· విద్యార్థి దశనుంచే చురుగ్గా రాజకీయాల్లో…
· బీజేవైఎంలో కీలక పదవుల నిర్వహణ
· ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం
· మూడుసార్లు అసెంబ్లీకి, రెండుసార్లు పార్లమెంట్‌కు ఎన్నిక
· మైనింగ్ రంగంలో కత్రిమేధను ప్రవేశపెట్టాలన్న లక్ష్యం
· సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, బీబీనగర్ ఎయిమ్స్ అభివద్ధిలో కీలకపాత్ర
· నియోజకవర్గంలో ఆరఓఆర్ల నిర్మాణాలు
· రీజినల్ రింగ్‌రోడ్డు మంజూరులో కీలక పాత్ర
· నిశ్శబ్దంగా సమర్థ సేవలందిస్తున్న కిషన్‌రెడ్డి
హైదరాబాద్, నేటిధాత్రి:
గంగాపురం కిషన్‌రెడ్డి ప్రస్తుతం కేంద్ర బొగ్గు (25వ మంత్రి) మరియు గనులశాఖ (45వ మం త్రి) మంత్రిగా కొనసాగుతున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన భారతీయ జనతాపార్టీకి చెందిన తెలంగాణ రాష్ట్ర కీలక నేత. గతంలో ఆయన కేంద్ర పర్యాటÅ£, సాంస్కతిక, ఈశాన్య రాష్ట్రాల అభివద్ధి శాఖ మంత్రిగా (2021`24) మధ్యకాలంలో పనిచేశారు. అదేవిధంగా 2019`21 మధ్యకాలంలో కేంద్ర ీVAంశాఖ సహాయమంత్రిగా సేవలందించారు. గతంలో ఆయన అంబర్పేట్ నుంచి బీజేపీ తరపున ఎమ్మెల్యేగా మూడుసార్లు ఎన్నికయ్యారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.
రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లో 1960, జూన్ 15న జన్మించారు. తండ్రిపేరు స్వామిరెడ్డి, తల్లి ఆండాళ్లమ్మ. కిషన్‌రెడ్డి, కావ్యారెడ్డిని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమా ర్తె వున్నారు. సీఐటీడీ నుంచి డిప్లొమా ఇన్ టూల్ డిజైన్ కోర్సును పూర్తిచేశారు.
విద్యార్థి దశ అంటే 1977 నుంచే రాజకీయాల్లో చురుగ్గా పాý£్గనేవారు. 1980లో భారతీయ జనతాపార్టీ ఆవిర్భావం నుంచి పూర్తిస్థాయి సభ్యుడిగా కొనసాగుతూ నేడు కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు. 1982 నుంచి 2001 వరకు భారతీయ జనతాపార్టీ యువమోర్చా (బీజేవైఎం)లో వివిధ పదవులు నిర్వహించారు. 2001`02 సంవత్సరంలో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ కోశాధికారిగా, అధికార ప్రతినిధిగా, రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయ ఇన్చార్జ్గా పనిచేశారు. 2002నుంచి 2005 వరకు బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగా కొనసాగారు. 2004లో హిమయత్‌నగర్ నుంచి, 2009, 2014 సంవత్సరాల్లో అంబర్‌పేట స్థానం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. 2010`14 మధ్యలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడా బీజేపీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. 2012జనవరి 19న ఆయన తెలంగాణ పోరు యాత్ర పేరుతో 3500 కిలోమీటర్ల దూరం పాదయాత్ర నిర్వహించారు. మొత్తం 986 గ్రామాలు, 88 అసెంబ్లీ నియోజకవరాల్లో ఆయన పాదయాత్ర కొన సాగింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా ఆయన ఈ పోరుయాత్ర జరిపారు. ఈయాత్రను నితిన్ గడ్కరీ ప్రారంభించడం గమనార్హం.
ప్రస్తుతం కేంద్ర u£గ్గు మరియు గనుల మంత్రిగా పనిచేస్తున్న ఆయన కొన్ని కీలక అడుగులు ముందుకేస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకంగా మారిన లీథియం గనుల వేలాన్ని పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇక మైనింగ్ రంగంలో డ్రోన్లు, క త్రిమ మేధను విరివిగా ఉపయోగించాలని రాష్ట్రాలను కోరారు. దేశీయంగా u£గ్గు ఉత్పత్తిని పెంచి, విదేశీ దిగుమతులపై ఆధారపడకుండా శక్తి వనరుల విషయంలో స్వయం సమద్ధి సాధించేందు కు కషి చేస్తున్నారు. కేంద్ర మంత్రిగా వుంటూనే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ, బీబీనగర్‌లోని ఎయిమ్స్ అభివద్ధి ప్రాజెక్టులపై ప్రత్యేకంగా దష్టి కేంద్రీకరించారు.
