పేదింటి ఆడబిడ్డలకు వరప్రదాయిని కళ్యాణలక్ష్మి
కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే దొంతి
నర్సంపేట,నేటి ధాత్రి:
పేదింటి ఆడబిడ్డలకు వరప్రదాయిని కళ్యాణలక్ష్మి పథకం అని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు.
ప్రజా ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలో సిటిజెన్ క్లబ్ లో నర్సంపేట డివిజన్ పరిధిలోని నర్సంపేట నల్లబెల్లి,దుగ్గొండి,ఖానాపురం,చెన్నారావుపేట,నెక్కొండ మండలాలతో పాటు నర్సంపేట పట్టణం సంబంధించిన 305 మంది లబ్ధిదారులకు రూ. 3 కోట్ల 5 లక్షల విలువైన కళ్యాణ లక్ష్మీ ,షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు.రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నర్సంపేట ఆర్డీవో ఉమారాణి అధ్యక్షతన కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది.
పేద ప్రజలకు అండగా ఉంటూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందజేస్తుందని లక్ష్యమని తెలిపారు.కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా అర్హులు ఎటువంటి దళారులకు నమ్మవద్దని తెలిపారు.పెళ్లి చేసిన ఇంటికి ఆర్ధిక సహాయం అందించాలని ప్రభుత్వ నిర్ణయమని చెప్పారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్,వైస్ చైర్మన్ హరిబాబు,ఎమ్మర్వోలు రవిచంద్రారెడ్డి,రెవెన్యూ ఇన్స్పెక్టర్స్,అధికారులు,సర్పంచ్ లు,
ప్రజా ప్రతినిధులు,అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
