Ugadi Poetry Meet on 18th
18న మరసం ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనం
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి )
https://youtu.be/NoviIp1TUK4?si=EohsYI-9HsxUTNf_
శ్రీ పరాభవ నామ ఉగాది పర్వదినం సందర్భంగా మానేరు రచయితల సంఘం ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం 4 గంటలకు కవి సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు మారసం అధ్యక్ష కార్యదర్శులు గంట్యాల భూమేష్, ఆడేపు లక్ష్మణ్ ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లా కేంద్ర గ్రంథాలయ భవనంలో సమావేశ మందిరంలో జరిగే ఈ కవి సమ్మేళనానికి మునిసిపల్ చైర్ పర్సన్ శ్రీమతి జిందం కళా చక్రపాణి గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల డిఎస్పి కత్రోజు నాగేంద్ర చారి,సుప్రసిద్ధకవి జూకంటి జగన్నాథం , తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు కొండి మల్లారెడ్డి , ప్రముఖ కథా రచయిత పెద్దింటి అశోక్ కుమార్ అతిథులుగా హాజరవుతున్నారు. ఎంపిక చేసిన కవులు తమ కవిత గానాలను వినిపించిన అనంతరం పాల్గొన్న ప్రతి కవికి మారసం పక్షాన ఉగాది సత్కారం ఏర్పాటు చేశామన్నారు సాహిత్య ప్రియులు కవిత ప్రేమికులు పెద్ద సంఖ్యలో హాజరై కవి సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని సంఘం కార్యనిర్వాహక అధ్యక్షురాలు డాక్టర్ కందేపి రాణి ప్రసాద్ కోరారు.
