గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం
◆-: గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి : జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య.
జహీరాబాద్ నేటి ధాత్రి:
గ్రామాల సర్వతోముఖాభివృద్ధిలో సర్పంచుల పాత్ర అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు.గురువారం సంగారెడ్డి పట్టణంలోని దుర్గాబాయి దేశముఖి మహిళా శిశు వికాస కేంద్రంలో నూతనంగా ఎన్నికైన సర్పంచుల కోసం ఏర్పాటు చేసిన శిక్షణ తరగతుల మొదటి బ్యాచ్ ముగింపు సందర్భంగా జిల్లా కలెక్టర్ హాజరై మాట్లాడారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామాలకు మంచి జరగాలంటే సర్పంచులు పంచాయతీ రాజ్ చట్టం–2018పై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నూతనంగా ఎన్నికైన సర్పంచులకు ఆరు బ్యాచులుగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ శిక్షణలో గ్రామ పంచాయతీల పనుల నిర్వహణ, గ్రామాభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న కుటుంబ సంక్షేమం, విద్య, ప్రజారోగ్యం, సామాజిక అభివృద్ధి వంటి కార్యక్రమాలపై పూర్తి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణను సర్పంచులు సద్వినియోగం చేసుకుని తమ గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ డి పి ఓ జానకి రెడ్డి , డీఎల్పీఓలు అనిత, అమృత, సంజీవరావు, పంచాయతీరాజ్ అధికారులు, సర్పంచులు, సిబ్బంది ఝరాసంగం మండలం నుండి బొరేగౌ సర్పంచ్ నాగేందర్ పాటిల్, జీర్లపల్లి సర్పంచ్ అమరేశ్వరి, బర్థిపూర్ సర్పంచ్ రాజు, బిడకన్నే సర్పంచ్ రవి, పలు గ్రామాల సర్పంచ్ లు పాల్గొన్నారు..
