· బాధ్యతారాహిత్యానికి నిదర్శనమనుకోవాలా?
· ప్రజా సమస్యలపట్ల నిబద్ధత లేకపోవడమా?
· పార్టీకి రబ్బరుస్టాంప్గా మారుతున్న ఎమ్మెల్యేలు/ఎంపీలు!
· స్వతంత్ర అభిప్రాయాలు వ్యక్తం చేసే అవకాశం లేకపోవడం
· సీరియస్‌గా చర్చిద్దామని వస్తే గందరగోళంతో నైరాశ్యం
· వ్యక్తిగత పనులు, నియోజకవర్గ పనుల్లో బిజీగా వుండటం మరో కారణం
· హాజరు తగ్గడంతో, ముఖ్యమైన బిల్లులకు చర్చలు లేకుండానే ఆమోదం
· ఇది ద్రవ్య వినియోగంలో బాధ్యతారాహిత్యాన్ని పెంచుతుంది
· కేవలం అలవెన్స్లకోసమే సంతకాలు
· సభలో కూర్చున్నా మౌనమే
· ఇదీ ప్రజాప్రతినిధుల తీరు
హైదరాబాద్, నేటిధాత్రి:
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి “శాసనసభ్యు లంతా సమావేశాలకు హాజరు కావలసిందే. అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టి పోతున్నారు. ఎమ్మె ల్యే పదవికి అన్యాయం చేయొద్దు. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంది ఎందుకు?” అంటూ చేసిన వ్యాఖ్యలు ఎమ్మెల్యేల్లో నెలకొన్న బాధ్యతారాహిత్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. “నన్ను విమర్శిస్తున్న ప్పుడు, మమ్మల్ని కాదుకదా అన్న ధోరణి దగదు. అధికారం పోతే అందరికీ పోతుంది” అన్న వ్యాఖ్యలు కూడా కీలకం. “పొలిటికల్ కెరీర”ను “సిద్ధాంతం”గా మలచుకున్న ఎమ్మె ల్యేలకు ఈ మాటలు చురకల వంటివేనని చెప్పాలి. ఎందుకంటే “ముందు జాగ్రత్త చర్యగా” త మ రాజకీయ భవిష్యత్తుకు ఆటంకం కలగని రీతిలో స్పందించడం పరిపాటిగా మారింది. అంతే కాదు ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు కేవలం చట్టసభలకు వచ్చి సంతకాలు పెట్టిపోతున్నారంటే అందుకు ప్రధాన కారణం “అలవెన్స”లను వదులుకోలేకపోవడం కాగా, ఓట్లను డబ్బిచ్చి కొనుక్కు న్నామన్న ధీమా కూడా కావచ్చు. అంటే ఇక నియోజకవర్గానికి చేయాల్సిందేమీ లేదు. ఓటు కొనుక్కున్నాం కనుక మరేం బాధ్యతలేదన్న భావన కూడా కావచ్చన్న అభిప్రాయం నియోజకవర్గ ప్రజల్లో ఏర్పడుతుంది. ఈ ధోరణి ప్రమాదకరం! అంతేకాదు విపక్షాల విమర్శలను సహేతకు dమాధానాలతో ఎదుర్కొనే పద్దతులు పోయి, ఇప్పుడు ప్రత్యర్థులను మాట్లాడనీయకుండా చేయడం, నానా యాగీచేయడమన్న పంథా మొదలైంది. ఇది కూడా ప్రజాస్వామ్యంలో పెడధోరణి. విపక్షాలు కూడా గుడ్డిగా ఎడాపెడా ప్రతిదాన్నీ వ్యతిరేక ధోరణిలోనే ఆలోచించడం మానుకోవాలి. ప్రభుత్వం చేసే మంచిని అంగీకరించినప్పుడు మాత్రమే, వీరుచేసే విమర్శలను అధికారపక్షం తప్పకుండా స్వీకరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏది ఏమైనా అభివద్ధి విషయంలో అన్ని పక్షాలు ఏకం కావల సిందే! ఇందులో రాజకీయాలకు తావులేని రీతిలో వ్యవహరిస్తే రాష్ట్రం, దేశం మరింత వేగంగా ముందుకెళ్లగలవు.
