`ముమ్మాటికీ “కేసీఆర” తెలంగాణా ఆత్మ గౌరవమే.
`తెలంగాణా అంటేనే “కేసీఆర”..”కేసీఆర” అంటేనే తెలంగాణా.

`ఆత్మ గౌరవం అంటేనే “కేసీఆర”…
`“కేసీఆర” అంటేనే తెలంగాణా రక్షణ కవచం.

`తెలంగాణా కోసం కొట్లాడిన ధీరుడు “కేసీఆర”.
`తెలంగాణా సాధించిన వీరుడు “కేసీఆర”!
`తెలంగాణా ఆత్మ గౌరవం నిలబెట్టిన “దిరోధాత్తుడు కేసీఆర”.
`1969 నుంచి ఎంత మంది పోరాటం చేసినా ఎందుకు తెలంగాణా రాలేదు?
`ఆనాడు ఉద్యమం పేరు చెప్పి పదవులు పొందేవాళ్లు?
`తెలంగాణా కోసం పదవులు త్యాగం చేసి స్వరాష్ట్రం సాధించింది “కేసీఆర”.
`సినిమా నటుడు ఎన్టీఆర్ తెలుగు ఆత్మ గౌరవమా?
`ప్రజల కోసం పోరాటం చేసిన నాయకుడా ఎన్టీఆర్?
ఆంధ్రులకు ఎన్టీఆర్ అన్న అయినప్పుడు, “కేసీఆర” తెలంగాణా పిత ఎందుకు కాకూడదు?
`ఆత్మ గౌరవం అనేది ఆంధ్రులకే ఉంటుందా?
`దానికి ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడా?
`అంతకు ముందు పని చేసిన సిఎం లు ఎన్టీఆర్ ముందు బాలదూరా?
`తెలుగు బాష ను అడ్డం పెట్టుకొని లేని పొత్తు కలుపుకున్నారు?
`తెలుగు ఆత్మ గౌరవం లో తెలంగాణా ను ఒంటరి చేశారు?
`తెలుగు పేరు చెప్పుకొని దోచుకుతిన్నారు?
`ఆంధ్రులను అందలమేక్కించారు.. తెలంగాణా వారిని తొక్కి పెట్టారు?
`ఆ అణచివేత నుంచి ఉదయంచిన సూర్యుడే “కేసీఆర”
`తెలంగాణా వెలుగు కోసం తపించిన నాయకుడే “కేసీఆర”.
`“కేసీఆర” లాంటి ఉద్యమ నాయకుడు దక్షిణాది లోనే లేడు.
`“కేసీఆర” కు సాటి దక్షణాది లో ఏ ఒక్కరు లేరు.
`అందరూ పదవుల కోసం రాజకీయాలు చేసిన వారే?
`పుట్టిన గడ్డ తెలంగాణా విముక్తి కోసం రాజకీయం చేసిన ఏకైక నాయకుడు “కేసీఆర”.
60 ఏళ్ల కొట్లాటకు న్యాయం జరిగేదాకా పోరాటం చేసిన నాయకుడు “కేసీఆర”
ఉద్యమ సమయం లోనే పదవుల కోసం పోరాటం వదిలిన ద్రోహులున్నారు?
`పదవులుంటేనే ఉద్యమం చేస్తామన్నా స్వార్ధపరులున్నారు?
`పదవుల కోసం ఉద్యమాన్ని తాకట్టు పెట్టిన దుర్మార్గులున్నారు?
`ఉద్యమానికి ఎంతమంది వెన్నుపోట్లు పొడిచినా, గాయలను లెక్క చేయకుండా తెలంగాణా తెచ్చిన “దీశాలి కేసీఆర”.
`తెలంగాణా సమాజం “కేసీఆర” ను ఎంత కొలిచినా తక్కువే అవుతుంది?
”కేసీఆర” ను కాదనుకుంటే తెలంగాణా కుక్కలు చించిన విస్తరి అవుతుంది?
`తెలుగు దేశం ముసుగులో వున్నవారి వల్ల మళ్ళీ పొయ్యిలో పడుతుంది?
`తెలంగాణా కు “కేసీఆర్ శ్రీరామ రక్ష”.
