Youth Should Follow Ambedkar Ideals: Banothu Sarangapani
అంబేద్కర్ ఆశయ సాధన కొరకై యువత ముందుకు నడవాలి.
#భారత రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులర్పించిన బానోతు సారంగపాణి.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని, మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు డాక్టర్ బానోతు సారంగపాణి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ మేరకు ఆయన మాట్లాడుతూ, దేశ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించిన ఘనత భారత రాజ్యాంగానికే దక్కుతుందని కొనియాడారు. డాక్టర్ అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.రాజ్యాంగబద్ధమైన విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్, బీసీ హక్కుల సాధన సమితి జిల్లా కార్యదర్శి చింతకింది కుమారస్వామి,సర్పంచ్ నాగేల్లి జ్యోతి ప్రకాష్, మాజీ ఎంపీటీసీలు వైనాల వీరస్వామి, జన్ను జయరావు , వార్డు మెంబర్లు కనకం నవీన్, నాగేల్లి అనిల్, పరికి కోర్నేలు, బూస సదయ్య, అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
