Village Secretary Offers Prayers at Ketaki Temple on Maha Shivaratri
మహాశివరాత్రి సందర్భంగా కేతకిని దర్శించుకున్న గ్రామ కార్యదర్శి
జహీరాబాద్ నేతి ధాత్రి:
మహా శివరాత్రి సందర్భంగా, ఝరాసంగం గ్రామ పంచాయతీ కార్యదర్శి వీరన్న పటేల్, తన బంధువులు, స్నేహితులు కార్యదర్శులతో కలిసి, సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని ప్రసిద్ధ చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామిని అధికారులతో కలిసి దర్శించుకున్నారు. ఈ పవిత్ర స్థలంలోని జలాశయాల అమృత గుండంలో వారు స్నానాలు చేసి, స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మహా శివరాత్రికి భక్తులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో వచ్చినప్పటికీ, వివిధ గ్రామాల కార్యదర్శులు ప్రత్యేక విధుల్లో పాల్గొని, గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికుల సహాయంతో ఆలయ ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచడంలో, జాతర పరిసరాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవడంలో, సంగమేశ్వర స్వామి ఆలయం అమృత గుండం పరిశుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషించారు.