హైదరాబాద్, నేటిధాత్రి:
అవును.. ముమ్మాటికీ కేసిఆర్ తెలంగాణ ఆత్మగౌరవమే. తెలంగాణ అంటేనే కేసిఆర్. ఆత్మగౌరవానికి నిలువెత్తు నిరదర్శమే కేసిఆర్. తెలంగాణ రక్షణ కవచమే కేసిఆర్. తెలంగాణకోసం కొట్లాడిన ధీరుడు కేసిఆర్. తెలంగాణ సాధించిన వీరుడు కేసిఆర్. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిýబెట్టిన దీరోధాత్తుడు కేసిఆర్. 1969 నుంచి తెలంగాణ పోరాటం సాగినా తెలంగాణ ఎందుకు రాలేదు? కేసిఆర్ కదన రంగంలో దూకేదాకా తెలంగాణ వస్తుందన్న నమ్మకం కలిగిందెందుకు? ఉద్యమం పేరు చెప్పి పదవులు పొందింది ఆనాటి నేతలు. పదవులు గడ్డిపోచల్లా వదులుకున్న నాయకుడు కేసిఆర్. సినీ నటుడు ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవమా? ఎవరు చెప్పారు? ఎందుకు చెప్పారు? ఏం సాదించాడని చెప్పారు? సినీ అవకాశాలు తగ్గుతూ, నటించిన సినిమాలు ఆడకపోతుండడంతో మనసు రాజకీయాల వైపు మళ్లించుకున్న నాయకుడు ఎన్టీఆర్. పదవుల కోసం రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు ఎన్టీఆర్ . అంతే తప్ప తెలుగు ప్రజల కోసం ఎన్టీఆర్ చేసిందేమీ లేదు. తెలుగు ప్రజల కష్టం మీద బతికింది ఎన్టీఆర్. తెరమీద వేషాలకు కాలం చెల్లడంతో రాజకీయాల్లోకి వచ్చారు. అంతే కాని తెలుగు ప్రజల కోసం ఏనాడు ఆయన రోడ్డెక్కింది లేదు. తెలుగు ప్రజల కోసం పోరాటం చేసింది లేదు. తెలుగు ప్రజలకు తన ఆస్దులు పంచిన నాయకుడు కాదు. తెలుగు ప్రజల కోసం త్యాగాలు చేసింది కాదు. తెలుగు ప్రజలు ఇబ్బందుల్లో వున్నప్ప్పుడు ఆదుకున్నది లేదు. కాని ఆ రోజుల్లో వున్న పరిస్తితుల్లో మరో రాజకీయ ప్రత్యామ్నాయం లేదు. తమిళనాడులో వుంటూ, తెలుగు సినిమాలు తీస్తూ, ఆస్దులు పోగేసుకున్న సినీ నటుడు ఎన్టీఆర్. తమిళ రాజకీయాల్లోకి నటులు చేరి, పాలకులు కావడంతో ఆశ పెరిగింది. తాను సిఎం. కావాలన్న కోరిక పెరిగింది. అంతే కాని తెలుగు ప్రజలకు ఆయన అంతకు ముందు చేసిందేమీ లేదు. కాంగ్రెస్ నాయకుల చుట్టూ రాజ్యసభ సభ్యత్వం కోసం తిరిగితే ఎవరూ ఇవ్వలేదు. ఎన్టీఆర్ అదష్టం బాగుండి, నాదేండ్ల బాస్కరరావు లాంటి వారు దగ్గరుండి ఎన్టీఆర్ను నాయకుడిని చేశారు. పదవులు ఆయనకు అప్పగించారు. అంతే కాని స్వతాహాగా ఆయన జీవితంలో ప్రజల కోసం ఆలోచించిందేనాడు లేదు. కాని కాలం కలిసొచ్చి నటుడయ్యారు. అదే కాలం కలిసొచ్చి సిఎం. అయ్యారు. అదే కాలం తిరగబడితే సొంత కుటుంబ సభ్యుల చేతనే చీకొట్టించుకున్నాడు. కుటుంబ సభ్యులే దూరం కొట్టారు. ఆఖరుకు ప్రభుత్వం నుంచి దింపేశారు. పదవీచ్చుతిన్ని చేశారు. ఇప్ప్పుడు రాజకీయం