”నేటిధాత్రి” కథనానానికి కదిలిన కేంద్రం!
”ఈడి” రంగంలోకి దిగింది మిల్లర్ల ఇళ్లపై మెరుపు దాడి మొదలైంది.

”నేటిధాత్రి” కథనాలతో “ఈడి” రంగంలోకి దిగుతుందని మిల్లర్లు ఊహించలేదు.
రాష్ట్ర ప్రభుత్వాన్ని, పాలక పెద్దలను నమ్ముకొని తప్పించుకోవాలనుకున్న మిల్లర్లు?

వడ్లు తీసుకున్నారు.. బియ్యం అమ్ముకున్నారు.
`లెక్కలు చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్నారు.

`ఆస్తులు సంపాదించుంటూ ప్రభుత్వాన్ని మోసం చేస్తూ వస్తున్నారు.
`అన్నింటిపై “నేటిధాత్రి” దృష్టి పెట్టింది?
జరుగుతున్న మోసాలన్నిటి లెక్కలు తెల్చాలని కేంద్రాన్ని “నేటిధాత్రి” కోరింది.
`“జిఎం వుండగా దిగులెందుకు దండగ” అనే “నేటిధాత్రి” కథనానికి స్పందన.
”నేటిధాత్రి” కథనానికి శీగ్రంగా కదిలిన కేంద్రం..చక చక రంగంలో కి దిగిన “ఈడి”.
మిలర్ల అక్రమాలపై పదేళ్లకు పైగా “నేటిధాత్రి” అనేక కథనాలు!
`సమయం వచ్చింది…లెక్కలు తేలే తరుణం ఆసన్నమైంది.
`దశాబ్ద కాలంగా జరుగుతున్న మోసాలు వెలుగులోకి రానున్నాయి.
`మిలర్లపై జులిపిస్తున్న “ఈడి” కొరడా?
`“ఈడి” దిగింది.. లెక్క తేల్చనుంది!
`అక్రమ మిల్లర్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
`తప్పించుకోలేనంత ఇరుక్కున్నారు?
”నేటిధాత్రి” మొదటినుంచి హెచ్చరిస్తూనే వుంది?
`పదేళ్లకు పైగా అప్పనంగా ప్రభుత్వాన్ని మోసం చేస్తూ వచ్చారు?
`ప్రభుత్వం ఉదసీనత ను అలుసుగా చేసుకున్నారు.
`బియ్యం పెట్టాల్సి రావడంతో వక్ర మార్గం ఆలోచించారు.
అమ్ముకున్న బియ్యానికి వచ్చే పంటలో లెక్క చూపిస్తామన్నారు.
`ఇక్కడే అసలు దొంగలు దొరికిపోయారు.
`“ఈడి” దాడుల దాకా తెచ్చుకున్నారు.
`ఇంత కాలపు పాపానికి ఇప్పుడు ఇరుక్కున్నారు.
`“ఈడి” రంగంలోకి దిగుతుందని ఊహించలేదు.
`“నేటిధాత్రి” ఎన్ని సార్లు చెప్పినా చెవికెక్కించు కోలేదు.
హైదరాబాద్, నేటిధాత్రి:
ఎంతటి దూర ప్రయాణమైనా ఒక అడుగుతోనే మొదలుకావాలి. ఎంత పెద్ద గ్రందమైనా ఒక్క అక్షరంతోనే మొదలు పెట్టాలి. అలా మీడియా రంగంలో అలుపెరగని ప్రయాణంతోపాటు, అనేక వార్తలకు కేరాఫ్‌గా నేటిధాత్రి నిలిచింది. అనేక వార్తలను రాసింది. అనేక విజయాలను చూసింది. అనేక సమస్యల పరిష్కారంలో కీలక భూమిక పోషించింది. అనేక చిక్కుముడులను చేదించింది. ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చింది. ప్రజా సమస్యలపై అలుపెరగని అక్షర పోరాటం చేసింది. మోదం.. ఖేదం రెండింటినీ సమానంగా తీసుకుంటూ, ప్రజల కోసం, నవ నిర్మాణం కోసం, తెలంగాణ ప్రగతి కోసం పాటు పాటుపడుతోంది. అనేకరకాలైన అక్రమాలను వెలుగులోకి తెచ్చింది. అవినీతిని చీల్చి చెండాడింది. ఆ విజయ పరంపరలో ఇప్ప్పుడు మరో మైలు రాయిలాంటి విజయాన్ని ప్రజలకు అందించింది. నేటిధాత్రి విజయం అంటే అది ప్రజల విజయం. తెలంగాణ ఏర్పడిన తర్వాత సివిల్ సప్లయ్ శాఖలో విపరీతమైన అవినీతి చోటు చేసుకున్నది. ముఖ్యంగా తెలంగాణలో బాయిల్డ్ రైస్ మిల్లర్లు చేసే అక్రమాలు, అవినీతిని నేటిధాత్రి ఎప్పటికప్ప్పుడు ఎండగడుతూనే వుంది. అందులో భాగంగా ఇటీవల ఓ సంచలనమైన వార్తను నేటిదాత్రి ప్రచురించింది. పదేళ్లు కొంత మంది బాయిల్డ్ రైస్ మిల్లర్లు బియ్యం బొక్కుతున్నారు. రైతుల నుంచి సేకరించిన వడ్లను మింగుతున్నారు. