Computers and Furniture Donated to Desarajupalli School
దేశరాజుపల్లి పాఠశాలకు రూ.రెండు లక్షల విలువగల కంప్యూటర్స్, ఫర్నిచర్ అందజేత..
నేటిధాత్రి కమలాపూర్ (హనుమకొండ)
కమలాపూర్ మండలంలోని దేశరాజుపల్లి ప్రాథమిక పాఠశాలకు గ్రామానికి చెందిన ఈయుటి టెక్నాలజీస్ యాజమాన్యం రూ. రెండు లక్షల విలువగల కంప్యూటర్, ఫర్నిచర్ బీరువాలు అందించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మజ తెలిపారు. గ్రామానికి చెందిన ఆ సంస్థ నిర్వాహకులు కాందుర్ల బాబురావు ఆయన కుమారులు శివాజీ, అరుణజీలు వారు చిన్న నాడు చదువుకున్న పాఠశాల అభివృద్ధి కు గాను, విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండేందుకు కంప్యూటర్ తో పాటు బ్లూటూత్ స్పీకర్, మూడు బీరువాలు, నాలుగు టేబుల్స్ ఇతర ఫర్నిచర్ అందజేసినట్లు తెలిపారు. పాఠశాలకు తోడ్పాటును అందించిన కాందుర్ల బాబురావు వారి కుమారులను పాఠశాల అధ్యాపక బృందం గ్రామస్తులు అభినందించారు. ఈ సందర్భంగా బాబురావు ను సన్మానించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మిట్టపల్లి మహేశ్వరి,స్కూల్ కాంప్లెక్స్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వాణి,మాజీ ఎంపీటీసీ శైలజ,అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ అస్లాంబి,పాఠశాల అధ్యాపక బృందం రాజేందర్ రెడ్డి,అజిత్ కుమార్, ఐలేష్,విజయశ్రీ,మార్నింగ్ వీడియోస్ నటులు స్వాగత్, శంకర్,రత్నాకర్ మరియు వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.