కేంద్రమంత్రిగా, సికింద్రాబాద్ ఎంపీగా ఆయన కొన్ని కీలక పనులు చేపట్టారు. రూ.700 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివద్ధి పనులు చేపట్టారు. ఇక్కడ విమానాశ్రయంలో వుండే సదుపాయాలను కల్పిస్తారు. ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు నియోజకవర్గంలో చీరాలగడ్డ, ఇతర రైల్వే ఒవర్ బ్రిడ్జ్ (ఆరఓఆర్)లు, అండర్‌పాస్‌ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నారు. తెలంగాణకు మకుటంలా భావించే రీజినల్ రింగ్ రోడ్డు (ఆరఆరఆర్) నిర్మాణానికి కేంద్రం నుంచి అనుమతి సాధించడంలో కీలకపాత్ర పోషించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకింద జంట నగ రాల్లోని చెరువుల ఆధునీకరణకు కషిచేస్తున్నారు.
‘ప్రసాద’ పథకం కింద తెలంగాణలో రామప్పదేవాలయం, భద్రాచలం వంటి పుణ్యక్షేత్రాల అభి వద్ధికి నిధులు కేటాయించారు. రామప్పకు ‘యునెస్కో’ గుర్తింపు రావడంలో ఆయన కషి ఎం తో వుంది. ప్రస్తుతం గనులశాఖ మంత్రిగా లీథియం ఖనిజాన్ని వెలికి తీయడానికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ఈ ఖనిజం సమద్ధిగా లభిస్తే విద్యుత్ వాహన రంగంలో దేశం స్వయం సమద్ధి సాధించగలదు. మైనింగ్, బొగ్గు రంగంలో కొత్త ఆవిష్కరణలు చేసే స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నారు. ఇందుకోసం వాటికి పెద్ద ఎత్తున గ్రాంట్ల రూపంలో సహాయం అందిస్తున్నా రు. బొగ్గుగనుల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం పెంచడమే కాకుండా, వేలాదిమందికి ఉద్యోగాలు లభించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో పౌర మౌలిక సదుపాయాల కల్పన, హైదరాబాద్ ఐటీ రంగ అభివద్ధికి కేంద్రం తరపున కిషన్‌రెడ్డి అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఎలివేటెడ్ కారిడార్లనిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే భూపరిహారం నిధులను (సుమారు రూ.303.62కోట్లు) నేరుగా కంటోన్మెంట్ బోర్డు (ఎస్సీబీ) పౌర పనులకే ఉపయోగించుకునేలా కిషన్‌రెడ్డి కేంద్ర రక్షణశాఖ నుంచి అనుమతి ఇప్పించారు. ఈ నిధుల్లో రూ.128 కోట్లతో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ను, అలాగే పాట్నీ, రసూల్‌పుర వద్ద తుపాను నీటి కాల్వలను నిర్మిస్తున్నారు. కంటోన్మెంట్ పరిధిలో అంతర్గత రోడ్డు పునరుద్ధరణ, కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచఎంసీలో విలీనం చేసే ప్రక్రి యపై కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనివల్ల పౌర సదుపాయాలు మరింత మెరుగు కాగలవు. ప్రాథమిక వసతులకోసం అదనంగా రూ.18కోట్ల ప్రత్యేక నిధుల ప్రతిపాదన ప్రస్తుతం కేంద్ర రక్షణశాఖ పరిశీలనలో వుంది.
ఐటీ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతను తీర్చిదిద్దేందుకు మల్లేపల్లిలో రూ.10 కోట్ల వ్యయంతో మోడల్ ఐటీఐ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ‘వికసిత భారత్ ఎంటర్‌ప్రెన్యూర్స్ నెట్వర్క’ ద్వారా గ్రామీణ మరియు పట్టణ యువత ఐటీ స్టార్టప్‌లు ప్రారంభించేలా శిక్షణ మరియు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. హైదరాబాద్‌లోని ‘సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా’ (ఎస్టీపీఐ) ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.1.45లక్షల కోట్ల ఎగుమతులను సాధించడంలో కేంద్రం అందించిన రాయితీలు, మౌలిక సదుపాయాలు దోహదపడ్డాయి. ఐటీ పరి శ్రమ కేవలం కోడింగ్‌కు మాత్రమే పరిమితం కాకుండా కత్రిమ మేధ (ఏఐ), ప్రాడక్ట్ ఇన్నోవేషన్‌లో ప్రపంచ నాయకత్వం వహించాలని ఐటీ సంస్థలను కిషన్‌రెడ్డి కోరారు. హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే మూడు హైస్పీడ్ కారిడార్లు`పూణె, బెంగళూరు, చెన్నై`ఐటీ మరియు ఫార్మా రంగాలకు ఊతమిస్తాయని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
