Road Inspection for Farmers’ Convenience in Karakkagudem
రైతుల సౌకర్యార్థం రహదారి పరిశీలన
కరకగూడెం వైకుంఠధామం నుంచి మైసమ్మ చెట్టు వరకు రహదారి మరమ్మతులకు చర్యలు..
కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడె జిల్లా,, నేటిధాత్రి..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండలం,కరకగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని వైకుంఠధామం నుంచి మైసమ్మ చెట్టు పక్కగా ఉన్న రహదారి రైతుల రాకపోకలకు అనుకూలంగా లేకపోవడంతో, ఈరోజు మన అభిమాన నాయకులు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు , ఎన్.ఆర్.ఇ.జి. ఎస్ జేఈ తో మరియు గ్రామ పెద్దలు కొంపెల్లి పెద్ద రామలింగం గ,జలగం వెంకన్న ,స్తానిక రైతులతో కలిసి ఆ రహదారిని పరిశీలించడం జరిగింది.
ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి, త్వరితగతిన మరమ్మతులు చేపట్టాలని అధికారులను కోరడం జరిగింది. గ్రామంలోని మౌలిక వసతుల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తెలిపారు
