CM Revanth Reddy Bhupalpally Visit on 8th
ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన
ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
భూపాలపల్లి నేటిధాత్రి
సీఎం రేవంత్ రెడ్డి గా భూపాలపల్లి జిల్లా పర్యటనలో భాగంగా కొడవటంచ ఆలయాన్ని సందర్శించి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించనున్న నేపథ్యంలో, జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ కొడవటంచ ఆలయంలో జరుగుతున్న నిర్మాణ పనులు, హెలిప్యాడ్ రోడ్డు ఏర్పాట్లను పరిశీలించారు.
అనంతరం భూపాలపల్లి పట్టణంలోని మంజూరు నగర్లో ఏర్పాటు చేయనున్న సభా ప్రాంగణ స్థలం, హెలిప్యాడ్, పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు తగు సూచనలు చేశారు.
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
