`మున్సిపల్ ఎన్నికలలో పార్టీలకు గుండె దడ?
`రెబెల్స్ ను కూడా పార్టీలు ప్రోత్సహిస్తున్నాయా?
`అన్ని పార్టీల స్థానిక నాయకత్వం చేతులెస్తోందా?
`జగిత్యాలలో జీవన్ రెడ్డి రెబెల్స్ తరుపున ప్రచారం చేస్తున్నారు?
`పార్టీ మారిన ఎమ్మెల్యేలున్న చోట కాంగ్రెస్ కు తలనొప్పులు?
`బీఆరఎస్ కు రెబెల్స్ బెడద కాస్త తక్కువే?
`బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు రెబెల్స్ చుక్కలు చూపిస్తున్నారు?
`ఉత్తర తెలంగాణాలో బీజేపీ, కాంగ్రెస్ లో ఎక్కువగా రెబెల్స్ రంగంలో వున్నారు?
`రెబెల్స్ గెలిస్తే పరిస్థితిలో మార్పు రాదు?
`రెబెల్స్ మూలంగా బీజేపీ, కాంగ్రెస్ లు ఓడిపోతే మొదటికే మోసం వస్తుంది?
`రాష్ట్ర రాజకీయాల మీద తీవ్ర ప్రభావం పడుతుంది?
హైదరాబాద్, నేటిధాత్రి:
మున్సిపల్ ఎన్నికల్లో చాలా చోట్ల ఆయా పార్టీలకు చెందిన నాయకులు పెద్దఎత్తున రెబల్స్‌గా నామినేషన్లు వేశారు. అందులో కొంత మంది పార్టీలు బుజ్జగిస్తే విన్నారు. చాలా చోట్ల వినలేదు. పార్టీల మాట లెక్క చేయలేదు. పార్టీలు ప్రకటించిన అభ్యర్దులకంటే రెబెల్సే మరింత ఉత్సాహంగా కనిపిస్తున్నారు. దూకుడుగా రాజకీయం చేస్తున్నారు ప్రచారంలో అసలైన అభ్యర్ధులకంటే ముందున్నారు. ప్రజలను కలుస్తున్నారు. ఎందుకంటే రెబెల్స్‌గా పోటీ చేసి పరువ పోగొట్టుకోవడం రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బందికరంగా మారుతుంది. ఒక వేళ గెలిస్తే పార్టీలో పట్టు దొరుకుతుంది. పార్టీలో గౌరవం పెరుగుతుంది. గుర్తింపు లభిస్తుంది. ఆదిపత్యం చూపించుకునే అవకాశముంటుంది. పోగొట్టుకున్న చోటే వెతుక్కొని లాతభపడ్డట్లుంటుంది. అందుకే తమను తక్కువగా అంచనా వేసిన స్దానిక నాయకుల మీద పై చేయి సాదించినట్లౌవుంది. పార్టీ ఇక భవిస్యత్తులో తనపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించే పరిస్తితి వుంటుంది. రెబెల్‌గా పోటీ చేసి గెలిస్తే ఇన్ని రకాల మర్యాదలు పార్టీలో వుంటాయి. ఇవే కాకుండా ఒక వేళ గెలిస్తే, మెజార్టీ స్దానాలు పొందిన పార్టీకి గెలిచిన రెబెల్స్ అవసరం రావొచ్చు. ఊహించని విదంగా రెబల్స్‌కే పదవులు అందొచ్చు. ఇలా అనేక రకాల రాజకీయ లాభలు వుంటాయి. కొన్ని సార్లు ఇలా రెబెల్స్‌గా గెలిచిన వాళ్లు చైర్మన్లు, వైస్ చైర్మన్లు అయిన వాళ్లు కూడా వున్నారు. ఏ అవకాశం ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించేది కాదు. వారి వారి పార్టీలు టికెట్లు ఇవ్వకపోవడం కూడా కొన్ని సార్లు అదష్టాన్ని తీసుకురావొచ్చు. అందుకే పార్టీలో ఎంతో కొంత పేరుండి, ప్రజల్లో పలుకుబడి వున్న వాళ్లు ఇలా రెబెల్స్‌గా పోటీ చేసిన గెలిచిన సందర్భాలు అనేకం వున్నాయి. రాత్రికి రాత్రి పెద్ద పెద్ద నాయకులైన వారు కూడా వున్నారు. అందుకే పార్టీలు పక్కన పెట్టిన వారు ఆత్మాభిమానం చంపుకోలేక రెబెల్స్‌గా పోటీ చేసి గెలుస్తుంటారు. ఈసారి ఆ బెడద అన్ని పార్టీలకు ఎక్కువైందనే చెప్పాలి. అంతే కాకుండా జగిత్యాల జిల్లాలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఏకంగా రెబల్స్నే ప్రోత్సహిస్తున్నారు. వారి తరుపున ప్రచారం చేస్తున్నారు. పార్టీ ప్రకటించిన అభ్యర్ధులను ఓడించాలని చెబుతున్నారు. పదేళ్లుగా