగించడం ద్వారా ఖర్చులు తగ్గి దిగుబడి పెరుగుతుందని వివరించారు.ఈ కార్యక్రమంలో గ్రోమర్ సంస్థ ప్రతినిధులు రైతులకు డ్రోన్ సేవలు, భూసార పరీక్షలు మరియు ఆధునిక వ్యవసాయ సేవల గురించి వివరించారు. ఆధునిక సాంకేతికతను వ్యవసాయంలో ఉపయోగించడం వల్ల రైతులకు మంచి లాభాలు వస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, వ్యవసాయ సహాయక అధికారి నాగరాజు, వ్యవసాయ మార్కెటింగ్ అధికారి శరత్ మరియు గ్రోమర్ సిబ్బంది పాల్గొన్నారు.