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం పక్కదారి పట్టిస్తున్నారు. ప్రభుత్వం కళ్లు గప్పి అమ్ముకుంటున్నారు. సివిల్ సప్లై శాఖ అధికారులను మేనేజ్ చేసుకుంటూ వేలాది కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఎగవేశారు. వాటిని నేటిదాత్రి వెలుగులోకి తెచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, కేంద్రం నుంచి కూడా ఒత్తిడి మొదలైంది. నేటిధాత్రి కథనం డిల్లీలో ప్రకంపనలు సష్టించింది. కేంద్రం అడిగినట్లుగా రా రైస్ పెట్టకుండా, బాయిల్డ్ రైస్ ఇస్తామని మభ్య పెట్టే కుతంత్రం ఒకటి నేటిదాత్రి వెలుగులోకి తెచ్చింది. అందుకు సంబంధించి తెరవెనÅ£ జరగబోయే బాగోతాన్ని మొత్తం పిన్టుపిన్ రాసింది. అంతే తెలంగాణ పారాబాయిల్డ్ రైస్ మిల్లర్ల పరిస్ధితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. పుడ్ కార్పోరేష్ ఆప్ ఇండియా మేనేజర్‌తో సంప్రదింపులు, ఒప్పందాలు, చెల్లింపుల విషయాన్ని నేటిధాత్రి పూస గుచ్చినట్లు రాసింది. అంతే ఒక్కసారి ఉలిక్కిపడిన ఎఫ్‌సిఐ మేనేజర్ చేతులెత్తేశారు. దాంతో దారి లేకుండాపోయిన మిల్లర్లు కొత్త ఎత్తుగడ వేయకముందే కేంద్రం రంగంలోకి దిగింది. ఈడీ రాష్ట్రానికి వచ్చింది. ప్రభుత్వాన్ని మోసం చేసిన మిల్లర్ల భరతం పట్టేందుకు రంగంలోకి దిగింది. ఒక్కసారిగా మిల్లర్లలో కలకలం రేగింది. ఇంత దూరం వస్తుందని మిల్లర్లు కలలో కూడా అనుకోలేదు. గతంలో ఎప్ప్పుడూ ఇలాంటి పరిస్దితి ఎదుర్కొలేదు. గత పదేళ్లు కూడా ఈడీదాకా సమస్య పోలేదు. మొదటిసారి నేటిధాత్రి మూలంగా మొత్తం వ్యవహారం కేంద్రానికి చేరింది. దాంతో ఈడి కదిలింది. యంత్రాంగం అంతా తెలంగాణకు చేరింది. అక్రమ మిల్లర్ల కుటుంబాలు, వారి బందువుల ఇళ్లలో సోదాలు ఏక కాలంలో మొదలు పెట్టింది. నిజాయితీ రైతుల నుంచి తీసుకున్న వడ్లను బియ్యం చేసి ప్రభుత్వానికి అందించాల్సింది పోయి, మోసం చేస్తూ వచ్చారు. ఇప్ప్పుడు పాపం పండింది. మొదటికి వచ్చింది. ఈడీ దాడుల దాకా వచ్చింది. ఇంత దూరం వస్తుందని అనుకోలేదు. కాని పరిస్దితులు ఎప్ప్పుడూ ఒకేలాగా వుంటాయన్న భ్రమలో ఇంత కాలం మిల్లర్లు చెలరేగిపోయారు. సమారు 15లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మింగేశారు. అత్త సొమ్మే కదా అమ్ముకుంటే ఏమౌతుందనుకున్నట్లు , ప్రభుత్వ బియ్యాన్ని అమ్ముకున్నారు. మెడ మీద కత్తి వాలేసరికి ఎఫ్‌సిఐ మేనేజర్‌తో జరిపిన సంప్రదింపులపై నేటిధాత్రి కథనం రాసింది. దాంతో ప్లాన్ ఏ ఆగిపోయింది. తప్ప్పు చేయాలనుకున్న వారు అదును కోసం ఎలాగైనా ఎదురుచూస్తారు. వారికి తప్ప్పు చేయకుండా మార్గం లేదు. అంటే తప్ప్పు మీద తప్ప్పు చేశారు. దాన్ని సరిదిద్దుకోవాలంటే కూడా మరో తప్ప్పునే ఎంచుకుంటున్నారు. నిజానికి నిజాయితీగా కూడ తాము తప్ప్పు చేశామని ప్రబుత్వానికి చెప్పొచ్చు. గతంలో తప్ప్పు జరిగింది. సరిదిద్దుకునే అవకాశమివ్వండని ప్రభుత్వాన్ని అర్దిస్తే బాగుండేది. ఎందుకంటే ప్రభుత్వాన్ని తాము శాసించే స్దాయిలో వుండాలనుకోవడం మిల్లర్ల