`ఎమ్మెల్యే స్థాయి నుంచి కౌన్సిలర్, ఎంపీటీసీ దాకా ఎగిరిపోవాలి.
`కొత్త రాజకీయం.. అభివృద్ధి మంత్రం!
`ఓట్లు కొనాలే.. గెలిస్తే అమ్ముడు పోవాలే!
`పార్టీలకే నైతిక విలువలు లేవు, మనమెంత అనుకోవాలె.
`గెలిచిన తెల్లారే పదవి కోసమో, పైసల కోసమో పార్టీ మారలే!
`గెలిచిన కండువా తీసేసి, అధికార పార్టీ కండువా కప్పుకోవాలె.
`పార్టీ పేరు మీద గెలిచినా అధికార పార్టీ కి దగ్గరగా ఉండాలే.
`పెట్టిన పెట్టుబడికి నాలుగింతలు సంపాదిచుకోవాలె!
`పార్టీలు ముఖ్యం అనుకుంటే అప్పులు తీరవు!
`పైసలు సంపాదించాలంటే పనులు దక్కవు!
`రాజకీయంగా ఇబ్బందులు రావొద్దనుకుంటే అధికార పార్టీ దోస్తీ కావాలే!
`మళ్ళీ ఎలక్షన్ లకు సొమ్ములు కావాలే.
`ఓడిపోయియినా అప్పుల పాలు కాకుండా ఉండాలే.
`దీపమున్నప్పుడే ఇల్లు సక్కబెట్టుకోవాలె!
`ఒక్కసారి గెలిచినా మూడు తరాలకు సరిపడ సంపాదించాలి.
`పైసలుంటే ఏ పార్టీలో నైనా చేరొచ్చు.. రాజకీయం చేయొచ్చు.
హైదరాబాద్, నేటిధాత్రి: రాను రాను రాజకీయాలలో తీరు మారుతోంది. నాయకుల్లో అవకాశ వాదాలు పెగుతున్నాయి. ఏ నాయకుడు ఎప్ప్పుడు ఏ పార్టీలో వుంటాడో అన్నది ఎవరూ చెప్పలేని రోజులొచ్చాయి. ఎన్నికల వరకు ప్రత్యర్ధులు. తర్వాత ఏ పార్టీతో సంబంధాలు కలుపుకుంటారో అర్దం కాని పరిస్తితులు. ఇదేకొత్త రాజకీయం. నాయకులు చెప్పే అభివద్ది మంత్రం. ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయడం కోసమంటూ మాటలు చెప్పడం అలవాటు చేసుకున్నారు. ఎన్నికల ముందు పార్టీలు మారితే రాళ్లతో కొట్టండని పిలుపునిస్తారు. ఎన్నికల తర్వాత అదే నాయకులు పార్టీ పిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. ఎక్కడికి పోతుంది సమాజం అని ఎవరూ అడగొద్దు. ఎన్నికల దాకానే మనకు వంగి వంగి దండాలు. పార్టీలను నమ్మిన జనం పిచ్చోళ్లు? అని నాయకులు నవ్వుకుంటారు. అయినా జనం మారరు. నాయకులు మారరు. ఎందుకంటే ఎన్నికలొచ్చినప్ప్పుడు ఓట్లు కొనాలి. అదష్టం బాగుండి గెలిస్తే అధికార పార్టీలోకి వెళ్లిపోవాలి. రాజకీయ పార్టీలకే సిద్దాంతాలు లేవు. నైతిక విలువలు అసలే లేవు. అలాంటప్ప్పుడు నాయకులు వుండాలని కూడా అనుకోవడం సరైంది కాదేమో? నాయకులు పార్టీలకు బానిసలు కాదు. పల్లకి మోసే బోయిలు కాదు. గెలిచిన తర్వాత వారి ఇష్టం. మనస్సాక్షి చెప్పినట్లు నడుచుకోవడం అని సర్ధిచెప్ప్పుకోవడం. అంతే.. గెలిచిన మరునాడే పార్టీ మారాలే. నిధుల