నిజానికి ఇటు పార్లమెంట్‌కు, అసెంబ్లీల్లో శాసన కార్యకలాపాలకు గైర్హాజరు కావడం మనదేశంలో ఒక పునరావత కత్యంగా మారిపోయింది. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో చట్టసభలకు హాజరు కావడాన్ని ఒక పవిత్రకార్యంగా, తమ విధిగా భావించేవారు. కానీ ఇప్పుడా ట్రెండ్ మారిపో యింది. అర్థవంతమైన చర్చల కాలం ముగిసి, నాణ్యతలేని చర్చలు, పరస్పర దూషణల స్థాయికి సభా చర్చలు దిగజారిపోయాయి. విచిత్రమేమంటే ఉన్నత విద్యావంతులైన ఎమ్మెల్యేలు/ఎంపీల సంఖ్య పెరుగుతున్నకొద్దీ చర్చల నాణ్యత తగ్గిపోవడం మన ప్రజాస్వామ్యంలో నెలకొన్న విషాదం.పార్లమెంట్‌కు సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికిల్`101(4), శాసనసభలకు సంబంధించి ఆర్టికిల్`190 (4) ప్రకారం ఒక సభ్యుడు వరుసగా 60 రోజుల పాటు సభ సమావేశాలకు గైర్హాజ రైతే వారి స్థానాన్ని ఖాళీగా ప్రకటించవచ్చు. ఈ నియమం సభ సమావేశంలో వున్న కాలానికే వర్తిస్తుంది. ఒకవేళ సభ నాలుగు రోజులు అంతకంటే ఎక్కువ కాలం వాయిదా పడినా లేదా నిలిపివేతకు గురైనా ఈ లెక్కింపునకు మినహాయింపు వుంటుంది. రాజ్యాంగంలోని పదవ షెడ్యూలు ప్రకారం సాధారణ సమావేశం నాటి హాజరు కంటే, కీలక ఓటింగ్ సమయంలో హాజరునునిర్ధారించడానికి తరచుగా ఉపయోగించే పార్టీ విప్‌ను ధిక్కరించిన శాసనసభ్యుడిని అనర్హుడిగా ప్రకటించవచ్చు.
చాలామంది సభ్యులు చట్టసభలకు ఎందుకు గైర్హాజరవుతున్నారన్న ప్రశ్న సహజంగానే ఉదయి స్తుంది. క్షేత్రస్థాయి పనులు, పార్టీ కార్యకలాపాలు, వ్యక్తిగత వ్యవహారాలకు ప్రాధాన్యతనివ్వడమే ఇందుకు కారణమన్నది సమాధానం. దీన్ని నిరోధించేందుకు పార్టీ నాయకత్వం కొన్ని సార్లు కఠినమైన ఆదేశాలు జారీచేస్తుంటుంది. ఇప్పటి బడ్జెట్ సమావేశాలకు అందరూ హాజరు కావాలని తమ పార్టీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీచేయడం ఇందుకు తాజా ఉ దాహరణ. సభకు హాజరు కావడాన్ని బాధ్యతగా భావించే ఎమ్మెల్యేలకు ఇటువంటి ఆదేశాలు అవసరం లేదు. కానీ ఆవిధంగా చేయాల్సి వచ్చిందంటే ఎమ్మెల్యేల తీరు ఎంతటి అధ్వాన్నంగా వున్నదో అర్థం చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఎమ్మెల్యేలు, తమ విధినిర్వహణలో భాగంగా కా కుండా ఒక పథకం ప్రకారం హాజరవుతుంటారు. అధికార పక్షాన్ని లేదా బలంగా వున్న విపక్షాన్ని అడ్డుకొని నానా అల్లరి చేయడమనే ఎజెండా ఈ హాజరు వెనుక వుంటుంది. ఇది చివరకు ఎమ్మెల్యేల సస్పెన్షన్‌కు దారితీయవచ్చు. సాధారణంగా ఇటువంటి సస్పెన్షన్‌కు గురయ్యేది విపక్షఎమ్మెల్యేలే! ఇటీవల కర్ణాటకలో 18 మంది బీజేపీ సభ్యుల సస్పెన్షన్ ఇందుకు ఉదాహరణ.
