నిజాలు నిర్భయంగా రాసే పత్రిక నేటిధాత్రి
నేటిధాత్రి క్యాలెండర్ ఆవిష్కరన
ఉమ్మడి వరంగల్ జిల్లా ఓడిసిఎంఎస్ చైర్మన్
గుగులోత్ రామ స్వామి నాయక్
నర్సంపేట మాజీ మార్కెట్ చైర్మన్
బత్తిని శ్రీనివాస్ గౌడ్
ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు
ఖానాపురం నేటిధాత్రి:ఉమ్మడి వరంగల్ జిల్లా ఓడిసిఎంఎస్ చైర్మన్ గూగులోతు రామస్వామి నాయక్ వారి కార్యాలయం వద్ద ఖానాపురం నేటిధాత్రి రిపోర్టర్ జనగం ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఓడిసిఎంఎస్ చైర్మన్ రామస్వామి నాయక్, ఎంపీపీ ప్రకాష్ రావు, నర్సంపేట మార్కెట్ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్,వారిచే ఆదివారం రోజు నేటిధాత్రి క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాలు నిర్భయంగా రాసే పత్రిక నేటిధాత్రి పత్రిక అని ఎప్పటికిప్పుడు నిజాలు నిర్భయంగా రాస్తూ ప్రజల సమస్యలలో ముందుంటుందని అన్నారు. సమాజంలో మార్పు కోసం నిరంతరం శ్రమిస్తూ ప్రజలకు అత్యంత రహస్య సమాచారాన్ని చేరవేస్తూ నిజమైన వార్తలను నిలువెత్తు రూపంగా నేటిధాత్రి పత్రిక అని,సమాజంలో మార్పు తీసుకువస్తూ అన్యాయం జరిగిన చోట ఆపద్బాంధవుడిలాగ ప్రజా సమస్యలను వెంటనే ఉన్నత అధికారులదృష్టికి తీసుకువస్తుంది నేటిధాత్రి పత్రిక అన్నారు. ఈ కార్యక్రమంలో యాదగిరి, వేములపల్లి వాసు, ఖానాపురం నేటిధాత్రి రిపోర్టర్ జగనం ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.