కోతులను తప్పించబోయి ఆటో బోల్తా
గాదె వాగు సమీపంలో జరిగిన సంఘటన
కార్లయి కి చెందిన ఇద్దరికి స్వల్ప గాయాలు
కొత్తగూడ, నేటిధాత్రి.కూరగాయలతో వస్తున్న ఆటోను గమనించిన కోతులు దాడి చేస్తాయని వాటిని గమనించిన డ్రైవర్ ఆటో ను అతి వేగంగా వెళ్తుండగా మూలమలుపు వద్ద ఆటో బోల్తా పడింది.మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కార్లయి గ్రామానికి చెందిన కూరగాయల వ్యాపారస్తులు నర్సంపేట నుండి కూరగాయలు తీసుకొని వస్తుండగా గాదె వాగు సమీపంలో కోతులు గమనించాయిఆ ప్రదేశంలో రోడ్డు సక్రమంగా లేకపోవడంతో ఆటోను కోతులు వెంబడించి చాయి వాటిని తప్పించుకొని వస్తుండగా మూలమలుపు వద్ద ఉన్న గుంతలో కి వెళ్లి ఆటో బోల్తా పడింది ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.