కోసం ఆయన పేరు వాడుకుంటున్నారు. ఆయనను దైవాంశ సంబూతుడు అనే దాకా వెళ్లారు. యుగ పురుషుడు అని కీర్తిస్తున్నారు. తెలుగువారి ఆత్మగౌరవం అంటూ ఆకాశానికికెత్తేస్తున్నారు. కేవలం రాజకీయం చేసిన ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవం అయినప్ప్పుడు తెలంగాణ తెచ్చిన కేసిఆర్ ఏం కావాలి. అంత కన్నా గొప్ప కావాలి. అందరికన్నా గొప్ప కావాలి. రాజకీయాలు తన స్వార్ధంకోసం చేసుకోలేదు. పదవులు తన స్వార్ధం కోసం పొందలేదు. అంతటి త్యాగధనడు కేసిఆర్. కేసిఆర్ అనే పదం తెలంగాణ పాలిట వేదంగా మారింది. అంతగొప్ప నాయకుడు తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక. నిజం చెప్పాలంటే కేసిఆర్ మాత్రమే కారణజన్ముడు. కేసిఆర్ మాత్రమే యుగపురుషుడు. కేసిఆర్ మాత్రమే తెలంగా కోసం ఉద్భవించిన నాయకుడు. తెలంగాణ గోస నుంచి పుట్టిన నాయకుడు కేసిఆర్. తెలంగాణను గోస నుంచి విముక్తి చెందించేందుకు ఉద్భవించిన జాతిపిత కేసిఆర్. ఆయన త్యాగం ముందు అందరూ దిగదుడుపే. దక్షిణాదిలోనే కేసిఆర్ లాంటి త్యాగధనుడు లేడు. కేసిఆర్ లాంటి పోరాట యోధుడు లేడు. కేసిఆర్ లాంటి నవ సమాజ నిర్మాణ దాత లేడు. కేసిఆర్ లాగా స్వరాష్ట్ర సాధకుడు లేడు. రాష్ట్రాన్ని సాధించిన ఘనత సాదించిన నాయకుడు మరొకరు లేరు. సాధించిన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో పదేళ్లలో నెంబర్ వన్ చేసిన నాయకుడు, పాలకుడు కేసిఆర్ తప్ప మరొకరు లేరు. ఇది కేసిఆర్ అంటే! అంతే కాని, ఆంద్రా మీడియాలో వార్తల్లో నిలిస్తే ఎన్టీఆర్ యుగపురుషుడు కాదు. తెలుగు వారి ఆత్మగౌరవ ప్రతీక కాదు. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ వారికే కాదు, తెలుగు వారికి కూడా ఆత్మగౌరవ ప్రతీక అంటే కేసిఆర్ మాత్రమే అని చెప్పాలి. ఎన్టీఆర్ పేరు చెప్పి తెలంగాణ లో తెలుగు వారి ఆత్మగౌరవం గురించి మాట్లాడేవారు తెలంగాణ ద్రోహులు. వారిని చరిత్ర క్షమించదు. కాలం చూస్తూ ఊరుకోదు. అయినా ఆత్మగౌరవం ఆంద్రులకే వుంటుందా? అసలు ఆత్మగౌరవం అనే పదానికి కూడా అర్దం తెలియని ఆంధ్రులు. ఆత్మ గౌరవం అంటే తన ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేయాలి. కాని పాలకుడిగా తెలంగాణకు తీరని అన్యాయం చేసిన నాయకుడు ఎన్టీఆర్. అలాంటి నాయకుడిని తెలంగాణ ప్రజలకు శత్రువే. తెలంగాణ ద్రోహుల లిస్టులో మొదటి వ్యక్తే! ఎన్టీఆర్ కాలంలో తెలంగాణ సాగు మొత్తం సంకనాకిపోయింది. తెలంగాణను అన్ని రంగాలలో సర్వనాశనం మొదలుపెట్టిందే ఎన్టీఆర్. తెలంగాణ సాగు రంగాన్ని నిర్వీర్యం చేసిందే