గైర్హాజరు వల్ల కొన్ని కీలక చట్టాలు, బడ్జెట్ ప్రవేశపెట్టడం వంటి సందర్భాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా హాజరైన తక్కువమంది సభ్యుల్లోనే మెజారిటీ ఓటింగ్‌తో అటువంటి కీలకచట్టాలు తేలిగ్గా ఆమోదం పొందుతుండటం ఇప్పుడు మనం చూస్తూనే వున్నాయి. చట్టసభలు నిండుగా సభ్యులతో కళకళలాడుతున్నప్పడు, ఆమోదం పొందే చట్టాలకు ఆమోదయోగ్యత ఎక్కువన్నది సత్యం. సాంకేతికంగా హాజరైన సభ్యుల్లో మెజారిటీ ఆమోదం పొందితే సరిపోతుంది. కానీ నైతికంగా ఆలోచించినప్పడు తక్కువమంది సభ్యుల హాజరీ కంటే గరిష్ట సంఖ్యలో సభ్యుల హాజరీ వున్నప్పుడు ఆమోదం పొందిన చట్టాలకు బలం ఎక్కువ!
జాతీయ స్థాయిలో పరిశీలించినప్పుడు ఎంపీల సగటు హాజరు 79%గా వుంటోంది. ఇక్కడ గరిష్ట సంఖ్యలో ఎంపీలు హాజరవుతున్నారని సంతోషపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీరిలో చాలామంది మౌనంగా కాలం గడిపేస్తారు. ఏ చీకూ చింతా లేకుండా హాయిగా రోజువారీ అలవెన్స్ రూ.2వేలు పుచ్చుకొని వెళ్లిపోతుంటారు. అంటే సభ్యులు హాజరు కాకపోవడం ఒక సమస్య అయితే, హాజరైన సభ్యులు చురుగ్గా తమ నియోజకవర్గ సమస్యలు ప్రస్తావించకుండా నిశ్శబ్దంగా కూర్చొని వెళ్లిపోవడం మరో సమస్య! అత్యంత ప్రముఖులుగా పేరుపడ్డవారి హాజరు శాతం చాలా తక్కువ నమోదు కావడం గమనార్హం. ప్రముఖ బాలీవుడ్ నటి రేఖ 5%, ప్రముఖ క్రికెటర్సచిన్ టెండూల్కర్ 8% మాత్రమే సభకు హాజరయినట్టు నమోదైంది. విషయమేంటంటే సభ్యు లను పార్టీలు నియంత్రిస్తుండటం, కేవలం ఓటింగ్ విషయంలో రబ్బర్ స్టాంపులుగా వాడుకుం టుండటం వల్ల, స్వతంత్రంగా తమ భావాలు వ్యక్తం చేయలేకపోవడం కూడా సభ్యుల గైర్మాజరీకిఒక కారణంగా చెప్పవచ్చు. సమావేశం మొదలైన తర్వాత విపరీతమైన గందరగోళం, అరుపులు, కేకలతో సభలు మారుమ్రోగిపోవడంతో ఒక అంశంపై సీరియస్‌గా చర్చించాలనుకున్న సభ్యు ల్లో నైరాశ్యం కూడా ఈ గైర్హాజరీకి కారణాల్లో ఒకటి! తక్కువ హాజరు, ఎక్కువ గొడవ కారణంగా కొన్ని బిల్లులపై ఐదు నిముషాలు కూడా చర్చ జరగకుండానే ఆమోదం పొందుతున్నాయి. ఇది ఇటీవలి కాలంలో చాలా తరచుగా జరుగుతుండటాన్ని గమనిస్తున్నాం.
