Lok Sabha Adjourned Before PM Modi’s Speech
3 ఏళ్ల బాల కార్మికురాలిని రక్షించిన టాస్క్ ఫోర్స్.. వీడియో వైరల్
అసోం రాజధాని గౌహతి పంజాబరిలో మానవత్వానికే మచ్చ తెచ్చే ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఒక ఇంట్లో బానిసలా మగ్గుతున్న 13 ఏళ్ల బాలికను జిల్లా కార్మిక టాస్క్ ఫోర్స్ అధికారులు రక్షించారు. బాలికను అత్యంత అమానవీయంగా మంచం లోపల ఉన్న ర్యాక్‌లో దాచిపెట్టారు.
ఇంటర్నెట్ డెస్క్: అసోం రాష్ట్రం గౌహతీ పంజాబరిలో ఓ కుటుంబం చిన్నారిని చిత్రహింసలకు గురి చేసింది. పనిలో పెట్టుకుని ఏడేళ్లుగా నరకం చూపించింది. ఈ విషయం గురించి తెలుసుకున్న జిల్లా కార్మిక టాస్క్ ఫోర్స్ అధికారులు ఆ ఇంటిపై దాడి చేశారు. అధికారులు ఇంటిని సోదా చేస్తున్న సమయంలో ఎక్కడా బాలిక కనిపించలేదు. అయితే, యజమానుల ప్రవర్తనపై అనుమానం వచ్చి బెడ్ కాట్(మంచం)ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మంచం లోపల ఒక ఇరుకైన ర్యాక్‌లో బాలికను కుక్కి దాచినట్లు గుర్తించిన అధికారులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు.