కోసమో, పదవులకోసమో, కాంట్రాక్టుల కోసమో, ఆఖరుకు పెట్టిన పెట్టుబడి రాబడి కోసమో పార్టీ మారాలే? అంతే!! ఇదే రివాజు ఇప్ప్పుడు. గెలిచిన కండువా వెంటనే తీసెయ్యాలి. అదికార పార్టీ Å£ండువా కప్ప్పుకోవాలి. ఏ పార్టీ మీద గెలిచిన సరే అధికార పార్టీకి మాత్రమే దగ్గరుండాలి. సొంత పార్టీకి దూరమవ్వాలి. అది ఎమ్మెల్యే అయినా, జడ్పీటిసి, ఎంపిటిసి, కౌన్సిలర్ ఎవరైనా సరే పార్టీ మారితేనే ఇప్ప్పుడు పరపతి. మీడియాలో కూడా నిత్యం కనపడేది. వార్తల్లో వుండేది. జనం మర్చిపోకుండా వుండే రాజకీయ స్టాటజీ. కొత్తగా వున్నా, అది వింతగా వున్నా ఇదే నయా రాజకీయం. నిత్యనూతనం. జనం నోళ్లలో నానే నాయకత్వం. ప్రతిపక్ష పార్టీలో నోరు తెరవకుండా వుండడంకన్నా, అదికార పార్టీలో చేరి నోరు మూసుకున్నా మీడియా వచ్చి మాట్లాడిస్తుంది. పుణ్యానికి ప్రచారం దక్కుతుంది. పార్టీలే ముఖ్యమనుకుంటే ఎన్నికల్లో పోటీ చేసేందుకు పెట్టిన పెట్టుబడి రాదు. అప్ప్పులు తీరవు. ఎన్నికల కోసం, రాజకీయం కోసం, జనం సేవ కోసం ఇంత కాలం పెట్టిన ఖర్చులు చేతికి రావాలే. గెలిచేదాకా ఖర్చు పెట్టి, గెలిచినంక ఖర్చు చేయాలంటే మళ్లీ డబ్బులు కావాలి. అందుకే అదికార పార్టీ వైపు చూడాలి. ఒక వేళ మళ్లీ ఎన్నికల్లో అవకాశం వస్తుందో రాదో? ఒక వేళ వచ్చినా మళ్లీ నిలబడాలన్నా, గెలవాలన్నా సొమ్ములు కావాలి. దీపమున్నప్ప్పుడు ఇల్లు చక్కదిద్దుకోవాలి. ఎమ్మెల్యే స్దాయి అయితే ఒక్కసారి గెలిస్తే చాలు మూడు తరాలకు సరిపడా సంపాదించాలే. ఎమ్మెల్యే అయి కూడా ఏమీ లేదంటే కూడా నామూషీగా చూసే రోజులు. నిజాయితీ పరుడు అని పేరు ఈ రోజుల్లో సరిపోదు. ఇంటికి వచ్చిన కార్యకర్తలకు Å£డుపు నిండా బువ్వ పెట్టాలే. ఏదైనా ఆపదుందంటే నాలుగు పైసలు జేబుల పెట్టాలే? లేకుంటే కార్యకర్తలు గోడ చాటు నుంచి తిట్టే తిట్లు వినకుంటూ చెవులు మూసుకోవాలే. దానికన్నా పార్టీ మారితే చాలు. పైసలుంటే ఏ పార్టీలోనైనా చేరొచ్చు. పదవి పరపతి పొందొచ్చు. నలుగురు అనుచరులను ఎప్ప్పుడూ వెంట తిప్ప్పుకోవచ్చు. అందుకే కౌన్సిలర్ అయినా సరే అవకాశమొస్తే పార్టీలు వెంటనే మారాలే..