ఎన్టీఆర్. చంద్రబాబు. తెలంగాణ రైతాంగానికి హర్స్పవర్కు రూ.50 అంటూ లెక్కగట్టి మరీ విద్యుత్ చార్జీలు వసూలు చేసింది ఎన్టీఆర్. నెలనెల విద్యుత్ బిల్లులు వసూలు చేసి, తెలంగాణను ఎడారి చేసింది చంద్రబాబు. ఎన్టీఆర్ హయాంలో క్వింటాలు వడ్లు రూ.100. కాని ఆనాడు ప్రభుత్వం నేరుగా వడ్లను కొనుగోలు చేసేది కాదు. ఒక ఎకరంలో ఆ రోజుల్లో మహా అయితే, ఇరవై క్వింటాళ్లు పండితే మహా ఎక్కువ. ఆ లెక్క చొప్ప్పును రైతుకు ఒక్క పంటకు ఒక ఎకరాలకు వచ్చే ఆదాయం రూ.2000. అందులో నారు పోసిన నాటి నుంచి నాట్లేసేదాకా, మునుం పట్టేదాకా, కలవ కలిసేదాక, కలుపు తీసేదాకా, కోత కోసే దాకా అయ్యే ఖర్చులు తడిసిమోపెడు. వరి కోసం అయ్యే ఎరువులు, పురుగు మందుల ధరలు ఆకాశం. అన్ని ఖర్చులు పోను ఆఖరుకు రైతుకు ఆ రోజుల్లో చేతికొచ్చే రొక్కం రూ.600. ఇదీ ఎన్టీఆర్ కాలంలో రైతుల ఆదాయం. ఎకరం సాగు చేసే రైతుకు ఆరు నెలలకు ఆరు వందలు. నెలకు కుటుంబమంతా కష్టపడితే వచ్చే ఆదాయం రూ.100. అదే ఆంద్రా ప్రాంతంలో నీటి తీరువా తప్ప మరో ఖర్చు వుండేది కాదు. కరంటు బిల్లు లేదు. కాలువల ద్వారా పారే నీటి వల్ల పెద్దగా ఎరువులు అవసరం లేదు. నీటి లభ్యత ఎక్కువ వుండడంతో దిగుబడులు ఎక్కువగా వచ్చేవి. వేసిన పంట అంతా చేతికొచ్చేది. కాని తెలంగాణలో వేసిన ఎకరంలో మొత్తం పంట చేతికి రాకుండా ఎండిపోయిన రోజులు కూడా అనేకం వున్నాయి. అదే సమయంలో ఆంద్రాలో తుఫానులకు పంట నష్టపోతే పరిహారం ఇచ్చేవారు. కాని తెలంగాణలో నీళ్లు లేక పంటలు ఎండిపోతే రూపాయి ఇచ్చేవారు కాదు. అలాంటి దుర్మార్గపు పాలకులు తెలంగాణను దోచుకున్నారు. పీల్చుకుతిన్నారు. కాల్చుకుతిన్నారు. సాటి తెలుగు ప్రజలైన తెలంగాణ జనాన్ని ఓట్ల కోసం, పదవుల కోసం, అదికారం కోసం సోదరులన్నారు. మనమంతా తెలుగువాళ్లమని నమ్మించి, మోసం చేశారు. తెలంగాణను నిండా ముంచారు. అలాంటి వాళ్ల ఆనవాళ్లే తెలంగాణలో వుండొద్దు. అప్పటి ఆ పాలకులను కీర్తించేవారు తెలంగాణ ద్రోహులు. అందుకే తెలంగాణ తెచ్చిన కేసిఆర్ మాత్రమే తెలంగాణకు దేవుడు. దైవాంశ సంబూతుడు. అపర భగీరధుడు. తెలంగాణ జాతిపిత. ఇలా ఎన్ని పేర్లు పెట్టుకున్నా తక్కువ. ఆయన తెచ్చి ఇచ్చిన తెలంగాణను కాపాడుకోవాల్సిన బాద్యత మనదే. తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు తమ్ముళ్లు అని గౌరవమా? తెలంగాణ తెచ్చిన ఉద్యమకారుల కూలీలు, గూండాలా? సిగ్గుమాలిన రాతలు రాసే, రోత పత్రికలను తెలంగాణ నుంచి తరిమికొట్టాలి. ఇప్పటికైనా బిఆరఎస్ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు మేలుకోవాలి.
