శ్రీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న అసెంబ్లీ ఇంచార్జ్ వెలిచాల రాజేంద్ర రావు
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ మార్కెట్ రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో శనివారం కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలిచాల రాజేందర్ రావు పాల్గొన్నారు. ఈసందర్భంగా అర్చకులు రాజేంద్ర రావుకు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా అర్చకులు అర్చన, ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పలువురు కాంగ్రెస్ నేతలు, ఆలయ ధర్మకర్తలు, ఆలయ అధికారులు భక్తులు పలువురు ప్రతినిధులతో కలిసి రాజేందర్ రావు ఊరేగింపుగా వెళ్లి పాత బజార్ లోని శివాలయం నుంచి పుట్ట బంగారం కోసం వెళ్లి, శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పుట్ట బంగారం శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయానికి తీసుకొచ్చారు. అనంతరం జరిగిన తదితర పూజ కార్యక్రమాల్లో రాజేందర్రావు పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, ఆలయ అధికారులు, ఆలయ ధర్మకర్తలు, పలువురు నేతలు, మహిళలు, భక్తులు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
