ఓటు హక్కు ఉన్న ఓటర్ ఓటు వేసే ప్రజాసామ్య విలువలు కాపాడాలి
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురబి
వనపర్తి నేటిధాత్రి .
వనపర్తి జిల్లా లో ఓటు హక్కు ఉన్న ప్రతి ఓటరు మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని ఓటు వేసే ప్రజాస్వామ్యలో విలువలను కాపాడాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు.
జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యలయంలో అధికారుల తో ఓటరు దినోత్సవం పై ప్రతిజ్ఞ చేయించారు.భారత దేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో, మన దేశ ప్రజాస్వామ్య విలువలు సాంప్రదాయాలను, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత oగా జేరుగుటకు ఎలాంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా, ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేయించారు ఈకార్యక్రమంలో
అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య,మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు, ప్రతిజ్ఞలో పాల్గొన్నారు.