ఇదే రాజకీయ ట్రెండ్.. మున్సిపల్ చైర్మన్ల ఎంపికలు పార్టీల కలయికలు చూస్తే స్పష్టంగా అర్దమౌతోంది. నిన్నటి దాకా రాజకీయం రణ కేత్రంలో బద్ద శుత్రవులుగా కొట్లాడుకున్నా సరే పదవుల కోసం కలిసి పోవాలే. కలిసిపోవాలి. Å£డుపులో కత్తులు వున్నా, కౌగిలించుకోవాలే. కలిసిపోవాలే. పదవులంటేనే ఆత్మీయతలు. ఎన్నికలయ్యే దాకా ఎత్తులు పై ఎత్తులు ఎన్ని వేసుకున్నా సరే, పదవుల కోసం ఒకరి ఒకరు తోడు నీడలు కావాలే. పదవులు పంచుకోవాలే. ఎన్నికల ముందు ఎన్ని మాట్లాడుకున్నా అన్నీ పూరామాఫ్ అనుకోవాలే. ఫైటింగ్లో శత్రువులు కాని, పదవులకు అందరూ స్నేహితులే అనే రాజకీయాలు నేర్చుకోవాలి. పదవుల పందేరంలో పార్టీల కోపతాపాలన్నీ పక్కపెట్టాలే. అంతే పదవులొస్తే అదే పదివేలు అనుకోవాలే. దిజగారిన రాజకీయాలకు పరాకాష్ట అని జనం అనుకుంటే నవ్వుకున్నా పట్టించుకోవద్దు. జనం నమ్మకాలతో పుంజీతమాటలాడుకోవాలే. లేకుంటే రాజకీయాలు చేయలేరు. జనం మధ్యలో వుండలేరు. అన్ని ఎన్నికల ముందు బిఆరఎస్ బిజేపి ఒక్కటే అని కాంగ్రెస్ విమర్శలు విన్నాం. కాని ఇప్ప్పుడు ఏ పార్టీ ఏ పార్టీకి మద్దతు అనేది ఆలోచించకూడదు. కాంగ్రెస్ బిజేపి ఒక్కటే అంటూ బిఆరఎస్ అనేకసార్లు ప్రచారాలు చేసుకున్నారు. ఇప్ప్పుడు ఎవరికి ఎవరు మిత్రులో అర్ధం కాకుండా చేసుకుంటున్నారు. అలియాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్కు బిజేపి మద్దతిచ్చింది. మున్సిపల్లో కలిసిపోయింది. కాంగ్రెస్, బిఆరఎస్ ఒక్క తాను ముక్కలే అని బిజేపి అనేక మార్లు ప్రచారాలు. మున్సిపలఎన్నికల ముందు బీరాలు పలికిన నాయకులు. పదవుల విషయానికి వచ్చే సరికి అక్రమ కలయికలు. పదవులు వస్తే చాలు మేము మేమంతా ఒ క్కటే. జనాలను పిచ్చోళ్లను చేయడమే రాజకీయమంటే. రాజకీయాలంటే సామాన్యులకు అర్ధం కావని మరోసారి తెలంగాణలో రాజకీయ పార్టీలు నిరూపించాయి. మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఫలితాలు వచ్చాయి. చాల వరకు మెజార్టీ చైర్మన్ స్దానాలు కాంగ్రెస్ గెల్చుకున్నది. అయితే కొన్ని చోట్ల హంగ్ పలితాలు కనిపించాయి. వాటిని కైవసం చేసుకోవడం కోసం పార్టీలు తమ సిద్దాంతాలు పక్కన పెట్టేశాయి. నీతి మాలిన రాజకీయాలకు తెరతీశాయి. అందులో ఈ పార్టీ, ఆ పార్టీ అనే తేడా లేదు. అన్ని పార్టీలు ఇందుకు మినహాయింపు కాదు. లేదని మరోసారి రుజువు చేశాయి. ఇంత కన్నా దిగజారుడు తనం వుంటుందా? అని ఎవరూ అనుకోవద్దు. ప్రజలు ఇచ్చిన తీర్పుకు రాజకీయ నిర్ణయాలు ఇలాగే వుంటాయని నాయకులు అనుకున్నారు. ఇంతకు మించి ఏమీ చేయలేక ఇలా చేయకతప్పడం లేదని మద్దతు పలుకుతున్నాయి. వీలైన చోట్ల గెలిచిన కౌన్సిలర్లను,కార్పోరేటర్లను లాగేసుకున్నారు. వీలు కాని చోట పరస్పరం సహకరించుకున్నారు. ఫలితాలు వెలువడిన