“CM Relief Fund Cheque Distributed”
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట మండలం భాంజిపేట గ్రామానికి చెందిన వీరమల్ల సుధాకర్ రెడ్డి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన సందర్భంగా జరిగిన వైద్య ఖర్చుల నిమిత్తం వారి కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.1 లక్ష ఆర్థిక సహాయం మంజూరు చేయడం జరిగింది.ఈ మేరకు మంజూరైన చెక్కును నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో బాధితుడు సుధాకర్ రెడ్డి కుమారుడు వీరమల్ల రాజిరెడ్డికి అందజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆరెళ్లి నరేష్ , కట్ల నిరంజన్ రెడ్డిపాల్గొన్నారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
