భాజపా ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు
నర్సంపేట,నేటిధాత్రి:
స్వతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను శనివారం నర్సంపేట పట్టణంలోని ఆయన విగ్రహం వద్ద భారతీయ జనతా పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు గూడూరు సందీప్ ఆధ్వర్యంలో చేపట్టగా సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి..
నేను మీకు స్వేచ్ఛనిస్తాను అని భారత స్వాతంత్ర్య పోరాట కాలంలో మంత్రంలా వినిపించిన సుభాష్ చంద్రబోస్ సమర నినాదం అని పేర్కొన్నారు.జననమే తప్ప మరణం లేని మహా నేతగా దేశ ప్రజల హృదయాల్లో ‘నేతాజీ’గా చిరస్థాయిగా నిలచిన అమరుడు అని తెలిపారు.
జనవరి 23 న సుభాష్ చంద్రబోస్ జయంతిని ‘పరాక్రమ్ దివస్’ గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కౌన్సిల్ మెంబర్ పొదిల్లా రామచందర్, సీనియర్ నాయకులు నూనె రంజిత్, పోనుగొటి రవీంద్రచారి,సోషల్ మీడియా ఇంచార్జ్ కోమండ్ల సప్తగిరి, బిజెపి పట్టణ ఉపాధ్యక్షులు ఠాకూర్ విజయ్ సింగ్,కాసుల నాగేంద్రబాబు, వరంగంటి రాజ్ కుమార్,యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు కొంకిసా విగ్నేష్ గౌడ్,చిలువేరు అన్వేష్,తప్పెట్ల సతీష్, ఏబీవీపీ జిల్లా నాయకులు శ్రావణ్,రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
