`గొప్పలు చెప్పుకున్నా.. గెలుపులు గుండు సున్నా?
`ఎన్నికల కోసం సవాళ్లు..అన్నింటా అపజయాలు?
`ఈ రెండేళ్ల కాలంలో లక్షల మంది బీఆరఎస్ లో చేరారు?
`కేటీఆర్, హరీష్ లు ఎక్కడికెళ్లినా చేరికల జాతరలు సాగిస్తున్నారు.
`ఇరామ్ లేకుండా వారంలో రొండుసార్లైనా తెలంగాణా భవన్లో వేలాది మందికి కండువాలు కప్పుతూనే వున్నారు.
`జిల్లాలలో ఎక్కడికెళ్లినా ఇదే కండువాలు కప్పని ప్రోగ్రామే ఉండడం లేదు!
`అధికారంలో వున్న పదేళ్లు ప్రతి చోట కప్పుకుంటూనే పోయారు.
`సభలు, సమావేశాలలో కండువాలు గొప్పగా కప్పుతున్నారు!
`ఎన్నికల సమయంలో కుప్పలు తెప్పలుగా పార్టీలో చేరుతున్నారు?
`బీఆరఎస్ లో చేరిన వాళ్లంతా ఎవరికి ఓట్లేస్తున్నారు?
`బీఆరఎస్ అభ్యర్థులు అంతటా ఎందుకు ఓడిపోతున్నారు?
`కండువాలు కప్పే ప్రచారమంతా తూతు మంత్రమేనా
`చేరికలన్నీ అబద్దమా? కప్పే కండువాలు కల్పితమా?
`ఎవరిని మోసం చేస్తున్నారు? మీకు మీరే మోసం చేసుకుంటున్నారు?
`తెలంగాణా లో ఐదేళ్ల క్రితమే 60 లక్షల మంది కార్యకర్తలు వున్నారని చెప్పారు?
`ఈ ఐదేళ్ల కాలంలో కొన్ని లక్షల మందికి కండువాలు కప్పారు?
`ఆ ఓట్లన్నీ ఎవరికి పోతున్నాయి? బి ఆర్ ఎస్ కు ఓటములే ఎందుకు మిగులుతున్నాయి?
`ఈ రెండేళ్లలో గర్వాంగా గెలిచామని చెప్పుకునే ఫలితాలు చూసారా?
`పార్లమెంట్ ఎన్నికల్లో అంత తిరస్కారం ఎందుకొచ్చింది అని సమీక్షించు కున్నారా?
`ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే దైర్యం చేశారా?
`పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలలో బొక్క బోర్లా మళ్ళీ పడ్డారా?
`అయినా పార్టీ లో అంతర్ మదనం జరుగుతోందా?
`నాయకులకు, కార్యకర్తలకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేసుకున్నారా?
`అసలు పార్టీ కార్యకర్తలకు గౌరవం ఉందా?
`రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి కమిటీలు ఉన్నాయా?
`పార్టీ లో అంతర్గత ప్రజాస్వామ్యం వుందా?