ఇక పార్లమెంట్, అసెంబ్లీల సమావేశ కాలం కూడా గణనీయంగా తగ్గుతూ రావడం గమనార్హం.స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లో అంటే 1950 ప్రాంతంలో పార్లమెంట్ 120 `140 రోజులు కొనసా గేది. ఇక వివిధ రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలను పరిశీలిస్తే ఏడాదికి 20‘28 రోజులకు మించి వుండటంలేదు. 2024లో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఏడాదిలో 16రోజులు మాత్రమే సభను నిర్వహించడం గమనార్హం. ఇక తెలంగాణ విషయానికి వస్తే 2019‘23 మ ధ్యకాలంలో ఏడాదికి కేవలం 15 రోజులు మాత్రమే సమావేశమైంది. 2017లో మాత్రం 37 రోజులు సమావేశమై రికార్డు సష్టించిందనే చెప్పాలి. అయితే అత్యధిక గంటల పాటు కూర్చొని చర్చించిన సంఘటనలు కూడా లేకపోలేదు. 2024 జూలైలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరిగినప్పుడు 17 గంటలపాటు 70% ఎమ్మెల్యేల హాజరుతో రాష్ట్ర అసెంబ్లీ నడిచింది. ఇదే కాలంలో ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీల్లో ఎమ్మెల్యేల హాజరు 83% నమోదు కావడం గమనార్హం. 2024‘25 సంవత్సరంలో పార్లమెంట్‌కు తెలంగాణ ఎంపీలు 83% హాజరు నమోదు చేశారు. ఇది జాతీయ సగటు 79% కంటే ఎక్కువ. డి.కె. అరుణ (88.23%), ఈటెల రాజేందర్ (91. 17%) హాజరు కావడం గమనార్హం. కేవలం 27% ఓటర్లు మాత్రమే పార్లమెంట్ పట్ల తమ విశ్వాసం వ్యక్తం చేయడానికి ఈ పరిణామాలే ప్రధాన కారణం. ఒకరోజు పార్లమెంట్ నిర్వహణ ఖర్చు రూ.2.5కోట్లకు పైగానే వుంటుంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఒకరోజు సభ నిర్వహణకు రూ.1.5 నుంచి రూ.2కోట్ల వరకు ఖర్చవుతుంది. ఇంతటి స్థాయిలో ప్రజాధనాన్ని వినియోగిస్తున్నప్పుడు సభ్యులు ఎంతో బాధ్యతగా వ్యవహరించాలి. దురదష్టవశాత్తు ఈ బాధ్యతే కొరవడింది. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభకు హాజరయినందుకు ప్రతిరోజూ రూ.1000 అలవెన్స్ రూపంలో ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇక సెక్యూరిటీ, విద్యుత్, ప్రత్యక్ష ప్రసారం, పాలనా సిబ్బంది…ఈ “ఆపరేషన్ ఒవర్హెడ్స” సభను 7‘8 గంటలపాటు ప్రామాణికంగా పనిచేయడానికి పనిచేస్తారు.
తెలంగాణ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి నెలకు రూ.2.5లక్షల వేతనం చెల్లిస్తున్నారు. ఇది దేశంలోనే అత్యధికం. వీటికి తోడు అసెంబ్లీ నిర్వహణ, లెజిస్లేటర్ల హాస్టల్ నిర్వహణ వ్యయం ఎట్లాగూ వుండనే వుంది. కీలకమైన బడ్జెట్ సమావేశాల వంటి సమయాల్లో కూడా సభలో తీవ్ర అంతరాయాలు చోటుచేసుకోవడం వల్ల దాదాపు రూ.2.84లక్షల కోట్ల బడ్జెట్ వంటి ముఖ్యమైన బిల్లులు ఏవిధమైన చర్చ లేకుండా నే తక్కువ సమయంలోనే సబ ఆమోదం పొందుతున్నాయి. ఇది దీర్ఘ కాలంలో ప్రభుత్వ ద్రవ్య నిర్వహణ సామర్థ్యం బలహీనపరుస్తుంది. అరుపులు, కేకలు, పరస్పర దూషణల వల్ల వార్షికంగా ఉచిత విద్యుత్‌కు చేస్తున్న ఖర్చు రూ.27వేల కోట్లు, పెండింగ్‌లో సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపైఅర్థవంతమైన చర్చ జరగదు. ఎంపీల హాజరుపై పార్ల మెంట్ రికార్డులు నిర్వహిస్తుంది కానీ తెలంగాణ ప్రభుత్వం ఎమ్మెల్యేల హాజరుకు సంబంధించిన గణాంకాలను పీఆరఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ వంటి వాటితో పంచుకోవడంలేదు. అందుకనే ఈ వివరాలు తెలియడంలేదు.
