ఘనంగా నేతాజీ జయంతి
కేసముద్రం/ నేటి ధాత్రి
మండల కేంద్రంలోని శ్రీ వివేకవర్ధిని హైస్కూల్ లో శుక్రవారం స్వామి నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల కరస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్ నేతాజీ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన అపూర్వ త్యాగాలను గుర్తు చేశారు. స్వాతంత్ర పోరాటంలో ఆయన చూపిన ధైర్యసాహసాలు, దేశభక్తి, నాయకత్వ గుణాలు నేటి యువతకు ఆదర్శంగా నిలవాలని అన్నారు. విద్యార్థులు నేతాజీ ఆశయాలను జీవితంలో ఆచరించాలని సూచించారు.
వసంత పంచమి సందర్భంగా పాఠశాలలో సరస్వతి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