పార్టీని పట్టుకొని, నమ్ముకొని వున్న వారిని రెబెల్స్‌గా రంగంలోకి దింపారు. ఇలా గతంలో ఎప్ప్పుడూ జరగలేదు. ఇలా తిరుగుబాటు పెద్ద నాయకులతో కూడా ఎదురైన సందర్భం గతంలో చూడలేదు. కాకపోతే ఈసారి రెబెల్స్ వల్ల పార్టీలకు గుండె దడలు వస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదు. ఎన్నికల ప్రచారం తారాస్దాయికి చేరుకున్నది. మున్సిపోల్స్‌లో మునిగేదెదరు? లేలేదెవరు? అనే చర్చ మొదలైంది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడు కనిపిస్తుందా? లేక కారు దూసుకుపోతుందా? అనే ఉత్కంఠ మొదలైంది. దానికి తోడు కమలం వికసిస్తుందా? అనే మాటలు కూడా అక్కడక్కడా వినిపిస్తున్నాయి. పట్టణ ప్రాంతాలలో పట్టు ఏ పార్టీకి వుంది? అనేది మాత్రం ఎవరికీ అంతు పట్టడం లేదు. సహజంగా పట్టణ ప్రజలు కోరుకునేదేమిటి? అనేది రాజకీయ పార్టీలకు తెలుసు. కాని పట్టణ ప్రజలకు ఈ రెండేళ్ల కాలంలో న్యాయం జరిగిందా? అనేది ఎన్నికలు జరిగి, ఫలితాలు వస్తే గాని తెలియదు. మున్సిపల్ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీల ప్రభావం కాంగ్రెస్ మీద పడుతుందా? లేదా అనేది పెద్ద మిస్టరీగా మారింది. జనం కాంగ్రెస్‌ను కూడా ఎక్కడా నిలదీస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. నిజంగా జనంలో ఆక్రోశం వుంటే ఆరుగ్యారెంటీలు ఏవి? అని అడిగేవారేమో! ఇదిలా వుంటే తెలంగాణలో బిఆరఎస్ బలం చెక్కు చెదరకుండా వుందా? లేదా అన్నది కూడా ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో తేటతెల్లమౌతుందని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే పట్టణ ప్రజలు కొంత వి ద్యావంతమైన సమాజంతో కూడుకొని వుంటుంది. ప్రజలు అభివద్దిని కోరుకుంటారు. గత పదేళ్ల బిఆరఎస్ పాలన, రెండేళ్ల కాంగ్రెస్ పాలనను అంచనా వేసుకొని ఓట్లు వేస్తారని చెప్పడం అతిశయోక్తి కాదు. ప్రజలు కాంగ్రెస్ పాలనలో సంతోషంగా వున్నారా? లేదా? అన్నది మాత్రం స్పష్టమౌతుంది. అయితే పట్టణ యువత ఎటు వైపు మొగ్గుచూపుతుంది? అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇటీవల యువత బిజేపి మంత్రం జపిస్తున్నారు. బిజేపి వైపు ఆకర్షితులౌతున్నారు. అదే బిజేపికి కొంత అనుకూలమైన వాతావరణం తీసుకొస్తుందా? అనే చర్చ కూడా జోరుగానే సాగుతోంది. మున్సిపోల్స్‌లో అసలైన ప్రచారం ఊపందుకున్నది. సిఎం. రేవంత్ రెడ్డి రంగ ప్రవేశంతో మొదలైందనే చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే మున్సిపల్ ఎన్నికలు హడావుడిగా నిర్వహించేందుకు యుద్ద ప్రాతిపదికన సన్నాహాలు చేశారు. కాని అన్ని పార్టీలలో ఈ ఎన్నికలపై నాయకులకు ఇంత ఆసక్తి వుందని ముందు ఎవరూ ఊహించలేదు. నిజానికి పంచాయితీ సర్పంచ్ ఎన్నికల మందు కాంగ్రెస్‌లో కూడా పెద్దగా ఊపు కనిపించలేదు. ఓ వైపు ఆరు గ్యారెంటీల ప్రభావం పల్లెల్లో ఎలా వుంటుందో అని అందరూ భయపడ్డారు. కాంగ్రెస్‌పార్టీ నాయకులు కూడా సర్పంచ్ ఎన్నికల కోరలేదు. ఎప్ప్పుడైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ గెల్చుకున్నదో అప్ప్పుడు కాంగ్రెస్‌లో ఆశ మొదలైంది. ఫలితాలు కూడా ఆశాజనంగానే వుంటాయన్న నమ్మకం ఏర్పడింది. దాంతో పంచాయితీ ఎన్నికల