Man Demands Justice in Quarter Land Dispute at Bellampalli
క్వార్టర్ స్థలం ఇప్పించి న్యాయం చేయాలి.
బెల్లంపల్లి నేటిధాత్రి :
గత 20 సంవత్సరాలుగా, నివాసం ఉంటున్న క్వార్టర్‌ను, కూల్చివేసి, ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్న దోనుగు లక్ష్మీపై చర్యలు తీసుకొని, నిర్మిస్తున్న ఇంటి నిర్మాణాన్ని సంబంధిత అధికారులు ఆపాలని, బొడ్డేల శంకర్ డిమాండ్ చేశారు.
సోమవారం బెల్లంపల్లి టేకుల బస్తి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ
బూడిదగడ్డ బస్తీలోని క్వార్టర్ నంబర్ 290 లో, దోనుగు లక్ష్మి భర్త పదవి విరమణ చేసి, క్వార్టర్ కాళీ చేసి గోదావరిఖని వెళ్లి పోయి నివసిస్తున్నారని, అనంతరం వేరే వారి పేరుపై క్వార్టర్‌ను చేయించి, మా అన్న తో సహా గత 25 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నామని, మా అన్న మరణించిన అనంతరం నేను ఒక్కడినే క్వార్టర్ లో ఉంటున్నానని, ఇరవై ఏళ్ళ క్రితం సింగరేణికి అప్పజెప్పి గోదావరిఖని లో నివాసముంటున్న దొణుగు లక్ష్మి అనే మహిళ, ఆమె ఇల్లు ఆమెకు ఉండగా, నా ఇంటిపై ఆశతో అక్రమంగా బెదిరింపులకు పాల్పడుతూ, పోలీసులకు ఫిర్యాదు చేస్తూ, నిర్దాక్షిణ్యంగా నా ఇంటిని పోలీసుల పహారాలో జేసీబీ తో కూల్చివేసి, ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తుందని వాపోయాడు. నాకు వెనకా ముందు ఎవ్వరూ లేకపోవడంతో, నన్ను వేధింపులకు గురి చేస్తూ, నన్ను పోలీస్ స్టేషన్ కు పిలిపిస్తూ ఆందోళనకు గురి చేస్తున్నారనీ, ఈ విషయమై జిల్లా కలెక్టర్ కు ప్రజావాణి కార్యక్రమంలో పిర్యాదు చేయగా, కలెక్టర్ ఆదేశాల మేరకు గొడవలు సద్దుమణిగే వరకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణాన్ని ఆపివేయాలని ఆదేశించినా, స్థానిక మున్సిపల్ అధికారులు లక్ష్మి కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించాడు. సంబంధిత అధికారులు తమకు క్వార్టర్ స్థలాన్ని ఇప్పించి, న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు.
తమకు న్యాయం చేయకుంటే అదే స్థలంలో ఆత్మహత్య చేసుకుంటానని, దానికి అధికారులే పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరించాడు..