హైదరాబాద్, నేటిధాత్రి:
కొన్ని ప్రశ్నలకు సమధానం వుండదు అంటుంటారు. అంటే తప్పించుకోవాలనుకున్నప్ప్పుడో, తప్పించుకోలేని పరిస్దితుల్లో అందరూ చెప్పే ఏకైక సమాదానం ఇది. నిజానికి సమాదానం లేని ప్రశ్నలు ఈ ప్రపంచంలోనే వుండవు. వుంటే అవి ప్రశ్నలే కావు. బిఆరఎస్ రాజకీయాలు కూడా అలాగే వుంటున్నాయి. పార్టీ అభిమానులు కూడా జీర్ణించుకోలేనంత ఇబ్బందికరంగా వుంటున్నాయి. బిఆరఎస్ వరస ఓటములను ఎందుకు చవి చూస్తోందన్నదానిపై ఇప్పటికీ ఆ పార్టీలో ఎవరికీ క్లారిటీ లేదు. సమాదానం చెప్ప్పుకోవడానికి కూడా ఏమీ లేదు. అదికారంలో వున్నప్ప్పుడు ఏది చేసినా సాగుతుంది. ప్రతిపక్షంలో వున్నప్ప్పుడు కొట్లాడిందే ఎక్కడైనా లెక్కకొస్తుంది. ఈ విషయం బి ఆరఎస్ నాయకులకు ఒంట బట్టడంలేదు. ఎంత సేపు సులువుగా జనం ఆదరిస్తే బాగుండు అనుకుంటున్నారు. పైగా వచ్చేది మేమే అని కలలు కంటూ వున్నారు. అదికారంలోవున్నప్ప్పుడు అలాగే అనుకున్నారు. ఓడిపోయారు. ఇప్ప్పుడూ అలాగే అనుకుంటున్నారు ఓడిపోతున్నారు. కాని పోరాటం చేద్దామన్న సోయి లేదు. పోరాటం చేసి జనం మనసు చూరగొంటామన్న ముందడుగు లేదు. దేనికైనా కాలమే సమాదానం చెబుతుందనే దోరణిలో వెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మీద వున్న వ్యతిరేకతతో గెలుస్తామని అనుకుంటున్నారు. పోరాటం చేయడంలో బిఆరఎస్‌ను మించిన పార్టీ మరొకటి లేదంటారు. ఉద్యమాలు చేయడానికి మాత్రం ముందుకు రావడం లేదు. గతంలో అనేకం చేశాం..తెలంగాణ తెచ్చామని పదే పదే చెబుతుంటే ఈ తరం యువతరం వింటుందే గాని అయితే ఏంటి? అనే ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. అప్ప్పుడు బిఆరఎస్‌కు తెలంగాణ సమాజమంతా తోడుంది. అందుకే బిఆరఎస్ ఏది చేసినా అప్పటి పాలకులు భయపడ్డారు. ఇప్ప్పుడు స్వరాష్ట్రం. తెలంగాణ సమాజమంతా బిఆరఎస్ వెంట ఇప్ప్పుడు లేరు. వుంటే ఆ పార్టీకి గత ఎన్నికల్లో ఓటమే వుండేది కాదు. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యమ కాలం వేరు. స్వరాష్ట్రంలో పోరాటం వేరు. బిఆరఎస్ పోరాటానికి ప్రజలు తోడు రావాలని కోరుకోవడం తప్ప్పు కాదు. కాని ప్రజల కోసం కొట్లాడాలనుకున్నప్ప్పుడు ప్రజలను ఆకర్షించాలి. తెలంగాణ కోసం కొట్లాడినప్ప్పుడు కేసిఆర్ ఒక్కరే. ఇప్ప్పుడు కూడా బిఆరఎస్ ఒక్కటే అనుకొని ముందుకు సాగాలి. అంతే తప్ప జనం తోడు రావడం లేదంటే కుదరదు. బిఆరఎస్ మీద పోరాటం చేసిన కాంగ్రెస్ పార్టీకి కూడా ముందు అంతా శూన్యమే. పదేళ్లు కొట్లాడితే జనం ఆదరించారు. బిఆరఎస్ పాలన వద్దనకున్నారు. మార్పు కోరుకున్నారు. కాంగ్రెస్ మాటలు బలంగా నమ్మారు. అలా బిఆరఎస్‌ను మించిన నమ్మకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు కలిగించింది. ఇప్ప్పుడు సరిగ్గా బిఆరఎస్ కూడా అదే చేస్తే సరిపోతుంది. కాని ఏం చేస్తుంది. ఆరు గ్యారెంటీలు ఇచ్చి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, సిఎం. రేవంత్ రెడ్డి సర్కారు