నైజం. మిల్లర్లంతా కలిసి సమ్మెకు దిగితే ప్రభుత్వమే దిగిరావాలనుకునే రకం. అందవల్ల ప్రబుత్వాన్ని కాదని, ఎఫ్‌సిఐ అదికారితో రాయభారం నడిపేందుకు అంతా సిద్దం చేసుకున్నారు. ఒప్పందాలు కుదుర్చుకున్నారు. నేటి దాత్రి మూలంగా ఫ్లాన్ ఎదురు తన్నింది. అప్ప్పుడైనా మారుతారా? అంటే మారలేదు. అదే అదికారి మరో సలహా ఇస్తూ ప్లాన్ బి వేసినట్లు నేటిదాత్రికి సమాచారమందింది. అంతే ఇక మళ్లీ నేటిధాత్రి మరో కథనం రాసింది. ప్లాన్ ఏ ఫైయిల్ అయితే, ప్లాన్ బి అనే శీర్షికతో ఆ కథనం వచ్చింది. ఇక లాభం లేదనుకున్న పుడ్ కార్పోరేషన్ చైర్మన్ పూర్తిగా చేతులెత్తేశారు. ప్లాన్ బి అనేది మరీ చిత్రం. ప్రపంచంలో అలాంటి విచిత్రం మరొకటి వుండదు. తెలంగాణ బాయిల్డ్ అక్రమ మిల్లర్ల వద్ద ప్రస్తుతం ఒక్క వడ్ల గింజ లేదు. ఒక్క బియ్యపు గింజ కూడా లేదు. కాని ప్రభుత్వం గతంలో కేంద్రానికి రాసిన ఉత్తరాన్ని పట్టుకొన్ని మళ్లీ కేంద్ర మంత్రితో మంతనాలు జరపాలని అనుకున్నారు. అయినా ఆ ఉత్తరం ఇప్ప్పుడు రాసింది కూడా కాదు. గతంలో ఎప్ప్పుడో తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాసింది. తాము ఈసారి ఈ పదిహేను లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ పెట్టేందుకు అంగీకరించండి. భవిష్యత్తులో ఇక ఎప్ప్పుడూ ఇలా మరోసారి కోరము. ఇప్పటికైనా ఒక్కసారి అనుమతించండి. అని ఆ ఉత్తరం సారాంశం. అంటే మిల్లుల్లో ఒక్క వడ్ల గింజ లేకపోయినా, మళ్లీ ప్రభుత్వాన్ని మోసం చేసేందుకు అప్పటి ఉత్తరం పట్టుకొని వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే అందుకు కూడా కొంత సమయం కావాలని కోరి, కేంద్రం అనుమతి తెచ్చుకోవాలని ఎత్తుగడ వేశారు. ఇక్కడే అసలు పాయింట్‌ను నేటిదాత్రి పట్టుకున్నది. ఈ మిల్లర్ల దగ్గర ఒక్క గింజ లేకున్నా ఎలా ఇస్తుందనేదానిని పూసగుచ్చినట్లు వార్త రాసింది. రేపు రాబోయే సీజన్లో రైతులనుంచి వడ్లు సేకరించి, వాటిని బియ్యంగా మార్చి పుడ్ కార్పోరేషన్‌కు ఇస్తారట. అప్పటి వరకు సమయం కావాలట! అసలు విషయాన్ని వెలుగులోకి తేవడంతో మిల్లర్ల గుట్టు బైట పడింది. కేంద్రం సీరియస్ అయ్యింది. లేని బియ్యం కోసం వచ్చే సీజన్ వరకు గడువు ఇచ్చి, అప్ప్పుడు బియ్యం ఇచ్చేదాక గడవు ఇవ్వడం అంటే మళ్లీ మోసం చేయడానికి కేంద్రం కూడా అనుమతిచ్చినట్లౌవుంది. నేటిధాత్రి వార్త రాయకపోతే కేంద్ర పెద్దలు కూడా అంత దూరం ఆలోచించేవారుకాదు. నేటి ధాత్రి ప్రతి విషయాన్ని, మిల్లుర్లు వేసిన ప్రతి అడుగును కల్లకుల్లం చెప్పడం జరిగింది. అంతే కేంద్ర పెద్దలు రంగంలోకి దిగారు. ఈడీకి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వాన్ని మోసం చేసిన బాయిల్డ్ రైస్ మిల్లర్ల పని పట్టేందుకు రంగంలోకి దిగారు. అక్రమ మిల్లర్ల బరతం పట్టే పనిలోవున్నారు. ఆదివారం రాత్రి నుంచి సూర్యాపేట జిల్లా కోదాడ లోని రైస్ మిల్లుకు చెందిన వ్యక్తి బందువుల ఇంట్లో సోదాలు మొదలు పెట్టారు. ఇక రాష్ట్రమంతా ఈడీ దాడులు మొదలయ్యాయి. ఎంత మంది బైటకు వస్తారో చూడాలి. ప్రభుత్వాన్ని ఎంత మోసం చేశారో అనేది వెలుగులోకి రానున్నది. చూద్దాం. ఏం జరగుతుందో!!
