People Are Our Strength, Says Former MLA Challa Dharma Reddy
ప్రజలే మా బలం,ప్రజలే మా నమ్మకం
కుంకుమేశ్వర ఆలయంలో మాజీ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
పరకాల,నేటిధాత్రి
మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని శుక్రవారం పరకాల పట్టణంలోని 9వ వార్డు నుంచి ప్రారంభించారు.ఈ సందర్భంగా ముందుగా పరకాలలో ప్రసిద్ధిగాంచిన శ్రీ కుంకుమేశ్వర స్వామి ఆలయంలో పార్టీ నాయకులు,కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల్లో విజయానికి శ్రీ కుంకుమేశ్వర స్వామి ఆశీస్సులు కోరుకున్నారు.అనంతరం ప్రచార రథానికి వాహన పూజ నిర్వహించి ఇంటింటి ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించారు.ప్రచారంలో భాగంగా చల్లా ధర్మారెడ్డి గారు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పట్టణానికి జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు.అలాగే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అవగాహన కల్పించారు.పరకాల ప్రజలే తన బలం,తన రాజకీయ జీవితానికి మూలమని,ఈ ఎన్నికల్లో ప్రజల మద్దతుతో ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు,వార్డు స్థాయి కార్యకర్తలు,మహిళలు,యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