మొదలై రెండున్నరేళ్లు గడుస్తోంది. అయినా బిఆరఎస్ కదలడం లేదు. కాంగ్రెస్ పార్టీ అదికారంలోకి వచ్చిన వెంటనే ఆవేశపడ్డారు. అడ్డం పడ్డారు. ఇప్ప్పుడు ఎగిరేందుకు ఎదురు చూస్తున్నారు. ఇంకా కాలం కావాలన్నట్లు మాట్లాడుతున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ వరుసగా ఎన్నికల్లో గెలుస్తూ వస్తోంది. బిఆరఎస్ వరుస ఓటములను తన ఖాతాలో వేసుకుంటూనే వుంటుంది. పైగా పదే పదే ఎన్నికలకు సై అంటూ సవాళ్ల మీద సవాళ్లు చేస్తూ పోతోంది. అదేంటో పార్టీలో చేరికల మీద వున్న శ్రద్ద బిఆరఎస్‌కు పోరాటాల మీద లేకుండా పోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే కవిత చెబుతున్న మాట కూడా ఇదే. మాటలు కోటలు దాటిస్తున్నారు. కాళ్లు తంగెళ్లు దాటడం లేదన్న మాటలే సర్వత్రా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులను గడప దాటనీయకుండా ఎన్ని నిర్భందాలకు గురి చేసినా వారు తెగించి పోరాటాలు చేశారు. అబద్దాలు ప్రచారం చేశారో నిజం ప్రచారం చేశారో జనం విశ్వాసం చూరగొన్నారు. వారు చెప్పిన మాటలు జనం చేత నిజమని నమ్మించారు. బిఆరఎస్‌ను ఓడించారు. అబద్దాలు చెప్పి కాంగ్రెస్ గెలిచిందని చెప్పడానికి కూడా దైర్యం లేనట్లు, ఆరు గ్యారెంటీల మీద పోరాటం చేసే శక్తి లేనట్లు బిఆరఎస్నేతల వ్యవహారశైలియే జనం నమ్మకాలను చేరడం లేదు. కాని చేరికల సంuరాలు ఏ పార్టీకి లేనంతగా బిఆరఎస్‌లో నిత్య సంతర్పణంలాగా కార్యకర్తలు చేరుతూనే వుంటారు. అటు కేటిఆర్, ఇటు హరీష్‌రావు, ఇతర నాయకుల సమక్షంలో ఈ రెండేళ్ల కాలంలో మొత్తం మీద ýక్షలాది మంది కార్యకర్తలు చేరి వుంటారు. రెండేళ్ల కింద బిఆరఎస్ ఓడిపోయిన తర్వాత కొంత మందగనం కనిపించింది. సరిగ్గా పార్లమెంటు ఎన్నికల ముందు మళ్లీ పెద్దఎత్తున జోష్ కనిపించింది. ఎక్కడిక్కడ నాయకులు,కార్యకర్తలు చేరినట్లు కనిపించింది. పార్లమెంటు ఎన్నికల సమయంలో తెలంగాణ భవన్లో చేరికలతోటి నిత్యం సంబరాలే కనిపించాయి. కాని ఏమైంది. పార్లమెంటు ఎన్నికల్లో తుస్సు మంది. ఏకంగా కేసిఆర్ బస్సు యాత్ర పెట్టుకొని మరీ తిరిగారు. కాలు బాగాలేకున్నా ఊరూరు చుట్టివచ్చినంత పని చేశారు. రైతులను చైతన్యం చేశారు. నల్లగొండలో సభ నిర్వహించారు. పార్లమెంటు ఎన్నికల వేళ పొలాలు తిరిగారు. ఎండిన పొలాలను చూశారు. పాలకుర్తి కూడా కేసిఆర్ పొలాల పొంటి తిరిగారు. కేసిఆర్‌ను చూడడానికి వచ్చిన జనాన్ని చూసి మళ్లీ బిఆరఎస్ పుంజుకున్నది అనుకున్నారు. కాని ఓట్లు పడలేదు. సీట్లు రాలేదు. కొన్ని చోట్ల కనీసం డిపాజిట్లు రాలేదు. కారణం ఎవరికీ అర్దం కాలేదు. అంటే వచ్చిన వాళ్లంతా ఎవరు? నాయకులు తీసుకొచ్చిన వాళ్లనేది అర్దమైంది. ప్రజలను తెచ్చుకొని ప్రచారం చేసుకుంటే ఓట్లు పడవని అర్దమైంది. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలయ్యాయి. ఆ ఎన్నికలలో పోటీ చేసేందుకు కూడా జంకినంత పని చేశారు. పోటీ చేయడానికి కూడా ధైర్యం చేయలేదు. కేసిఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. అంటూ పులి వస్తుందని చెప్పారు. కాని ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇక తర్వాత చాల కాలం పాటు రాజకీయాలు లేకుండాపోయాయి. అయినా తెలంగాణ భవన్లో మాత్రం సందడి తగ్గలేదు. అప్ప్పుడుప్ప్పుడూ చేరికలు నిర్వహిస్తూనే వస్తున్నారు. ఏది ఆగినా చేరికలు ఆగలేదు. ఆ సంబరాలు ఆగలేదు. వేడుకలు చేసుకోకుండా ఊరుకోలేదు. ఇక జూబ్లీ హిల్స్ ఎన్నికల సమయంలో బిఆరఎస్ చేసిన హడావుడి అంతా ఇంత కాదు. మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ చనిపోయి మరునాటి నుంచే బిఆరఎస్ రాజకీయాలు మొదలుపెట్టింది. ప్రచారం ఆ సమయంలోనే చుట్టడం ప్రారంభించింది. సిట్టింగ్ సీటు మనదే అనుకున్నారు. బిఆరఎస్ ఊపుకు ఆ ఎన్నిక తోడ్పతుందనుకున్నారు. గోపీనాధ్ సతీమణిని కాలనీలన్నీ తిప్పారు. ఎక్కడికక్కడ సభలు ఏర్పాటు చేశారు. పెద్దఎత్తున చేరికలు చేశారు. కాస్తో కూస్తో పెద్ద నాయకులైతే తెలంగాణ భవన్లో చేరికలు చేపట్టారు. తీరా జూబ్లీ ఉప పోలింగ్ సమయం దగ్గరికొచ్చే సరికి బిఆరఎస్ చేసిన హడావుడి అ ంతా ఇంతా కాదు. ఇక గెలిచినట్లే అనుకున్నారు. కార్నర్ మీటింగ్‌లు అంటూ పెట్టిన సభలు అందర్నీ ఆశ్చర్యపర్చాయి. అంతకు ముందు గణేష్ నిమజ్జన సమయంలో ట్యాంక్ బండ్ మీద యువత చేసిన హంగామా చూసి బిఆరఎస్ నాయకులు మురిసిపోయారు. యువత కూడా బిఆరఎస్ వైపే నిలుస్తుందని సంబరపడ్డారు. దేఖ్లేంగే అంటూ పాడే పాటలను చూసి బిఆరఎస్ నాయకులు ఇక పాత రోజులు వచ్చినట్లే అని సంబరాలు చేసుకున్నారు. కాని ఏమైంది. జూబ్లీ కూడా బిఆరఎస్ కోల్పోయింది. అటు పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ఇటు వరుస ఓటములతో బిఆరఎస్ నానాటికి కుదేలౌతూ వస్తోంది. పంచాయతీ ఎన్నికలు పెట్టండి? పెట్టండి? అంటూ పదే పదే డిమాండ్ చేసిన బిఆరఎస్ నాయకులు ఒక్కసారిగా జూబ్లీ ఫలితంతో చల్లబడిపోయారు. తెలంగాణలో బిఆరఎస్ పుంజుకోలేదన్నది తేలిపోయింది. అంతకు ముందు నిజంగానే కాంగ్రెస్ పార్టీ స్ధానిక సంస్ధల ఎన్నికలకు వెళ్లాలంటే ఒకింత భయపడింది. జూబ్లీ గెలవడంతో బిఆరఎస్ మీద జనంలో ఇంకా కోపం వుందన్న సంగతి సిఎం. రేవంత్‌రెడ్డికి అర్ధమైంది. వెంటనే పంచాయితీ ఎన్నికలు నిర్వహించారు. మెజార్టీ స్ధానాలు కాంగ్రెస్ గెల్చుకున్నది. దాంతో సిఎం. రేవంత్ రెడ్డికి మరింత నమ్మకం ఏర్పడింది. ఆ వేడిలోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తే సరిపోతుందని అనుకున్నారు. పంచాయితీ ఎన్నికలతో కాంగ్రెస్‌లో జోష్ పెరిగింది. నాయకులకు పదవుల మీద ఆశ పెరిగింది. దాంతో విపరీతంగా పోటీ కూడా పెరిగింది. మున్సిపల్ ఎన్నిÅ£లు కూడా జరిగిపోయాయి. అయితే కాంగ్రెస్‌లో ఎక్కడా పెద్దగాచేరికలు లేవు. బిఆరఎస్తో పోల్చితే చేరికలు కాంగ్రెస్‌లోకి చాలా తక్కువ. కాని ఓట్లేమో కాంగ్రెస్‌కు పడుతున్నాయి. చేరికల మీద చేరికలు జరుగుతున్న బిఆరఎస్‌కు వరస ఓటములు పలకరిస్తున్నాయి?
