Chevella Urban Progress Possible Only With Congress Government
చేవెళ్ల పట్టణప్రగతి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం
* కాంగ్రెస్ నియోజకవర్గం ఇంచార్జి పామేన భీమ్ భరత్
• కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి
* చేవెళ్లలో పలు వార్డులలో ఎన్నికల ప్రచారంలో
మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, భీమ్ భరత్, కాలేయాదయ్య
చేవెళ్ల, నేటిధాత్రి:
రాష్ట్రంలో పట్టణ అభివృద్ధి ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ తోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జి పామేన భీమ్ భరత్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్ళ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్, చేవెళ్ల మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి సోమవారం చేవెళ్ల మున్సిపాలిటీలో పలు వార్డులలో వారు విస్తృతంగా పర్యటించి, ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ఓట్లు అభ్యర్థించారు. వార్డులలోని ప్రతి గల్లీలో తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి , కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసే అభ్యర్థులను ఎన్నుకోవాలని సూచించారు. ఆయా వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులను ‘చేయి’ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. వార్డులను ఆదర్శంగా తీర్చిదిద్దే బాధ్యతను తాము తీసుకుంటామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ఈ కార్యక్రమంలో చేవెళ్ల మున్సిపల్ సీనియర్ నాయకులు
పి ఏ సి ఎస్ చైర్మన్ దేవర వెంకట్ రెడ్డి, బండారి ఆగిరెడ్డి, జుకన్నగారి శ్రీకాంత్ రెడ్డి, గోనె ప్రతాప్ రెడ్డి, కాలే శ్రీకాంత్, పడాల ప్రభాకర్, అభ్యర్థి మద్దెల శ్రీనివాస్, బండారి శైలజ ఆగిరెడ్డి, దేవర సమత వెంకట్ రెడ్డి, మంగలి కళ్యాణి యాదగిరీ, చేవెళ్ళ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పెంట రెడ్డి , కాంగ్రెస్ పార్టీ వివిధ వార్డు అభ్యర్థులు స్థానిక కాంగ్రెస్ నాయకులు, ముఖ్య కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