నుంచి ఈ అక్రమ రాజకీయాలు మొదలు పెట్టారు. ఖమ్మం జిల్లాలో ఓ మున్సిపాలిటీలో కమ్యూనిస్టులు మెజార్టీ స్దానాలు గెల్చుకున్నారు. అక్కడ తామే చైర్మన్ గిరి ఏలుతామని సిపిఐ చెప్పింది. కాని కాంగ్రెస్ ససేమిరా అని చెప్పింది. ఇ ంతలో బిఆరఎస్ రంగంలోకి దిగింది. మేము మద్దతిస్తామని చెప్పింది. అందుకు సిపిఐ కూడా సరే అన్నది. కాని రాత్రికి రాత్రే మళ్లీ సమీకరణాలు మారిపోయాయి. నిన్నటి దాకా మాతో పొత్తులో వుండి, ఇప్ప్పుడు బిఆరఎస్ మద్దతు తీసుకోవడం సరైంది కాదని కాంగ్రెస్ ఒక అడుగు వెనక్కి వేసింది. చెరి సగం చైర్మన్ పీఠం అని బేరం పెట్టింది. రెండున్నరేళ్లపాటు ఒకరు, మరో రెండున్నరేళ్లపాటు ఇంకొకరు అని ఒప్పందానికి వచ్చాయి. మధ్యలో దూరిన బిఆరఎస్కు చేదు అనుభవం ఎదురైంది. గత ఎన్నికల్లో బిఆరఎస్ ఓటమిలో ప్రధాన బాగస్వామిగా వున్న కమ్యూనిస్టులతో పొత్తుకు వెళ్లడం బిఆరఎస్ దిగజారుడు తనానికి నిదర్శనం. దాన్ని అదిగమించి కాంగ్రెస్ పన్నిన వ్యూహం బిఆరఎస్కు దిమ్మతిరిగేలా చేసింది. ఇదేం రాజకీయమని అనుకునేలో లోపు చైర్మన్ల ఎన్నికల్లో అన్ని పార్టీలు ఒక్కటయ్యాయి. ఏ పార్టీ ఏ పార్టీకి మద్దతు పలుకుతున్నాయో అర్దం కాని అయోమయ పరిస్దితులు వచ్చి చేరాయి. కొన్ని చోట్ల బిఆరఎస్ బిజేపి మద్దతు పలికింది. కొన్ని చోట్ల బిజేపికి కాంగ్రెస్ మద్దతు తెలిపింది. అసలు కాంగ్రెస్ , బిజేపిలు మద్దతు తెలుపుకోవడం విచిత్రం. ఇది బిజేపి నాయకులు ఎలా జీర్ణించుకుంటున్నరన్నది పెద్ద ప్రశ్న. రాజకీయంగా దేశ వ్యాప్తంగా బద్ద శత్రువులు. ఓ వైపు దేశమంతా కాంగ్రెస్ను తూడ్చేసిన బిజేపితో పొత్తు పెట్టుకొని చైర్మన్ పదవుల ఎంపికలో లాలూచి పడే పరిస్దితి ఎందుకొచ్చింది. పార్టీ వర్గాలు ఏం చేస్తున్నాయి. ఎందుకు స్పందించకుండా వున్నాయి. బిఆరఎస్ పార్టీని నిత్యం తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్లే ఎంపి రఘునందన్ రావు బిఆరఎస్కు మద్దతు పలికినట్లు వార్తలు రావడం విచిత్రంగా వుంది. ఎక్స్ అఫీషియో సభ్యులుగా తమ ఇష్టాను సారం ఓటింగ్ వేయొచ్చని పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? కాంగ్రెస్, బిజేపి కలిసి బిఆరఎస్ను పూర్తిగా తుడిచి వేయాలని పదే పదే ప్రకటనలు చేసే కరీంనగర్ ఎంపి. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మేయర్ పీఠంకోసం పరోక్షంగా బిఆరఎస్ మద్దతు తీసుకున్నారు? ఇదెక్కడి రాజకీయం?