ధైర్యం చేశారు. ఊహించినట్లుగానే ఎంతో కొంత మెరుగైన ఫలితాలే సాదించారు. ప్రభుత్వ వ్యతిరేకత పెద్దగా లేదని గమనించారు. అయితే మున్సిపల్ ఎన్నిÅ£లకు ఇప్పట్లో వెళ్తారని అనుకోలేదు. పంచాయితీ సర్పంచ్ ఎన్నికల్లో మెజార్టీ సర్పంచ్‌లు కాంగ్రెస్ గెల్చుకున్నది. అదే ఊపులో మున్సిపల్ ఎన్నికల్లో దూకుడు ప్రదర్శించాలని కాంగ్రెస్ అనుకుంటోంది. అదే సమయంలో కారు పార్టీ కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విల్లూరుతోంది. సర్పంచ్ ఎన్నికలు పార్టీ గుర్తుల మీద గెలిచే అవకాశం లేదు. కాని మున్సిపల్ ఎన్నికలు మాత్రం పార్టీల గుర్తుతోనే నిర్వహిస్తారు. ఇప్ప్పుడు అసలైన ఆట వుంటుందని బిఆరఎస్ అనుకుంటోంది. కాకపోతే రెండు పార్టీలలోనూ రెబల్స్ బెడద మరీ ఎక్కువైపోయింది. గతంలో అవకాశాలు రాలేదని బిఆరఎస్‌లో చాలా మంది నాయకులు ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తున్నారు. అదే సమయంలో పదేళ్ల పాటు పార్టీని పట్టుకొని వున్న వాళ్లకు కాకుండా కొత్తగా పార్టీలోకి చేరినవారికి టిక్కెట్లు ఇస్తున్నారని కాంగ్రెస్‌లో కూడా రెబెల్స్ విపరీతంగా పెరిగారు. దాంతో రెండు పార్టీలలో దడ మొదలైంది. అంతే కాదు ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో బిజేపిలో కూడా రెబల్స్ పోటీ చేయడం విశేషం. కరీంనగర్లో కాంగ్రెస్, బిఆరఎస్ పార్టీలకన్నా బిజేపి పార్టీ ఎక్కువగా రెబల్స్ బెడదను ఎదుర్కొంటోందని తెలుస్తోంది. ఇలా రెబల్స్ పార్టీల కొంప ముంచుతారా? లేక వాళ్లే గెలిచి పార్టీలకు సవాలుగా మారుతారా? అనే సందేహం వ్యక్తమౌతోంది. నిన్నటి దాకా రెబల్స్‌ను బుజ్జగించే ప్రయత్నం పార్టీలు బాగానే చేశాయి. అదికార కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి, మున్సిపల్స్‌లో అవకాశం రాని వారికి నామినెఏటెడ్ పోస్టులు ఇస్తామని కూడా ప్రకటించింది. అందుకు సిఎం. రేవంత్‌రెడ్డి కూడా హమీ ఇచ్చారు. అయినా చాలా చోట్ల కాంగ్రెస్ నాయకులు వెనక్కి తగ్గడం లేదు. ముఖ్యంగా బిఆరఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ఈ సమస్య మరింత ఎక్కువగా వుంది. జగిత్యాల జిల్లాలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని దుమ్మెత్తిపోశారు. జగిత్యాలతో టికెట్ల కేటాయింపు తన చేత కాకుండా పార్టీ మారిన సంజయ్‌కి ఎక్కువ టిక్కెట్లు ఇ చ్చారు. దాంతో కాంగ్రెస్ నాయకుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. ఒక దశలో కాంగ్రెస్ నాయకులంతా ఎమ్మెల్యే సంజయ్ ఇంటికి వెళ్లి ఆయనను దూషించారు. పార్టీ మారిన వాళ్లకు టిక్కెట్లు ఇవ్వడాన్ని తప్ప్పు పట్టారు. పార్టీని ఇంత కాలం పట్టుకొని వేళాడిన వారికి అన్యాయం జరుగుతోందని మండి పడ్డారు. అయినా పార్టీ జీవన్ రెడ్డి మాటలు లెక్క చేయలేదు. దాంతో అక్కడ కూడా కాంగ్రెస్ రెబెల్స్ ఎక్కువ మంది బరిలో నిలిచారు. ఇలా పార్టీ మారిన ఎమ్మెల్యేలున్న చోట ఈ వివాదాలు మరింత ముదిరి పాకాన పడ్డాయి. అలాంటి మున్సిపాలిటీలలో గెలుపోటములు ఎలా వుంటాయన్నదానిపై ఆసక్తి నెలకొని వుంది. ఏది ఏమైనా ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో రెబెల్స్ కీలక భూమిక పోషిస్తారని చెప్పడంలో సందేహమే లేదు.
